799 praise songs available. Lyrics in Roman and Telugu script.
ఎన్ని తరములు స్తుతియించినా (2) / తీరునా నీ ఋణం (4) / నా ప్రాణము – నా జీవము (2) / నీవే నా యేసయ్యా / నీవే నా మెస్సయ్యా ||ఎన్ని|| / కరిగిపోని కన్నీరెంతో / కుమ్మరించాను – కుమ్మరించాను (2) / కరుణామయుడా కన్నులు తుడిచి (2) / (నీ) కృపను చూపావు – కృపను చూపావు (2) ||నా ప్రాణము|| / పాపములోనే పుట్టిన వారిని / పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2) / పరమ తండ్రి పవిత్రతతోనే (2) / (నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2) ||నా ప్రాణము||
ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో / ఆ నామమునే స్తుతింతును / ఏ నామములో పాపమంతా క్షమించబడెనో / ఆ నామమునే పూజింతును / ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో / ఆ నామమునే నమ్మెదను / ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో / ఆ నామమునే స్మరింతును / నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను / నీ నామమే ఆధారము / నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను / నీ నామమే నా జయము / రోగము తలవంచును నీ నామము ఎదుట / శాపము తల వంగును నీ నామము ఎదుట (2) / సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2) ||నీ నామమునే|| / ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట / ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2) / శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2) ||నీ నామమునే|| / హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా / కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా / కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా / అన్ని నామములకు పై నామముగా (2) / అన్ని నామములకు పై నామముగా – (3) ||నీ నామమునే||
తూరుపు దిక్కున చుక్క బుట్టె / దూతలు పాటలు పాడ వచ్చె (2) / చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2) / చల్లని రాతిరి కబురే తెచ్చె (2) / పుట్టినాడంట యేసునాథుడు / పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు|| / గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి / కొలిచినారు తనకు కానుకలిచ్చి / పశుల పాక మనము చేరుదాము / కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట|| / చిన్నా పెద్దా తనకు తేడా లేదు / పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు / తానొక్కడే అందరికీ రక్షకుడు / మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట|| / మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు / చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు / నమ్మి నీవు యేసును అడిగి చూడు / తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినాడంట||
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే / అది ఎంతో విలువని నాకు చూపితివే / జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు / నీ జీవితాన్నే ధారబోసితివే (2) / నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా / ఎన్ని యుగాలైనా మారదు / ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును / నా దేవునికి సమస్తము సాధ్యమే (2) / పాపములో పడిన నన్ను / శాపములో మునిగిన నన్ను / నీ ప్రేమతో లేపితివే / రోగమే నన్ను చుట్టుకొనియుండగా / రోదనతో ఒంటరినైయుండగా / నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| / పగలంతా మేఘ స్తంభమై / రాత్రంతా అగ్ని స్తంభమై / దినమంతయు రెక్కలతో కప్పితివే / స్నేహితులే నన్ను వదిలేసినా / బంధువులే భారమని తలచినా / నా కొరకే బలి అయితివే (2) ||నీది|| / సాధ్యమే సాధ్యమే సాధ్యమే / నా యేసుకు సమస్తము / సాధ్యమే సాధ్యమే సాధ్యమే / నా ప్రియునికి సమస్తము (2) / ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును / నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
ఆ శ్రేష్టంబౌ గ్రంథములో / ఏ చోట చూచినా ఆదరణ యున్నది / సుఖ దుఃఖములో వాగ్ధానమున్నవి / విశ్వాసముంచి ధ్యానించుడి
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2) / నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2) / యెహోవా వలనే – యెహోవా వలనే / నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును / భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా / నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2) / నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2) / యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| / నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును / పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2) / ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2) / నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| / వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా / నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2) / నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2) / నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా||
యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము / యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము / ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము / ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య|| / ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు / నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు / నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు / నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం / నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి / నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ ||యేసయ్య|| / ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు / లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే / నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా / పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం / సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు / మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||
మనసెరిగిన యేసయ్యా / మదిలోన జతగా నిలిచావు (2) / హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి / నీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన|| / నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై / సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2) / సాహసక్రియలు చేయు నీ హస్తముతో / నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| / వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి / ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2) / ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో / నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| / మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై / ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2) / నేలమంటితో నన్ను రూపించిన హస్తములే / నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||
ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని / ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2) / నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా / నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు|| / తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే / ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే / నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా / ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా / ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన / నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ / ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా / ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు|| / ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా / విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం / నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు / నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ / నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన / నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన / శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో / నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
నన్ను బలపరచు యేసునందే నేను / సర్వము చేయగలను / నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను / సమస్తం చేయగలను / సాధ్యము కానిది ఏదియు లేదే / అన్ని సాధ్యమే యేసులో / సాధ్యము కానిది ఏదియు లేదే / అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు|| / నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే / బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే / నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే / నీటిపై నడిచెనే – నీటినే అణచెనే / నా కన్నీటిని నాట్యముగ మార్చెనే / జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము|| / హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే / బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే / షద్రకు మేషాకు అబేద్నెగోలను / అగ్నిలో ఉండియే కాపాడెనే / నరకపు మంటనుండి నను రక్షించిన / అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము||
నీ ప్రేమకు సాటి లేదయా / యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా (2) / నా కొరకై ప్రాణమిచ్చితివి / నా కొరకై సిలువనెక్కితివి (2) / కరుణించి కాపాడుమా నా యేసయ్యా / కన్నీటి ప్రార్దన ఆలకించుమా (2) ||నీ ప్రేమకు|| / అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే / నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివే (2) / మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే (2) / నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా (2) / నా యేసయ్యా…. ||నీ ప్రేమకు|| / ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా / నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా (2) / విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము (2) / నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా (2) / నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||
యేసు వలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం / శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2) / ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు / ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు / నీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2) / నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం / సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2) / ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే / ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు – నీ సన్నిధిని పొందే సమయమదే / నీ సన్నిధి చాలు – యేసు… నీ సన్నిధి చాలు – (2) / విశ్వాసములో నన్ను స్థిరపరచే – ప్రతి పరిస్థితికై స్తోత్రం / కృప నుండి కృపకు నడిపినట్టి – నీ కనికరముకై స్తోత్రం (2) / ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు – నీలో ఆనందించే తరుణమదే / ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు – నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె / నీవే చాలు యేసయ్యా – నీవుంటే చాలు యేసయ్యా… – (2)