799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నా యేసయ్యా నా స్తుతియాగము / నైవేద్యమునై ధూపము వోలె / నీ సన్నిధానము చేరును నిత్యము / చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) / ఆత్మతోను మనసుతోను / నేను చేయు విన్నపములు (2) / ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై / విజ్ఞాపన చేయుచున్నావా (2) / విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| / ప్రార్థన చేసి యాచించగానే / నీ బాహు బలము చూపించినావు (2) / మరణపు ముల్లును విరిచితివా నాకై / మరణ భయము తొలగించితివా (2) / మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| / మెలకువ కలిగి ప్రార్థన చేసిన / శోధనలన్నియు తప్పించెదవు (2) / నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై / రారాజుగా దిగి వచ్చెదవు (2) / రారాజుగా దిగి వచ్చెదవు ||నా యేసయ్యా||
సాగేటి ఈ జీవ యాత్రలో / రేగేను పెను తుఫానులెన్నో (2) / ఆదరించవా నీ జీవ వాక్కుతో / సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2) / యేసయ్యా.. ఓ మెసయ్యా / హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి|| / సుడి గాలులెన్నో లోక సాగరాన / వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2) / నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2) / విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా|| / వడ గాటులెన్నో నా పయనములోన / నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2) / తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2) / కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2) ||యేసయ్యా|| / అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన / చెలరేగి విలవిలలాడించే సమయాన (2) / నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2) / కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2) ||యేసయ్యా||
రాజుల రాజా రానైయున్నవాడా (2) / నీకే ఆరాధన / నా యేసయ్యా.. నీకే ఆరాధన (2) / కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును / సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2) / నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా / నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| / రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును / మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2) / ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును / ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల||
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు / నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు / నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన|| / ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2) / దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన|| / ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2) / నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన|| / లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2) / శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన|| / ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2) / ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన|| / మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2) / నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా / నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము / నేనూహించలేను యేసయ్యా (2) / యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| / మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి / మార్గముగా మారి మనిషిగా మార్చావు / మహిని నీవు మాధుర్యముగా మార్చి / మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) / మహిమలో నేను మహిమను పొంద / మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| / ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి / ఆపత్కాలమున ఆదుకొన్నావు / ఆత్మీయులతో ఆనందింప చేసి / ఆనంద తైలముతో అభిషేకించావు (2) / ఆశ తీర ఆరాధన చేసే / అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
నీకసాధ్యమైనది ఏదియు లేదు / సమస్తము సాధ్యము నీకు (2) / ప్రభువా ప్రభువా / సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| / వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం / బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2) / నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా / నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| / పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం / శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2) / నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా / నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| / దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం / నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2) / నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా / నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| / సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం / పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2) / నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా / నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) / బలవంతుడా మహోన్నతుడా / స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నా నోటన్ క్రొత్త పాట / నా యేసు ఇచ్చెను (2) / ఆనందించెదను ఆయననే పాడెదన్ / జీవిత కాలమంతా (2) హల్లెలూయా ||నా నోటన్|| / అంధకార పాపమంత నన్ను చుట్టగా / దేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందించెదను|| / దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను / రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందించెదను|| / నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే / నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2) ||ఆనందించెదను|| / వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా / ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2) ||ఆనందించెదను|| / భువిలోని బాధలు నన్నేమి చేయును / పరలోక దీవెనకై వేచియున్నాను (2) ||ఆనందించెదను||
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా / కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) / నా యేసయ్యా నిను వేడుకొనగా / నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| / అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2) / ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) / నిత్యానందము కలిగించె నీ / శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| / ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2) / అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2) / నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి / వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా|| / ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2) / అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2) / నిత్యము నీతో నేనుండుటకై / నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||
నా కలవరములన్ని కనుమరుగు చేసినావు / నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / నీ చేయి నన్ను సంరక్షించెను / నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి / శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు / జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / నిన్ను నమ్మువారు సీయోనులో చేరి / నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను… / ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను / నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను / ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను / నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను / స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు / కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ / మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు / పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమ / ఇదే కదా ప్రేమంటే – (2) / ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ / దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో|| / మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు / నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే / మొదటగా ప్రేమించింది నేను కాదు / నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే / కోరినాడు పిలిచినాడు – నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు / కుమ్మరించే ప్రేమ మొత్తం – నేను తప్ప ఎవ్వరు లేనట్టు / ఆకశాన తనలో తాను – పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు / భువిలో నాపై ప్రేమ ఎందుకో / ఏమి తిరిగి ఇవ్వలేని – ఈ చిన్న జీవి పైన / ప్రభువుకు అంత ప్రేమ దేనికో / హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక / నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను / అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి / ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా|| / తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే / నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె / ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే / నా యేసు తన ప్రేమ రుజువు పరిచె / పాపమనే కూపమందు – నేను బంధీనైయుండఁగా / పాపమనే అప్పు చేత – బానిసై నేను అలసియుండగా / గగనపు దూరము దాటి వచ్చి – సిలువలో చేతులు పార చాపి / నువ్వంటే నాకింత ప్రేమనే / రక్తముతో నను సంపాదించి – నా కళ్ళల్లో కళ్ళు పెట్టి / నీపై పిచ్చి ప్రేమ నాకనే / హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు / నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు / మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు / అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ||ఇదే కదా|| / ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ / వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ / ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ / వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ / ఆ లేఖ చదువుతుంటే – నా ప్రియుని తలపులు నాలో నిండే / ప్రభుని ప్రేమ లోతు తెలిసి – నా యేసుపై పొంగి పొరలే / రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని / నా ప్రాణము పరి తపియించెనే / యుగయుగములు నన్నేలేడివాడు – అని త్వరలోనే రానున్నాడని / ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే / హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి / నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను / యేసు రక్తమందు శుద్ధులైన వారే / ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ||ఇదే కదా||
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి / దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2) / నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో / సన్నుతించెదను… నా యేసయ్య – నా జీవితము నీకేనయ్యా (2) / హల్లేలూయ.. హల్లేలూయ.. / భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన / నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2) / నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి / నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. / సన్నుతించెదనూ… (2) / హల్లేలూయ.. హల్లేలూయ.. / లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో / నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2) / నిర్దోషిగ చేయుటకై – నీవు దోషివైనావు / నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. / సన్నుతించెదనూ… (2) / హల్లేలూయ.. హల్లేలూయ.. / యే యోగ్యత లేకున్నా, నను ఎన్నుకొంటివి / విలువైన నీసేవలో సాధనముగ మలచితివి (2) / నాదైర్యము నీవెగా, నా రక్షణాధారమ… / నీదు సాక్షిగా ఇలలో జీవింతును… / సన్నుతించెదనూ… (2) / ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి / దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2) / నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో / సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2)
కృప… కృప… కృప… (2) / ఎంత అధ్బుతమైన కృప / ఎంతో మధురమైన స్వరం (2) / నా వంటి పాపిని ప్రేమించెను / నా వంటి నీచుని రక్షించెను (2) / కృప – కృప – కృప – కృప (2) ||ఎంత|| / నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే / నా కలవరములను తొలగించినది కృపయే (2) / కృప… కృప… కృప… (2) / నీ కృప, నీ కృప ||ఎంత|| / నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే / నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2) / కృప… కృప… కృప… (2) / నీ కృప, నీ కృప ||ఎంత|| / పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే / ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2) / కృప… కృప… కృప… (2) / నీ కృప, నీ కృప ||ఎంత||