తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

సోలిపోయిన మనసా|Solipoyina Manasaa

సోలిపోయిన మనసా నీవు / సేదదీర్చుకో యేసుని ఒడిలో / కలత ఏలనో కన్నీరు ఏలనో / కర్త యేసే నీతో ఉండగా / ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2) / యేసులో నీ కోరిక తీరునుగా ||సోలిపోయిన|| / యేసు ప్రేమను నీవెరుగుటచే / దూరమైన నీ వారే (2) / కన్న తల్లే నిను మరచిననూ / యేసు నిన్ను మరువడెన్నడు (2) / శ్రమకు ఫలితం కానలేక / సొమ్మసిల్లితివా మనసా (2) / కోత కాలపు ఆనందమును / నీకొసగును కోతకు ప్రభువు (2) / ఎంత కాలము కృంగిపోదువు / నీ శ్రమలనే తలచుచు మనసా (2) / శ్రమపడుచున్న ఈ లోకమునకు / క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ (2) / సోలిపోకుము ఓ ప్రియ మనసా / సాగిపో ఇక యేసుని బాటలో / కలత వీడు ఆనందించు / కర్త యేసే నీతో ఉండగా / కలతకు ఇక చావే లేదు – (2) / యేసు కోరికనే నెరవేర్చు ||సోలిపోకుము||

సూడ సక్కని బాలుడమ్మో|Sooda Sakkani Baaludammo

సూడ సక్కని బాలుడమ్మో / బాలుడు కాడు మన దేవుడమ్మో (2) / కన్య మరియ గర్భమున / ఆ పరిశుద్ధ స్థలమున (2) / మనకై జన్మించినాడు / మనలను రక్షించినాడు (2) ||సూడ|| / బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను / లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2) / ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను / ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2) / సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి / పరవశించ సాగెను (2) ||సూడ|| / మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను / మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2) / పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు / మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2) / దివి నుండి భువిపైకి దిగి వచ్చి / మానవులను ప్రేమించెను (2) ||సూడ||

శ్రీ యేసుండు జన్మించె|Sri Yesundu Janminche

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) / నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| / ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) / ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| / సత్రమందున పశువులశాల యందున (2) / దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| / పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) / పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| / గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) / దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| / మన కొరకొక్క శిశువు పుట్టెను (2) / ధరను మన దోషములబోగొట్టెను (2) ||శ్రీ యేసుండు|| / పరలోకపు సైన్యంబు గూడెను (2) / మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) ||శ్రీ యేసుండు|| / అక్షయుండగు యేసు పుట్టెను (2) / మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) ||శ్రీ యేసుండు||

సృష్టికర్తవైన యెహోవా|Srushtikarthavaina Yehovaa

సృష్టికర్తవైన యెహోవా / నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ / మంటికి రూపమిచ్చినావు / మహిమలో స్థానమిచ్చినావు / నాలో నిన్ను చూసావు / నీలో నన్ను దాచావు / నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా / మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| / ఏ కాంతి లేని నిశీధిలో / ఏ తోడు లేని విషాదపు వీధులలో / ఎన్నో అపాయపు అంచులలో / నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) / యేసయ్యా నను అనాథగా విడువక / నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| / నిస్సారమైన నా జీవితములో / నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా / నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి / నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) / యేసయ్యా నను కృపతో బలపరచి / ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||

స్తోత్ర గానం చేసింది ప్రాణం|Sthothra Gaanam Chesindi Praanam

స్తోత్ర గానం చేసింది ప్రాణం / క్రొత్త రాగం తీసింది హృదయం / నా యేసు ప్రేమ నా మదంతా నిండగా / ధన్యమే ఈ జీవితం / యేసుతో మరింత రమ్యమే / భూమిపై చిన్ని స్వర్గమే / యేసుతో నా ప్రయాణమే / నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| / నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం / కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం / లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే / ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే / యేసులో నిత్యమే ||స్తోత్ర|| / ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం / నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం / లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం / పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే / యేసులో నిత్యమే ||స్తోత్ర||

స్తోత్రబలి అర్పించెదము|Sthothrabali Arpinchedhamu

స్తోత్రబలి అర్పించెదము / మంచి యేసు మేలు చేసెన్ (2) / చేసెను మేలులెన్నో / పాడి పాడి పొగడెదన్ (2) / తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2) / ప్రాణమిచ్చి నను ప్రేమించి / పాపం తొలగించి కడిగితివే (2) / నీ కొరకు బ్రతుక వేరుపరచి / సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ|| / గొప్ప స్వరముతో మొరపెట్టి / సిలువ రక్తమును కార్చితివే (2) / రక్త కోటలో కాచుకొని / శత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ|| / చూచే కన్నులు ఇచ్చితివి / పాడే పెదవులు ఇచ్చితివి (2) / కష్టించే చేతులు ఇచ్చితివి / పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ|| / మంచి ఇల్లును ఇచ్చావయ్యా / వసతులన్నియు ఇచ్చావయ్యా (2) / కష్టించి పనిచేయ కృప చూపి / అప్పు లేకుండ చేసితివే (2) ||తండ్రీ||

స్తోత్రబలి స్తోత్రబలి|Sthothrabali Sthothrabali

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా / శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) / నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) / నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) / మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) / ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) / యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||