తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

తుప్పు పట్టి పోవుటకంటే|Thuppu Patti Povutakante

తుప్పు పట్టి పోవుటకంటే (2) / కరిగిపోత యేసయ్య నీ చేతిలో / అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి|| / సుఖమనుభవించుటకంటే (2) / శ్రమలనుభవిస్తాను నీ సేవలో / నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / వెన్న లాగ కరుగుకుంట (2) / కటిక చీకట్ల దీపమైతానయ్యా / నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2) / ముత్యమోలె నేనుండాలి యేసయ్యా / దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / వెండి బంగారాల కన్నా / ధన ధాన్యముల కన్నా / నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా / నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| / నాలో ఊపిరున్నంత వరకు (2) / ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను / కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) ||తుప్పు పట్టి||

యెహోవాకు స్తుతులు పాడండి|Yehovaaku Sthuthulu Paadandi

యెహోవాకు స్తుతులు పాడండి – మీరు / సమాజములో ప్రభు ప్రశంస పాడి / సభలో పాడండి మీరు యెహోవాకు / ఇశ్రాయేలు తమ సృష్టికర్తను / సీయోను వాసులు తమ రాజును / స్మరియించుకొని సంతోషింతురు / నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు|| / తంబురతోను సితారతోను / తనను గూర్చి గానము చేసి / దేవుని ప్రేమరసమును గ్రోలి / పావనాలంకారమును బొంది – మీరు ||యెహోవాకు|| / భక్తులై ఘనులై హర్షింతురు / ఉత్సాహమున ఊప్పొంగెదరు / పడకల మీద ప్రభువును కోరి / పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు ||యెహోవాకు|| / అన్య జనులను శిక్షించుటకు / రాజుల గొలుసుతో బంధించుటకు / రెండంచుల ఖడ్గమును ధరించిరి / దైవ భక్తులకు ఘనత యునిదే – మీరు ||యెహోవాకు||

నీ ప్రేమలో నుండి నన్ను|Nee Premalo Nundi Nannu

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) / శ్రమలైనను శత్రువైనను / నిన్ను నన్ను వేరు చేయలేవు / యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా / యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2) / క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| / జీవించుచున్నది నేను కాదు / క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2) / ఏదేమైనా నాకు యేసే కావాలి / ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| / నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం / నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2) / ఏమిచ్చినా నీకు స్తోత్రాలే / ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా|| / ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను / నీ కోసమే నీ ప్రేమ కోసమే (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||

నా నీతి నీవే|Naa neethi neeve

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే / నా దైవమా యేసయ్యా / నా క్రియలు కాదు నీ కృపయే దేవా / నా ప్రాణమా యేసయ్యా / నదులంత తైలం విస్తార బలులు / నీకిచ్చినా చాలవయ్యా / నీ జీవితాన్నే నాకిచ్చినావు / నీకే నా జీవమయ్యా / హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) ||నా నీతి|| / నా దీన స్థితిని గమనించి నీవు / దాసునిగ వచ్చావుగా / నా దోష శిక్ష భరియించి నీవు / నను నీలో దాచావుగా / ఏమంత ప్రేమ నా మీద నీకు / నీ ప్రాణమిచ్చావుగా / నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను / యజమానుడవు నీవేగా ||హల్లెలూయ|| / నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు / నీవు చేరదీసావుగా / నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి / కన్నీరు తుడిచావుగా / నేనున్న నీకు భయమేలనంటూ / ఓదార్పునిచ్చావుగా / చాలయ్య దేవ నీ కృపయే నాకు / బ్రతుకంతయు పండుగా ||హల్లెలూయ|| / ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు / నీవు నన్ను చూసావుగా / నీ చేయి చాపి నను పైకి లేపి / నీ వాక్కునిచ్చావుగా / నా సంకటములు నా ఋణపు గిరులు / అన్నిటిని తీర్చావుగా / నీలోన నాకు నవ జీవమిచ్చి / నీ సాక్షిగా నిలిపావుగా ||హల్లెలూయ||

జయ జయ యేసు|Jaya jaya yesu

జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) / జయ జయ రాజా – జయ రాజా (2) / జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || / మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) / పరమ బలమొసగు జయ యేసు (2) / శరణము నీవే జయ యేసు || జయ జయ || / సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2) / సమరము గెల్చిన జయ యేసు (2) / అమరముర్తివి జయ యేసు || జయ జయ || / సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2) / పాతవి గతియించె జయ యేసు (2) / దాతవు నీవే జయ యేసు || జయ జయ || / బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2) / బండలు తీయుము జయ యేసు (2) / అండకు చేర్చుము జయ యేసు || జయ జయ || / ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2) / ముద్రలు తీయుము జయ యేసు (2) / ముద్రించుము నను జయ యేసు || జయ జయ || / కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2) / సేవలో బలము జయ యేసు (2) / జీవము నీవే జయ యేసు || జయ జయ || / దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2) / కయ్యము గెల్చిన జయ యేసు (2) / అయ్యా నీవే జయ యేసు || జయ జయ ||

బేత్లేహేం పురమున|Bethlehem puramuna

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె / కర్తాది యేసు జన్మించినపుడు / అంధకారంపు పృథివి వీధులలో / మోదంపు మహిమ చోద్యంబుగానరే / ఉదయంపు తారల్ ముదమున బాడే / ఉదయించ యేసు ఈ పృథివిలోన / ముదమును గలిగె మరి సమాధానం / పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం|| / పరమును విడచి నరరూపమెత్తి / అరుదెంచి యేసు పరమ వైద్యుండై / నరుల దుఃఖములన్ తొలగించివేసి / పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం|| / నీదు చిత్తమును నాదు హృదయమున / ముదమున జేయ మదినెంతో యాశ / నీదు పాలనము పరమందు వలెనె / ఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం|| / దేవుని సన్నిధి దీనత నుండ / పావనయాత్మ పవిత్ర పరచున్ / పావనుడేసు ప్రకాశమిచ్చి / జీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం|| / గతించె రాత్రి ప్రకాశించె కాంతి / వితానముగ వికసించె నెల్ల / దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు / అతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||

ఓ మానవా|O maanavaa

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా / ఓ మానవా.. ఇకనైనా మారవా / మన పాపములను క్షమియించుటకే / సిలువ మరణము పొందెనని (2) / గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2) / ఈ దినమే అనుకూలం… / లేదిక వేరే ఏ సమయం (2) / నిజమేదో తెలియకనే / చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| / సిలువను గూర్చిన శుభ వార్త / వెర్రితనముగా ఉన్నదా? / దేవుని శక్తని తెలుసుకొని / ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| / ప్రయాసముతో భారము మోసే / నిన్నే దేవుడు పిలిచెనుగా / ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద / వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే|| / నీ ధనము నీ ఘనము / నీ సర్వస్వము చితి వరకే / అర్పించుము నీ హృదయమును / (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||