799 praise songs available. Lyrics in Roman and Telugu script.
భూమియు దాని సంపూర్ణత లోకము / దాని నివాసు లెహోవావే (2) / ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2) / ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు|| / యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2) / యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు|| / వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2) / నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు|| / నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2) / వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు|| / గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2) / మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు|| / మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2) / యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు|| / మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2) / ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు||
శక్తి చేత కాదు / బలము చేత కాదు / దేవుని ఆత్మచే / సమస్తము సాధ్యము (2) ||శక్తి|| / నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని / చేసెను దేవుడు శూన్యము నుండి (2) / తన రూపులో తన పోలికలో (2) / నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి|| / కౄరమైన సింహాల బోనైననూ / విశ్వాసముతో సాగెను దానియేలు (2) / అగ్ని గుండములో మరణ శాసనములో (2) / ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి|| / ఘోరమైన పాపాల బానిసైననూ / భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2) / ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2) / దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి||
శక్తి చేత కాదనెను / బలముతోనిది కాదనెను (2) / నా ఆత్మ ద్వారా దీని చేతునని / యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి|| / ఓ గొప్ప పర్వతమా / జెరుబ్బాబెలు నడ్డగింపను (2) / ఎంత మాత్రపు దానవు నీవనెను / చదును భూమిగా మారెదవు (2) ||శక్తి|| / ఓ ఇశ్రాయేలు విను / నీ భాగ్యమెంత గొప్పది (2) / యెహొవా రక్షించిన నిన్ను / బోలిన వారెవరు (2) ||శక్తి||
సర్వ శరీరుల దేవుడా / నీకసాధ్యమే లేదయ్యా (2) / చాచిన నీ బాహువుతో / భూమి ఆకాశాలు చేసితివే / నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే / లేనే లేదయ్యా హో యేసయ్యా / నీకసాధ్యమైనదేది లేదయ్యా / లేనే లేదయ్యా మా యేసయ్యా / నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) ||సర్వ శరీరుల|| / ఆదాము హవ్వలను చేసినట్టి దేవా / సృష్టికర్త నీకే స్తోత్రము / హేబెలు అర్పణను అంగీకరించిన / గొర్రెపిల్ల దేవా స్తోత్రము / హానోకును నీతో కూడా నడిపినావు / నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు / సర్వశక్తుడా – నీతిమంతుడా / మార్పు లేని మా దేవుడా ||లేనే లేదయ్యా|| / అబ్రహాముతో నిబంధనను చేసినావు / అబ్రహాము దేవా స్తోత్రము / ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు / ఇస్సాకు దేవా స్తోత్రము / యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు / యోసేపును పెద్ద రాజుగా చేసినావు / శ్రీమంతుడా – యాకోబు దేవుడా / చూచుచున్న మా దేవుడా ||లేనే లేదయ్యా|| / మోషేతో పొద నుండి మాటలాడినావుగా / ఉన్నవాడా నీకే స్తోత్రము / ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు / భీకరుండా నీకే స్తోత్రము / యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు / కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు / మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా / చీల్చబడిన బండ దైవమా ||లేనే లేదయ్యా|| / గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా / విజయశీలుడా స్తోత్రము / సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా / యూదా సింహమా స్తోత్రము / బోయజుతో రూతును విమోచించినావు / సమూయేలును మందసం నుండి పిలిచినావు / పరిశుద్ధుడా – విమోచకుడా / ఎబినేజరు స్తోత్రము ||లేనే లేదయ్యా|| / దావీదు నా హృదయానుసారుడంటివే / రాజాధి రాజా స్తోత్రము / సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు / అనంత జ్ఞాని స్తోత్రము / ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు / ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు / ఆత్మ రూపుడా – రోషవంతుడా / జీవము గల దేవుడా ||లేనే లేదయ్యా|| / నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు / యెరూషలేము దేవా స్తోత్రము / జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు / మందసపు దేవా స్తోత్రము / ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు / దానియేలును సింహాల నుండి బ్రోచినావు / షద్రక్ మేషాకూ – అబేద్నెగోల దేవుడా / నిత్య రాజ్య స్థాపకుడా ||లేనే లేదయ్యా|| / యెహోషాపాతుకై పోరు సలిపినావు / యుద్ధ శూరుడా స్తోత్రము / యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా / యజమానుడా స్తోత్రము / హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు / యెషయాకు దర్శనమును చూపినావు / మహిమ రూపుడా – నిత్య జీవుడా / సింహాసనాసీనుడా ||లేనే లేదయ్యా|| / యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా / నమ్మదగిన దేవా స్తోత్రము / యోనాను చేప కడుపు నుండి లేపినావుగా / దీర్ఘశాంతుడా స్తోత్రము / యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు / యోహానును త్రోవ సరళ పరచ పంపినావు / ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా / ప్రవక్తలందరికి దేవుడా ||లేనే లేదయ్యా|| / కృపా సత్యములు మాకై తెచ్చినావుగా / యేసు దేవా నీకే స్తోత్రము / తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా / దేవ తనయుడా స్తోత్రము / రక్తధారతో మా పాపమంతా కడిగినావు / మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు / పునరుత్థానుడా – అభిషిక్తుడా / పాపుల రక్షకుడా ||లేనే లేదయ్యా|| / పేతురును బండలా స్థిరము చేసినావుగా / పరిశుద్ధాత్ముడా స్తోత్రము / సౌలును అపొస్తలునిగా మార్చినావుగా / ఆశ్చర్యకరుడా స్తోత్రము / యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు / సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు / పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా / రానున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||
ఊహలు నాదు ఊటలు / నా యేసు రాజా నీలోనే యున్నవి (2) / ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు|| / నీదు కుడి చేతిలోన / నిత్యము వెలుగు తారగా (2) / నిత్య సంకల్పము / నాలో నెరవేర్చుచున్నావు (2) ||ఊహలు|| / శత్రువులు పూడ్చిన / ఊటలన్నియు త్రవ్వగా (2) / జలలు గల ఊటలు / ఇస్సాకునకు ఇచ్చినావు (2) ||ఊహలు|| / ఊరు మంచిదే గాని / ఊటలన్నియు చెడిపోయెనే (2) / ఉప్పు వేసిన వెంటనే / ఊట అక్షయత నొందెనే (2) ||ఊహలు||
నా జీవిత భాగస్వామివి నీవు / నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) / నాకే సమృద్దిగా నీ కృపను పంచావు / నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) / నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి / నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) / నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి / నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత|| / నీ దయగల మాటలే చేరదీసినవి / నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2) / నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి / నీ విందుశాలకు నను చేర్చితివి (2) ||నా జీవిత|| / నీ దయగల తలంపులే రూపునిచ్చినవి / నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2) / నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు / నీ అంతఃపురములో నను చేర్చుదువు (2) ||నా జీవిత||
గాయపడిన నీ చేయి చాపుము దేవా / నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2) / సిలువే నాకు విలువైనది (2) / అదియే నా బ్రతుకున గమ్యమైనది / ఎంతో రమ్యమైనది ||గాయపడిన|| / ఎండిన భూమిలో మొలచిన లేత / మొక్క వలె నీవు ఎదిగితివి (2) / సురూపమైనా ఏ సొగసైనా (2) / లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన|| / మనుషులందరు చూడనొల్లని / రూపముగా నాకై మారితివి (2) / మా రోగములు మా వ్యసనములు (2) / నిశ్చయముగా నీవు భరియించితివి ||గాయపడిన|| / నీవు పొందిన దెబ్బల వలన / స్వస్థత నాకు కలిగినది (2) / నీవు కార్చిన రక్తమే (2) / మా అందరికీ ఇల ప్రాణాధారము ||గాయపడిన||
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని / నీ కృపావరమునే దానముగా దయచేసి (2) / నీ ప్రేమలో పరవశించి / నీ సన్నిధిలో నే చేరి / నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను / దేవా… నా దేవా… / నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే|| / హృదయము బద్దలై ఏడ్చిన వేళ / కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2) / నీ చిత్తముకై నే ఎదురు చూసి / నీ బలము పొంద సహియింప చేసి / నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా|| / నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా / భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2) / నా శత్రువుపైనే జయమునిచ్చి / నా ఆశ్రయమై ధైర్యమును నింపి / నా కోట నీవైతివే ||దేవా||
నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చించునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా (2) / నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా / ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య ||పదే పాడనా|| / ప్రేమను పంచే నీ గుణం – జీవము నింపే సాంత్వనం / మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం / నీవే నాకు ప్రభాతము – నాలో పొంగే ప్రవాహము / నీవే నాకు అంబరం – నాలో నిండే సంబరం / నాలోన మిగిలే నీ ఋణం – నీతోటి సాగే ప్రయాణం ||పదే పాడనా|| / మహిమకు నీవే రూపము – మధురము నీదు నామము / ఇదిగో నాదు జీవితం – ఇలలో నీకే అంకితం / నీవే నాకు సహాయము – నిన్న నేడు నిరంతరం / నీవే నాకు ఆశయం – నాలో నీకే ఆలయం / ధరలోన లేరు నీ సమం – నీ ప్రేమధారే నా వరం ||పదే పాడనా||
నా సర్వం నా కోట / నా దుర్గం నీవే నీవే / ఆశ్రయము నా బలము / నా ఊపిరి నీవే నీవే / బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు / శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు / నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా / నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా / నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా (2) ||బాధలలో||
అత్యున్నతమైన సింహాసనంపై / ఆసీనుడవైన గొప్ప దేవుడా / తేజోమయుడా రక్షణకర్తా / నీవే నా దేవుడని కీర్తింతును / తేజోమయుడా రక్షణకర్తా / నీవే నా దేవుడని ఘనపరతును / యేసే మార్గం యేసే సత్యం / యేసే జీవం యేసే సర్వం (2) / సాధ్యం కానిది ఏమున్నది / నీ యందే విశ్వాసం నాకున్నది (2) / నన్నెన్నడు ఎడబాయవు / నీ ప్రేమే నాకు నిత్య జీవము / నన్నెన్నడు ఎడబాయవు / నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే.. / ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై / స్ట్రగ్గుల్స్ అండ్ అబ్స్టాకుల్స్ బట్ / గాడ్ సీస్ దెం ఆల్ అండ్ హి నెవర్ / హెసిటేట్స్ టు కం టు మి / గివ్ ఎవ్రిథింగ్ వి హావ్ టు హిం / ఈవెన్ పెయిన్ అండ్ హార్ట్ బ్రేక్స్ / గాడ్ ఈస్ అవర్ రీసన్ టు లివ్ / గ్లోరీ టు మై గాడ్ యెహోవా ||యేసే మార్గం||