Songs sorted by number of likes. 1604 songs total.
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము / యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| / దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) / దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| / గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) / కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| / సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) / సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| / సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) / సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) / యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) / సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ / నీ రక్తమే నా బలము (2) / నీ రక్త ధారలే ఇల / పాపికాశ్రయంబిచ్చును (2) / పరిశుద్ధ తండ్రి పాపిని / కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే|| / నశించు వారికి నీ సిలువ / వెర్రితనముగ నున్నది (2) / రక్షింపబడుచున్న పాపికి / దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే|| / నీ సిల్వలో కార్చినట్టి / విలువైన రక్తముచే (2) / పాప విముక్తి చేసితివి / పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే|| / పంది వలె పొర్లిన నన్ను / కుక్క వలె తిరిగిన నన్ను (2) / ప్రేమతో చేర్చుకొంటివి / ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే|| / నన్ను వెంబడించు సైతానున్ / నన్ను బెదరించు సైతానున్ (2) / దునుమాడేది నీ రక్తమే / దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే|| / స్తుతి మహిమ ఘనతయు / యుగయుగంబులకును (2) / స్తుతి పాత్ర నీకే చెల్లును / స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||
నీవే నా ప్రాణము నీవే నా సర్వము / నీవే నా జీవము యేసయ్యా (2) / మరువలేను నీదు ప్రేమ / విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| / మార్గం నీవే సత్యం జీవం నీవే / జీవించుటకు ఆధారం నీవే (2) / అపాయము రాకుండా కాపాడువాడవు / నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| / తోడు నీవే నా నీడ నీవే / నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2) / బ్రతుకంతా నీ కొరకై జీవింతును / నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
స్థిరపరచువాడవు బలపరచువాడవు / పడిపోయిన చోటే నిలబెట్టువాడవు / ఘనపరచువాడవు హెచ్చించువాడవు / మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2) / ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు / నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2) / యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2) / సర్వకృపానిధి మా పరమ కుమ్మరి / నీ చేతిలోనే మా జీవమున్నది (2) / మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి / మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి (2) ||ఏమైనా|| / నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా? / నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా? (2) / మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును / అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును (2) ||ఏమైనా||
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2) / యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2) / స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి / ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే|| / మహా శ్రమలలో వ్యాధి బాధలలో / సహనము చూపి స్థిరముగ నిలచిన / యోబు వలె నే జీవించెదను (2) / అద్వితీయుడు ఆదిసంభూతుడు / దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| / ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో / లోకమునకు ప్రభువును చాటిన / దానియేలు వలె జీవింతును (2) / మహోన్నతుడు మన రక్షకుడు / ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| / జీవితమంతా ప్రభుతో నడచి / ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన / హనోకు వలె నే జీవించెదను (2) / అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు / నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం (2) / ఒక ఘడియ యిచట గడుపుట మేలు / వేయి దినములకంటెను (2) ||దేవా|| / అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. (2) / అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా / అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో (2) / ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు / ఆనందించగ నీ ఒడిలో (2) ||దేవా|| / అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. (2) / నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్ / జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను (2) / శ్రేష్టమౌ నీదు వాక్కులచేత / మము తృప్తి పరచుమయా (2) ||దేవా|| / పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. (2) / పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం / మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం (2) / ప్రాణ ప్రియుడవు పదముల జేరి / ప్రాణార్పణము చేతుము (2) ||దేవా||
దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని / ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని / దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. / చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే|| / నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా / నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా / నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే / నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) / ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. / శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే|| / కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా / కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా / నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా / కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) / ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. / పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే||
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2) / స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2) / ఆరాధనా… ఆరాధనా… (2) / ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ|| / సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే / శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా|| / ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే / విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా|| / ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే / నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) / నా ప్రాణమున్నంత వరకు / విడచిపోలేనయ్యా ||మేలులు|| / కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా / శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) / నీది గొర్రెపిల్ల మనస్సయ్యా / యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) / అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా / జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) / నీది పావురము మనస్సయ్యా / యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) / చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా / దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) / నీది ప్రేమించే మనస్సయ్యా / యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)
ఊహించలేని మేలులతో నింపిన / నా యేసయ్యా నీకే నా వందనం (2) / వర్ణించగలనా నీ కార్యముల్ / వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| / మేలుతో నా హృదయం తృప్తిపరచినావు / రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) / ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా / స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| / నా దీనస్థితిని నీవు మార్చినావు / నా జీవితానికి విలువనిచ్చినావు (2) / నీ కృపకు నన్ను ఆహ్వానించినావు / నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
స్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు / కష్ట కాలములోన నన్ను – మరచిపోడు / నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు / మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు / నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు / శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు / నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు / కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు ||స్వస్థపరచు|| / చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు / మరణము నుండి జీవముకు నను దాటించాడు / మారా వంటి జీవితము మధురముగా మార్చాడు / రోగము నిండిన దేహమును బాగు చేసాడు / పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు / చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు / కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు ||స్వస్థపరచు|| / దూతను ముందుగ పంపించి – మార్గము చక్కగ చేసాడు / ఆటంకములు తొలగించి – విజయమునిచ్చాడు / అగ్ని వంటి శ్రమలోన – నా తోడుగ ఉన్నాడు / ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు / నా యెడల ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కావు / సమాధానకరమైనవిగా రూపొందించాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా పరిహారకుడు / వేదనలో నన్నెత్తుకొని నెమ్మదినిచ్చాడు ||స్వస్థపరచు||
ఆయనే నా సంగీతము బలమైన కోటయును / జీవాధిపతియు ఆయనే / జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| / స్తుతుల మధ్యలో నివాసం చేసి / దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) / వేడుచుండు భక్తుల స్వరము విని / దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| / ఇద్దరు ముగ్గురు నా నామమున / ఏకీభవించిన వారి మధ్యలోన (2) / ఉండెదననిన మన దేవుని / కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| / సృష్టికర్త క్రీస్తు యేసు నామమున / జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) / రాకడలో ప్రభుతో నిత్యముందుము / మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||