799 praise songs available. Lyrics in Roman and Telugu script.
రాజాధి రాజ రవి కోటి తేజ / రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) / విడువని కృప నాలో స్థాపించెనే / సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| / వర్ణనకందని పరిపూర్ణమైన నీ / మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2) / కృపా సత్యములతో కాపాడుచున్నావు / దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| / ఊహలకందని ఉన్నతమైన నీ / ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2) / ఊరేగించుచున్నావు విజయోత్సవముతో / యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి|| / మకుటము ధరించిన మహారాజువై నీ / సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2) / నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి / నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2) ||రాజాధి||
అన్నీ సాధ్యమే / యేసుకు అన్నీ సాధ్యమే (2) / అద్భుత శక్తిని నెరపుటకైనా / ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) / ఆ యేసు రక్తానికి / సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| / మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను / మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2) / మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను / మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే|| / బండనే చీల్చగా – జలములే పొంగెను / ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2) / బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని / మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే|| / ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము / ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2) / యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును / ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే|| / కష్టాల కడలిలో – కన్నీటి లోయలో / కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2) / కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము / క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను / నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) / ఆరాధన ఆరాధన (2) / నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2) / ఆరాధన ఆరాధన (2) / దినమెల్ల నీ చేతులు చాపి / నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) / నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై / నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) / ఆరాధన ఆరాధన (2) / నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2) / ఆరాధన ఆరాధన (2) / ధనవంతులుగా చేయుటకు / దారిద్య్రత ననుభవించినావు (2) / హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా / పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) / ఆరాధన ఆరాధన (2) / నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2) / ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా / ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును / నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా / నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| / ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు / ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను / ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా / ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| / ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని / నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా / నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా / నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| / నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను / నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను / నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా / యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
నీ పాదాలే నాకు శరణం / యేసయ్యా నీవే ఆధారము (2) / నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2) / నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే|| / అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2) / నా ఆశ్రయుడా నీ కన్నా నాకు / కనిపించదు వేరొక ఆశ్రయము (2) / కనిపించదు వేరొక ఆశ్రయము / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| / ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2) / నా పోషకుడా నీ కన్న నాకు / కనిపించరే వేరొక పోషకుడు (2) / కనిపించరే వేరొక పోషకుడు / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| / సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2) / నా జయశీలుడా నీకన్న నాకు / కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2) / కనిపించరే జయమునిచ్చే వేరొకరు / శరణం శరణం శరణం / నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||
షారోను రోజావే – నా ప్రాణ స్నేహమే / నిర్దోష రక్తమే – దైవ గొర్రెపిల్లవే / సుందరుడవు – నీవు సుందరుడవు / పదివేలలో నీవు శ్రేష్టుడవు / సుందరుడవు – బహు సుందరుడవు / పదివేలలో అతిశ్రేష్టుడవు / హోసన్నా – ఉన్నత దైవమా / హోసన్నా – దావీదు తనయుడా / స్నేహితులు మరచిపోయినా – బంధువులే విడిచిపోయినా / తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే / సహచారివే సహచారివే / వేదనలో ఆదరించే నా ప్రియుడవే / రోగపు పడకలోన – నిరీక్షణ కోల్పోయినా / నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే / పరిహారివే – పరిహారివే / నా వ్యాధులు భరియించిన యేసువే
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర / వేగిరమే వినుటకు రారండి / ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| / రండి… విన రారండి / యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) / నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి / మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / రండి… వచ్చి చూడండి / యేసయ్య చేసే కార్యములు చూడండి (2) / నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి / శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / సృష్టి కర్తను మరచావు నీవు / సృష్టిని నీవు పూజింప దగునా (2) / భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి / నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు||
మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు / మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2) / ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2) ||మంచివాడు|| / ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు / దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2) ||ఆదరణ|| / ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా / యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2) ||ఆదరణ|| / దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు / నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2) ||ఆదరణ|| / ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం / సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2) ||ఆదరణ||
మంచి దేవుడు నా యేసయ్యా / చింతలన్ని బాపునయ్యా / హృదయ వాంఛతో చేరిన వారికి / శాంతి జీవము ఇచ్చునయ్యా (2) / మహిమా ఘనత ప్రభావము నీకే (2) / కృపల వెనక కృపను చూపి / విడువక నీ కృపలను చూపిన (2) / కృపగల నా యేసు రాజా / నీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా|| / మహిమ వెంట మహిమ నొసగి / నీ రూపమున నన్ను మార్చి (2) / మహిమతో నీవుండు చోటుకి / మమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా|| / జయము వెంట జయమునిచ్చి / జయ జీవితము మాకు ఇచ్చి (2) / జయశీలుడు నా యేసు ప్రభువని / జయము జయమని పాడెదను (2) ||మహిమా||
ఇరువది నలుగురు పెద్దలతో / పరిశుద్ధ దూతల సమూహముతో (2) / నాలుగు జీవుల గానముతో (2) / స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది|| / భూమ్యాకాశములన్నియును / పర్వత సముద్ర జల చరముల్ (2) / ఆకాశ పక్షులు అనుదినము (2) / గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది|| / కరుణారసమగు హృదయుడవు / పరిశుద్ధ దేవ తనయుడవు (2) / మనుజుల రక్షణ కారకుడా (2) / మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది|| / గుప్పిలి విప్పి కూర్మితోను / గొప్పగ దీవెనలిచ్చెదవు (2) / గొర్రెల కాపరి దావీదు (2) / అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||
ఏడానుంటివిరా – ఓరన్న / వేగి ఉరికి రారా – ఓరన్న (2) / యాదికొచ్చెరా యాదన్న / యేసు సిత్ర కథ వినరన్న (2) / ఏలియాలో ఏలియాలో ఏలియాలో / యేసే నా రక్షకుడు ఏలియాలో / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా / యేసే నా రక్షకుడు హల్లెలూయా (2) / యూదా దేశమందు – ఓరన్న / బెత్లెహేమునందు – ఓరన్న / పశువుల శాలయందు – ఓరన్న / ప్రభు యేసు జన్మించె – ఓరన్న / చుక్కల రెక్కలు ఎగుర వేయుచు / చల్లని దూతలు పాట పాడిరి (2) / చల్ల చల్లని చలిలోన – ఓరన్న / గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2) ||ఏలియాలో|| / పెద్ద పెద్దని వాడై – యేసన్న / ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న / వింత వింతలు చేసె – యేసన్న / ఐదు రొట్టెలు రెండు చేపలు / ఐదు వేల మందికి పంచెను (2) / తుఫాను నణిచెను – యేసన్న / సంద్రాన నడిచెను – యేసన్న (2) ||ఏలియాలో|| / ఏ పాపమెరుగని – ఓరన్న / యేసయ్య తండ్రిని – ఓరన్న / సిలువ వేయమని – ఓరన్న / కేకలు వేసిరి – ఓరన్న / సిలువ మోసెను శ్రమల నోర్చెను / మూడవ నాడు తిరిగి లేచెను (2) / పరలోకమెళ్లాడు – యేసన్న / త్వరలోనే వస్తాడు – యేసన్న (2) ||ఏలియాలో||
స్నేహితుడా నా హితుడా / నన్ను మరువని బహు ప్రియుడా / నన్ను విడువని నా హితుడా / ఏమని నిన్ను వర్ణింతును / నీ ప్రేమకు నేను ఏమిత్తును (2) ||స్నేహితుడా|| / కారుచున్న కన్నీరు తుడిచి / పగిలియున్న గుండెను ఓదార్చి (2) / ఆదరించిన స్నేహితుడా / నన్నోదార్చిన నా హితుడా (2) / నన్ను ఓదార్చిన నా హితుడా ||స్నేహితుడా|| / మోడుగున్న బ్రతుకును చిగురించి / గూడు చెదరిన నన్ను దరి చేర్చి (2) / కృపను చూపిన స్నేహితుడా / కనికరించిన నా హితుడా (2) / నన్ను కరుణించిన నా హితుడా ||స్నేహితుడా||