799 praise songs available. Lyrics in Roman and Telugu script.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా / మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2) / నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2) / నీవే లేకుండా నేనుండలేనయ్యా / నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా|| / నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం / ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) / కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును / బాధల నుండి బ్రతికించుటకును (2) / నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా|| / ఒంటరి పోరు నన్ను విసిగించినా / మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) / ఒంటరివాడే వేయి మంది అన్నావు / నేనున్నానులే భయపడకు అన్నావు (2) / నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) ||నేనుండలేనయ్యా|| / ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా / ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2) / విశ్వానికి కర్త నీవే నా గమ్యము / నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2) / నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2) ||నేనుండలేనయ్యా||
గొర్రెపిల్ల రక్తములో / కడుగబడినవారే పరిశుద్ధులు (2) / పరిశుద్ధుడా యేసయ్యా.. / నను శుద్ధి చేయుమయా (2) / నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల|| / ఆకాశము ఈ భూమియు / గతియించినా గతియించవు నీ మాటలు (2) / శాశ్వతమైనది నీ రాజ్యము (2) / ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల|| / వేవేళ దూతలు అనునిత్యము / కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2) / పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2) / ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||
యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి / నాకు లేమి లేదు – (2) / లోయలలో లోతులలో యెహోవా నా కాపరి / సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా|| / పచ్చికగల చోట్ల / నన్ను పరుండజేయును (2) / శాంతికరమగు జలముల కడకు / నన్ను నడిపించును (2) ||లోయలలో|| / గాఢాంధకారపు లోయలలో / సంచరించినను (2) / అపాయమేమియు కలుగదు నాకు / నీవు తోడుండగా (2) ||లోయలలో|| / తన నామమున్ బట్టి / నన్ను నీతి మార్గములో (2) / త్రోవ చూపి నడిపించును / సేదదీర్చును (2) ||లోయలలో|| / చిరకాలము నేను / యెహోవా సన్నిధిలో (2) / నివాసమొందెదను నేను / నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||
నమ్మదగిన దేవుడవు యేసయ్యా / నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2) / నా తేజోమయుడా నాదు రక్షకా / నను విడిపించిన నా విమోచకా (2) / నీ శరణు జొచ్చితి ఆదరించుము / సేదదీర్చి నీ అక్కున చేర్చుము / యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము ||నమ్మదగిన|| / నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే / నీ కృపా వార్తను వినిపించుము (2) / నా పూర్ణ హృదయముతో ఆత్మతో / కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2) ||నీ శరణు|| / నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే / నను రక్షించుటకై చేయి చాచితివే (2) / పదితంతుల సితారతో గానముతో / స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2) ||నీ శరణు||
యేసు నీకే జయం జయము (2) / నీవే లోక పాలకుడవు (2) / సర్వ సృష్టికి సృష్టికర్తవు / సర్వలోక రక్షకుడవు (2) / జై జై అనుచు నీకే పాడెదం (2) / జన్మించె జగమున మానవ రూపములో / ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె (2) / పాపియైన మాన-వుని రక్షింప / సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / మరణము ద్వారా – అంతమాయె బలులు / తన సమాధి సర్వం కప్పెన్ (2) / తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె / సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్ / తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ (2) / రాజుల రాజై ప్రభువుల ప్రభువై / పొందె అధికారము – పరలోకముపై (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / తన రూపమునకు మార్పు నిష్ట-మాయె / సృష్టికంటె ముందు తానే సంకల్పించె (2) / లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని / తన రూపము నొంది – తనతో నుండెదం (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు||
శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2) / కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం|| / పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2) / శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం|| / పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2) / నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం|| / దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2) / దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం|| / నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2) / సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2) ||శరణం|| / సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2) / కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2) ||శరణం|| / రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2) / వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2) ||శరణం|| / సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా (2) / నిత్యదేవుడా – మా మంచి బోధకుడా (2) ||శరణం|| / సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా (2) / సత్యదేవుడా – మా నిత్యజీవమా (2) ||శరణం|| / ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు (2) / వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2) ||శరణం||
పూజనీయుడేసు ప్రభు / పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు|| / నీ స్వకీయులే నిందించినా / నిన్నంగీకరించక పోయినా (2) / ఎన్నో బాధ లొందితివా నాకై (2) / సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు|| / సత్యము మార్గము మరి జీవమై / నిత్యజీవమియ్యను వచ్చితివి (2) / వంచకుడవని నిన్ను నిందించిరా (2) / ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు|| / యూదా గోత్రపు ఓ సింహమా / ఆద్యంతరహిత దైవమా (2) / అధములు నిను సమరయుడనిరా (2) / నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు|| / మధురం నీ నామం అతి మధురం / మధుర గీతముతో నిన్నారాధింతును (2) / వధియించబడితివా యీ పాపికై (2) / వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||
పాడెద దేవా – నీ కృపలన్ / నూతన గీతములన్ / స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) / భూమి పునాదులు వేయకముందే / యేసులో చేసితివి (2) / ప్రేమ పునాదులు వేసితివి / దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద|| / ప్రవిమల రక్తము కలువరి సిలువలో / కలునకు నిచ్చితివి (2) / ప్రేమ కృపా మహదైశ్వర్యములతో / పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద|| / పాపము శాపము నరకపు వేదన / మరి తొలగించితివి (2) / అపరాధములచే చచ్చిన నన్ను / ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద|| / దేవుని రాజ్యపు వారసుడనుగా / క్రీస్తులో చేసితివి (2) / చీకటి రాజ్యపు శక్తుల నుండి / నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2) ||పాడెద|| / ముద్రించితివి శుద్ధాత్మతో నను / భద్రము చేసితివి (2) / సత్యస్వరూప నిత్యనివాసి / సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద|| / అన్యుడనై నిను ఎరుగక యున్నను / ధన్యుని చేసితివి (2) / ప్రియ పట్టణ పౌరుల సేవింపను / వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2) ||పాడెద||
నే స్తుతించెదను యేసు నామమును / భజించెదను క్రీస్తు నామమును / స్తుతికి యేసే యోగ్యుడని / నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను|| / ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ / వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) / పాపిని నన్ను రక్షించుటకై / చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను|| / పాపములన్నియు బాపుటకై / శాపములన్నియు మాపుటకై (2) / ఏ పాపమెరుగని ఆ పావనుడు / శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను|| / శోధన కాలముల యందున / వేదన కాలముల యందున (2) / నాధుడు యేసు మనతోడనుండ / అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను|| / ఎనలేని ప్రేమతో కౌగిలించెను / ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2) / మహామహుండు మహిమ ప్రధానుడు / మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను|| / రాజాధిరాజు ప్రభు యేసే / దేవాదిదేవుడు మన యేసే (2) / పరమందు దూతలు యిహమందు నరులు / పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను||
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా / నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే / అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి / అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము|| / ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా / యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము|| / యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి / మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము|| / పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా / కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము|| / దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు / కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము||
యేసుకు యేసే ఇల సాటి / వివరింపగ నేనేపాటి (2) / పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2) / వివరింపగ నేనేపాటి (2) ||యేసుకు|| / రక్షణనిచ్చే రక్షకుడవు / విడుదలనిచ్చే విమోచకుడవు (2) / ఆదరించే ఆధారణకర్తవు (2) / అభిషేకించే అభిషిక్తుడవు (2) / ఇలలో ఎవ్వరు నీ సాటి / వివరింపగ నేనేపాటి ||పరమ|| / శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు / ముక్తినిచ్ఛే ముక్తిదాతవు (2) / ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు (2) / రాజ్యాలేలే రాజాధి రాజువు (2) / ఇలలో ఎవ్వరు నీ సాటి / వివరింపగ నేనేపాటి ||పరమ||
నిరంతరం నీతోనే జీవించాలనే / ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) / నా ప్రాణేశ్వరా యేసయ్యా / నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| / చీకటిలో నేనున్నప్పుడు / నీ వెలుగు నాపై ఉదయించెను (2) / నీలోనే నేను వెలగాలని / నీ మహిమ నాలో నిలవాలని (2) / పరిశుద్ధాత్మ అభిషేకముతో / నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| / నీ రూపము నేను కోల్పయినా / నీ రక్తముతో కడిగితివి (2) / నీతోనే నేను నడవాలని / నీ వలెనే నేను మారాలని (2) / పరిశుద్ధాత్మ వరములతో / అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| / తొలకరి వర్షపు జల్లులలో / నీ పొలములోని నాటితివి (2) / నీలోనే చిగురించాలని / నీలోనే పుష్పించాలని (2) / పరిశుద్ధాత్మ వర్షముతో / సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||