తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

ఏం చేసానయ్యా నీకోసం|Em Chesaanayyaa Neekosam

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) / ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) / ఒక్కరినైనా ఒక ఆత్మనైనా / రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| / ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా / మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా / నిన్నే ఎదిరించానా (2) / ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) / నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| / ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా / శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా / నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా || / ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా / భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా / సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల|Iyyaala Intla Repu Mantla

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) / ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| / నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది / జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2) / గుండు సూదికి గ్యారెంటి ఉంది / నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| / ఎం ఏ చదువులు చదివే అన్న / బి ఏ చదువులు చదివే అన్న (2) / ఎం ఏ చదువులు ఏటి పాలురా / బి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| / మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా / అందం చందం ఎంత ఉన్నా (2) / యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా / ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల|| / సబ్సే బడా రూపాయంటావు / రూపాయీ అన్నిస్తదంటావు (2) / రూపాయీ పరలోకమివ్వదు / రూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల||

అత్యున్నత సింహాసనముపై (యేసన్న)|Athyunnatha Simhaasanamupai Yesanna

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా / దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా / యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు / నా మనసార నీ సన్నిధిలో / సాగిలపడి నమస్కారము చేసేదా / సాగిలపడి నమస్కారము చేసేదా (2) / ప్రతి వసంతము నీ దయా కిరీటమే / ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) / ప్రభువా నిన్నే ఆరాధించెద / కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| / పరిమలించునే నా సాక్ష్య జీవితమే / పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) / పరిశుద్ధాత్మలో ఆనందించెద / హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత|| / పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే / నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) / యెహోవ నిన్నే మహిమ పరచెద / స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||

సర్వ యుగములలో సజీవుడవు|Sarva Yugamulalo Sajeevudavu

సర్వ యుగములలో సజీవుడవు / సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును / కొనియాడదగినది నీ దివ్య తేజం / నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) / ప్రేమతో ప్రాణమును అర్పించినావు / శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) / శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు / జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| / స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు / శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) / నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను / మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| / కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు / బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) / నెమ్మది కలిగించే నీ బాహుబలముతో / శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||

గొర్రెపిల్ల వివాహోత్సవ|Gorrepilla Vivaahotsava

గొర్రెపిల్ల వివాహోత్సవ / సమయము వచ్చెను రండి (2) / సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) / మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| / సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) / నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| / పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) / గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| / తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) / నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల|| / దేవుని వాక్యమను నామము గలవాడు (2) / రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల|| / ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2) / పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| / శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2) / వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||