ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన (4) / యేసయ్య ఆరాధన… / ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన (4) / మెస్సయ్య ఆరాధన… / ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన (4) / పరిశుద్ధుని ఆరాధన… / ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన (4) / పరలోక ఆరాధన…
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా / ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా / నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2) / హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా / హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో|| / నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు / పాతాళ వేదన శ్రమలనుండి / నన్ను విడిపించావు (2) ||నీ కృపను|| / నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు / నా గాయములను బాగు చేయ / నీవు శ్రమనొందావు (2) ||నీ కృపను|| / నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు / పరలోక పరిచర్య భాగస్వామిగా / నన్ను స్వీకరించావు (2) ||నీ కృపను||
దేవా మహోన్నతుడా / మహిమా ప్రకాశితుడా (2) / పదివేలలో అతి సుందరుడా / కీర్తింతు మనసారా (2) ||దేవా|| / వెలిసావు భువిలో మెస్సయ్యగా / ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2) / నిస్సారమైన నా జీవితములో / చిగురించె ఆనందము (2) ||దేవా|| / లేచాను ఒంటరి విశ్వాసినై / వెదికాను నీ దారి అన్వేషినై (2) / నీ దివ్య మార్గము దర్శించినా / ఫలియించె నా జన్మము (2) ||దేవా||
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు / అంతరిక్షము నధిగమించెను (2) / నిను ప్రేమించి నీ ఆజ్ఞలను / అనుసరించు మానుజావళికి (2) / నిబంధనను స్థిరముగ జేసి (2) / నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు|| / వేయి తరముల వరకు సరిగా / విలసిల్లేటి వెలలేని మా (2) / వింతల కృపాంబుధి యగు దేవా (2) / యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు|| / నీ సత్య సంధత్వ మహిమ / నిరతము నిలయం సంస్తుతులకు (2) / మెరసెను నా మదిలోన దేవా (2) / మరువగ లేమి మధుర ప్రేమ (2) ||నీదు|| / ఎంతైనను నమ్మదగిన / వింతైన నీ విశ్వాస్యత (2) / వాత్సల్యత వెలసెను మాపై (2) / క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు (2) ||నీదు|| / మన ఆత్మను జీవము దేహమును / మన ప్రభు యేసు రాకడ వరకు (2) / వొనరుగ కాపాడును పదిలముగా (2) / దిన దినమును నిందారహితముగా (2) ||నీదు|| / తండ్రి కుమార శుద్ధాత్మకును / తర తరములకు మహిమ ఘనత (2) / పరిపూర్ణముగా ప్రబలును గాక (2) / పరి పరి విధముల ప్రభు సంఘములో (2) ||నీదు||
రండి సువార్త సునాదముతో / రంజిలు సిలువ నినాదముతో / తంబుర సితార నాదముతో / ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి|| / యేసే మానవ జాతి వికాసం / యేసే మానవ నీతి విలాసం / యేసే పతీత పావన నామం / భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| / యేసే దేవుని ప్రేమ స్వరూపం / యేసే సర్వేశ్వర ప్రతిరూపం / యేసే ప్రజాపతి పరమేశం / ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| / యేసే సిలువను మోసిన దైవం / యేసే ఆత్మల శాశ్వత జీవం / యేసే క్షమాపణ అధికారం / దాసుల ప్రార్ధన సహకారం ||రండి|| / యేసే సంఘములో మన కాంతి / యేసే హృదయములో ఘన శాంతి / యేసే కుటుంబ జీవన జ్యోతి / పసిపాపల దీవెన మూర్తి ||రండి|| / యేసే జీవన ముక్తికి మార్గం / యేసే భక్తుల భూతల స్వర్గం / యేసే ప్రపంచ శాంతికి సూత్రం / వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2) / నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2) / దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను / సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2) / అప్పుడొక మెల్లని స్వరము నాతో / మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2) / ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను / నా జీవితమంత ప్రకాశింప సాగింది (2) ||గూడు|| / అప్పుడొక తియ్యని స్వరము నాతో / మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2) / ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను / నా పాప జీవితము పారిపో సాగింది (2) ||గూడు|| / అప్పుడొక అద్భుత స్వరము నాతో / మాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2) / ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను / నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2) / గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై (2) / నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై (2) / దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను / సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2) / యేసుని నమ్ముకో – యేసుని చేరుకో / యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)
నీవు లేని రోజు అసలు రోజే కాదయా / నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) / నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| / బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు / నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2) / నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| / ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే / నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2) / నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||
ప్రేమ యేసయ్య ప్రేమా (4) / మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| / తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ / తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) / నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా / తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| / నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ / నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) / నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా / తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| / నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ / నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) / తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా / ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ||
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ / మా – దోషములను హరించి మోక్షని / వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| / వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ / యెంతో – కీడు జేసిన పాడు వైరిని / గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| / పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ / నీ – దాపు జేరిన వారి కందరి / కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు|| / అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ / మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు / రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు ||యేసు|| / అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ / నీ – సుందర కరుణామృతము మా / డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన ||యేసు||
ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2) / నన్నెంతగానో బలపరచెను / నన్నెంతగానో స్థిరపరచెను (2) / నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను / నన్నెంతగానో స్థిరపరచెను (2) ||ఎడబాయని|| / కన్నీటి లోయలలో నుండి / నన్ను దాటించిన దేవా / సింహాల బోనులలో నుండి / నన్ను విడిపించిన ప్రభువా (2) ||నన్ను బలపరచెను|| / నేనున్నతమైన స్థితిలో / ఉండాలని ఆశించితివా / ఏ అర్హత నాకు లేకున్నా / నా కృప నీకు చాలునంటివే (2) ||నన్ను బలపరచెను|| / నేనెదుర్కొనలేని పరిస్థితులు / నా ఎదుట ఉన్నవి దేవా / నీ శక్తిని నేను కోరెదను / నన్ను విడిపించు నా దేవా (2) ||నన్ను బలపరచెను||
స్తుతి సింహాసనాసీనుడా / యేసు రాజా దివ్య తేజా (2) / అద్వితీయుడవు పరిశుద్ధుడవు / అతి సుందరుడవు నీవే ప్రభూ (2) / నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2) / కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి|| / బలియు అర్పణ కోరవు నీవు / బలియైతివి నా దోషముకై (2) / నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2) / స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి|| / బూరధ్వనులే నింగిలో మ్రోగగా / రాజధిరాజ నీవే వచ్చువేళ (2) / సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2) / పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2) ||స్తుతి||
ఆనందమానందమే / ఈ భువిలో యేసయ్య నీ జననము (2) / సర్వోన్నతమైన స్థలములలోన / దేవునికి మహిమ ప్రభావము / భూమి మీద తనకిష్టులకు / సమాధానము కలుగును గాక / హల్లెలూయా ||ఆనంద|| / తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట / కొరకై యేసు భువికి దిగి వచ్చెను / తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు / దేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత|| / మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి / యేసు అరుణోదయమిచ్చెను / పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు / క్రీస్తు నర రూపము దాల్చెను ||సర్వోన్నత||