Songs sorted by number of likes. 1604 songs total.
స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా / యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2) / నీవే మార్గం నీవే జీవం / నీవే సత్యం నీవే సర్వం (2) ||స్తోత్రము|| / మరణమైననూ ఎర్ర సంద్రమైననూ / నీ తోడు నాకుండ భయము లేదుగా / శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా / బలమైన కోట నీవేగా (2) / నా దుర్గమా నా శైలమా / నా అతిశయమా ఆనందమా (2) ||నీవే|| / హింసలైననూ పలు నిందలైననూ / నీ చల్లని రెక్కలే నాకాశ్రయం / చీకటైననూ అగాధమైననూ / నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2) / నీతి సూర్యుడా నా పోషకుడా / నా వైద్యుడా మంచి కాపరి (2) ||నీవే||
స్తోత్రము స్తుతి స్తోత్రము / వేలాది వందనాలు / కలుగును గాక నీకే మహిమ / ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము / యేసయ్య యేసయ్య యేసయ్య (4) / శూన్యము నుండి సమస్తము కలుగజేసెను / నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను / యేసే నా సర్వము / యేసే నా సమస్తము ||యేసయ్య|| / పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు / సిలువ మరణమునొంది మార్గము తెరిచెను / యేసే నా రక్షణ / యేసే నా నిరీక్షణ ||యేసయ్య||
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) / నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) / యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2) / సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) / భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2) / బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు|| / కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2) / తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2) ||యేసు|| / తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2) / ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2) ||యేసు|| / ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2) / స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2) ||యేసు||
స్తోత్రింతుము నిను మాదు తండ్రి / సత్యముతో ఆత్మతో నెప్పుడు (2) / పరిశుధ్ధాలంకారములతో / దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / శ్రేష్ఠ యీవుల యూట నీవే / శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2) / త్రిత్వమై ఏకత్వమైన త్రి- / లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / దవలవర్ణుడ రత్నవర్ణుడ / సత్యరూపి యనబడువాడా (2) / నను రక్షించిన రక్షకుండవు / నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / సంఘమునకు శిరస్సు నీవే / రాజా నీకే నమస్కారములు (2) / ముఖ్యమైన మూలరాయి / కోట్లకొలది శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / నీదు సేవకుల పునాది / జ్ఞానమునకు మించిన తెలివి (2) / అందముగనూ కూడుకొనుచు / వేడుకొందుము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / రాజ నీకే స్తుతి స్తోత్రములు / గీతములు మంగళ ధ్వనులు (2) / శుభము శుభము శుభము నిత్యం / హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2) ||స్తోత్రింతుము||
స్తుతి గానమే పాడనా / జయగీతమే పాడనా (2) / నా ఆధారమైయున్న / యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై / జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| / నమ్మదగినవి నీ న్యాయ విధులు / మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2) / నీ ధర్మాసనము – నా హృదయములో / స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| / శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు / లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2) / నీ శ్రేష్టమైన – పరిచర్యలకై / కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి|| / నూతనమైనది నీ జీవ మార్గము / విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2) / నీ సింహాసనము – నను చేర్చుటకై / నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము / చెల్లించుటే నా ధన్యత / బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము / చేరడమే నా ఆతృత / అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద / నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద / కనులకే కనపడలేని నా కంటి పాపవై / కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2) / నాకే తెలియక నాలో / నీవు నాదు ప్రాణ శ్వాసవై / నడిపించావా దేవా ఇన్నాళ్లుగా / అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి / నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2) / రాతి గుండెను దిద్ది / గుడిగా మార్చుకున్న దైవమా / ముల్లును రెమ్మగా మార్చితివి
స్తుతి మహిమ యేసు నీకే / స్తుతి ఘనత ప్రభు నీకే (2) / ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి|| / కళ్ళల్లో కన్నీరు తుడిచావు / గుండె బరువును దింపావు (2) / వ్యధలో ఆదరించావు / హృదిలో నెమ్మదినిచ్చావు (2) / యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి|| / నీవొక్కడవే దేవుడవు / మిక్కిలిగా ప్రేమించావు (2) / రక్తము నాకై కార్చావు / రక్షణ భాగ్యమునిచ్చావు (2) / యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి|| / నను బ్రతికించిన దేవుడవు / నాకు స్వస్థత నిచ్చావు (2) / నా తలను పైకెత్తావు / నీ చిత్తము నెరవేర్చావు (2) / యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||
స్తుతి నీకే యేసు రాజా / మహిమ నీకే యేసు రాజా / స్తోత్రం నీకే యేసు రాజా / ఘనత నీకే యేసు రాజా / హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2) / (యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు / త్వరలోనే రానున్నాడు / నిత్యజీవమును మన అందరికిచ్చి / పరలోకం తీసుకెళ్తాడు (2) / హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2) ||స్తుతి|| / మధ్యాకాశములో ప్రభువును కలిసెదము / పరిశుద్ధుల విందులో పాలునొందెదము (2) / పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2) / తేజోవాసులతో స్తుతియింతుము ||హోసన్నా|| / సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము / క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2) / శ్రమలైనా శోధనలెదురైనా (2) / ఆర్భాటముతో సన్నుతింతుము ||హోసన్నా|| ||స్తుతి||
స్తుతి పాడనా నేను / నన్ను కాచే యేసయ్యా / నా జీవాన్నదాతకు / నను నడిపే ప్రభువుకు / పాపములో పడియున్న వేళ / వదలకనే దరి చేర్చిన దాత / నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి|| / సోలిపోయి తూలుతున్న వేళ / జాలితో నను పిలచిన నా దేవా / నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి|| / భూమినేలే రారాజు నీవని / ధరణిలోని నీ మహిమను ప్రకటించ / నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి||
స్తుతి పాడెద నే ప్రతి దినము / స్తుతి పాడుటే నా అతిశయము / దవళవర్ణుడా మనోహరుడా / రత్నవర్ణుడా నా ప్రియుడా / ఆరాధించెద అరుణోదయమున / అమరుడా నిన్నే ఆశ తీరా / ఆశ్రిత జనపాలకా / అందుకో నా స్తుతి మాలికా / గురి లేని నన్ను ఉరి నుండి లాగి / దరి చేర్చినావే పరిశుద్దుడా / ఏమని పాడెద దేవా / ఏమని పొగడెద ప్రభువా / మతి లేని నన్ను శృతి చేసినావే / మృతి నుండి నన్ను బ్రతికించినావే / నీ లతనై పాడెద దేవా / నా పతివని పొగడెద ప్రభువా
స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని / మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) / ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2) / ఆది అంతము లేనివాడు (2) / మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| / జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2) / ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| / గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2) / తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2) ||స్తుతి పాడి||
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా / ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన / నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) / జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా / నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| / ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు / సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2) / నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై / తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| / నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు / కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2) / నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై / నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| / హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు / కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2) / నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై / నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే||