ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
అందరికి కావాలి యేసయ్య రక్తము (2) / పాపము లేని పరిశుద్ధుని రక్తము / ఇది పాపుల కొరకై వొలికిన / పరమ వైద్యుని రక్తము (2) / కుల మత బేధం లేని రక్తము / అందరికి వర్తించే రక్తము (2) / కక్ష్య క్రోధం లేని రక్తము / కన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి|| / కోళ్ళ రక్తముతో పాపం పోదు / ఎడ్ల రక్తముతో పాపం పోదు (2) / ఈ పాపము కడిగే యేసు రక్తము / సాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి|| / చీకటి శక్తుల అణిచె రక్తము / రోత బతుకును కడిగే రక్తము (2) / రక్తములోనే ప్రాణమున్నది / పాపము కడిగే గుణమున్నది (2) / రక్తములోనే పవ్వరున్నది / స్వస్తపరిచే గుణమున్నది (2) ||అందరికి||
జీవనదిని నా హృదయములో / ప్రవహింప చేయుమయ్యా (2) / శరీర క్రియలన్నియు / నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| / బలహీన సమయములో / నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| / ఎండిన ఎముకలన్నియు / తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| / ఆత్మీయ వరములతో / నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని|| / హల్లెలూయా ఆమెన్ / ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2) ||జీవ నదిని||
ఎవరూ లేక ఒంటరినై / అందరికి నే దూరమై (2) / అనాథగా నిలిచాను / నువ్వు రావాలేసయ్యా (4) / స్నేహితులని నమ్మాను మోసం చేసారు / బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2) / దీనుడనై అంధుడనై / అనాథగా నే నిలిచాను (2) / నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| / నేనున్నాను నేనున్నానని అందరు అంటారు / కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) / దీనుడనై అంధుడనై / అనాథగా నే నిలిచాను (2) / నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| / చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి / శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2) / దీనుడనై అంధుడనై / అనాథగా నే నిలిచాను (2) / నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
గీతం గీతం జయ జయ గీతం / చేయి తట్టి పాడెదము (2) / యేసు రాజు లేచెను హల్లెలూయ / జయ మార్భటించెదము (2) || గీతం|| / చూడు సమాధిని మూసినరాయి / దొరలింపబడెను / అందు వేసిన ముద్ర కావలి నిల్చెను / దైవ సుతుని ముందు || గీతం|| / వలదు వలదు యేడువవలదు / వెళ్ళుడి గలిలయకు / తాను చెప్పిన విధమున తిరిగి లేచెను / పరుగిడి ప్రకటించుడి || గీతం|| / అన్న కయప వారల సభయు / అదరుచు పరుగిడిరి / ఇంక దూత గణముల ధ్వనిని వినుచు / వణకుచు భయపడిరి || గీతం|| / గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి / జయ వీరుడు రాగా / మీ మేళతాళ వాద్యముల్ బూర / లెత్తి ధ్వనించుడి || గీతం||
చాలునయ్యా చాలునయ్యా / నీ కృప నాకు చాలునయ్యా (2) / ప్రేమామయుడివై ప్రేమించావు / కరుణామయుడివై కరుణించావు (2) / తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2) / ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| / జిగటగల ఊభిలో పడియుండగా / నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) / హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా / హిమము కంటెను తెల్లగ మార్చయ్యా / నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా / నా జీవితమంతా అర్పింతు నీకయ్యా / ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| / బంధువులు స్నేహితులు త్రోసేసినా / తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) / నన్ను నీవు విడువనే లేదయ్యా / మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా / నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ / నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా / ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||
ఇది కోతకు సమయం / పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2) / పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు|| / కోతెంతో విస్తారమాయెనే / కోతకు పనివారు కొదువాయెనే (2) / ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు|| / సంఘమా మౌనము దాల్చకుమా / కోసెడి పనిలోన పాల్గొందుమా (2) / యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు|| / శ్రమలేని ఫలితంబు మీకీయగా / వలదంచు వెనుదీసి విడిపోదువా (2) / జీవార్ధ ఫలములను భుజియింపవా (2) ||ఇది కోతకు||
అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా / అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా / యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2) / నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల|| / దేవతలకన్నా దయగలవాడవు / క్షమించు మనసున్న మహారాజువు (2) / ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు / ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల|| / గాలి తుఫానులను ఆపినవాడవు / నీటిపై నడచిన నిజ దేవుడవు (2) / జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు / శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ వార్త వినరండే / యేసయ్యను నమ్ముకొండే (2) / మానవ జాతి పాపము కొరకై (2) / కన్నీరు విడుస్తుండు / ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా|| / లోకమంతటా యేసు రక్తము (2) / ఎరువుగ జల్లిండే / మరణపు ముల్లును విరిచిండే (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఓ పల్లె చెల్లెల్లారా / ఓ పట్నం అక్కల్లారా (2) / బట్టలు మార్చితే బ్రతుకు మారదు / గుండు కొడితే నీ గుణం మారదు / బతుకు మారడం బట్టల్ల లేదు / గుణం మారడం గుండుల లేదు / నీ మనసు మారాలన్నా / నీ బుద్ది మారాలన్నా / నీ మనసు మారాలక్కా / నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| / పాపం లేని యేసు దేవుణ్ణి / నమ్ముకుందామమ్మా / దేవుడు మంచి దేవుడమ్మా (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ సత్యమినరండే / ఇది కల్ల కాదు చెల్లె / ఇది కల్ల కాదు తమ్మి / ఇది కల్ల కాదు తాత / ఇది కల్ల కాదు అవ్వ / ఇది కల్ల కాదు అన్న / ఇది కల్ల కాదు అక్క
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము / ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2) / యేసు నామము జయం జయము / సాతాను శక్తుల్ లయం లయము (2) / హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) / పాపముల నుండి విడిపించును / యేసుని నామము (2) / నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును / క్రీస్తేసు నామము (2) ||యేసు నామము || / సాతాను పై అధికార మిచ్చును / శక్తి గల యేసు నామము (2) / శత్రు సమూహము పై జయమునిచ్చును / జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము || / స్తుతి ఘన మహిమలు చెల్లించుచు / క్రొత్త కీర్తన పాడెదము (2) / జయ ధ్వజమును పైకెత్తి కేకలతో / స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||
భాసిల్లెను సిలువలో పాపక్షమా / యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| / కలువరిలో నా పాపము పొంచి / సిలువకు నిన్ను యాహుతి చేసి / కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| / దోషము చేసినది నేనెకదా / మోసముతో బ్రతికిన నేనెకదా / మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను|| / పాపము చేసి గడించితి మరణం / శాపమెగా నేనార్జించినది / కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| / నీ మరణపు వేదన వృధా గాదు / నా మది నీ వేదనలో మునిగెను / క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను|| / ఎందులకో నాపై ఈ ప్రేమ / అందదయ్యా స్వామీ నా మదికి / అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| / నమ్మిన వారిని కాదన వనియు / నెమ్మది నొసగెడి నా ప్రభుడవని / నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
చెట్టు చూస్తే పచ్చగుంది / పూత లేదు కాత లేదు (2) / వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా / రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా (2) / కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే (2) / కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా / కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా (2) ||చెట్టు|| / కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను (2) / ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను (2) / పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా / కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు|| / పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు (2) / ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా / నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా (2) ||చెట్టు|| / కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి (2) / పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా / పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు|| / పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి (2) / పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను (2) / కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి (2) / పూత కాత బలముగాయెనా నా యేసయ్యా / ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా (2) ||చెట్టు||
నీవే నా దేవుడవు ఆరాధింతును / నీవే నా రాజువు కీర్తించెదను (2) / మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే / మరణమునుండి జీవముకు నను దాటించావు / పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి / చీకటినుండి వెలుగునకు నను నడిపించావు / హోసన్నా మహిమా నీకే / హోసన్నా ప్రభావము రాజునకే (2) / నీవే నీవే నీవే నీవే (2) / పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే / విలువైన నీ కృపచే నను రక్షించావు / కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి / పాపమును క్షమియించి నను విడిపించావు / హోసన్నా మహిమా నీకే / హోసన్నా ప్రభావము రాజునకే (2) / నీవే నీవే నీవే నీవే (2)