స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

మధురం మధురం|Madhuram Madhuram

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం / శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) / దీన మనస్సు – దయ గల మాటలు / సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| / ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని / బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) / నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు / ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2) / ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను / ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2) / జడియకు నీవు మహిమలో నిలుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

ప్రభువా నిను కీర్తించుటకు|Prabhuvaa Ninu Keerthinchutaku

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2) / నీ ఋణము నే తీర్చగలనా / తగిన కానుక నీకు అర్పింపగలనా (2) / ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా / దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2) / ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2) / నీ ఋణము నే తీర్చగలనా / తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా|| / కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి / నా గుడారమునే విశాల పరచి (2) / ఇంతగ నను హెచ్చించుటకు / నే తగుదునా… నే తగుదునా… / వింతగ నను దీవించుటకు / నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| / నీ నోటి మాట నా ఊటగ నుంచి / నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2) / ఇంతగ నను వాడుకొనుటకు / నే తగుదునా… నే తగుదునా… / వింతగ నను హెచ్చించుటకు / నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||

ఎంత జాలి యేసువా|Entha Jaali Yesuvaa

ఎంత జాలి యేసువా / యింతయని యూహించలేను ||ఎంత|| / హానికరుడ హింసకుడను / దేవదూషకుడను నేను (2) / అవిశ్వాసినైన నన్ను (2) / ఆదరించినావుగా ||ఎంత|| / రక్షకుండ నాకు బదులు / శిక్ష ననుభవించినావు (2) / సిలువయందు సొమ్మసిల్లి (2) / చావొందితివి నాకై ||ఎంత|| / ఏమి నీ కర్పించగలను / ఏమి లేమి వాడనయ్యా (2) / రక్షణంపు పాత్రనెత్తి (2) / స్తొత్రమంచు పాడెద ||ఎంత|| / నీదు నామమునకు యిలలో / భయపడెడు వారి కొరకై (2) / నాథుడా నీ విచ్చు మేలు (2) / ఎంత గొప్పదేసువా ||ఎంత|| / నేను బ్రతుకు దినములన్ని / క్షేమమెల్ల వేళలందు (2) / నిశ్చయముగ నీవు నాకు (2) / ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| / నాదు ప్రాణమునకు ప్రభువా / సేద దీర్చు వాడ వీవు (2) / నాదు కాపరివి నీవు (2) / నాకు లేమి లేదుగా ||ఎంత|| / అందరిలో అతి శ్రేష్ఠుండా / అద్వితీయుడగు యేసయ్యా (2) / హల్లెలూయ స్తోత్రములను (2) / హర్షముతో పాడెద ||ఎంత||

యేసూ ప్రభుని స్తుతించుట|Yesu Prabhuni Sthuthinchuta

యేసూ ప్రభుని స్తుతించుట / ఎంతో ఎంతో మంచిది (2) / మహోన్నతుడా నీ నామమును / స్తుతించుటయే బహు మంచిది (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / విలువైన రక్తము సిలువలో కార్చి / కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / ఎంతో గొప్ప రక్షణనిచ్చి / వింతైన జనముగా మేము చేసెను (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / మా శైలము మా కేడెము / మా కోటయు మా ప్రభువే (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / ఉన్నత దుర్గము రక్షణ శృంగము / రక్షించువాడు మన దేవుడు (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / అతిసుందరుడు అందరిలోన / అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / రాత్రింబవళ్లు వేనోళ్లతోను / స్తుతించుటయే బహుమంచిది (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

మా సర్వానిధి నీవయ్యా|Maa Sarvaanidhi Neevayyaa

మా సర్వానిధి నీవయ్యా / నీ సన్నిధికి వచ్చామయ్యా / బహు బలహీనులము యేసయ్యా / మము బలపరచుము యేసయ్యా / యేసయ్యా… యేసయ్యా… / మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి|| / మా పాపములకై కలువరి గిరిపై / నలిగితివా మా ప్రియ యేసయ్యా (2) / విరిగి నలిగిన హృదయాలతో (2) / స్తుతియింప వచ్చామయ్యా / మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా|| / నీవే మార్గము – నీవే సత్యము / నీవే జీవము – మా యేసయ్యా (2) / జీవపు దాత శ్రీ యేసునాథ (2) / స్తుతియింప వచ్చామయ్యా / మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా|| / మా స్నేహితుడవు – మా రక్షకుడవు / పరిశుద్ధుడవు – మా యేసయ్యా (2) / పరిశుద్ధమైన నీ నామమునే (2) / స్తుతియింప వచ్చామయ్యా / మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||