233 grace songs available. Lyrics in Roman and Telugu script.
మనస యేసు మరణ బాధ – లెనసి పడవే / తన – నెనరు జూడవే యా – ఘనుని గూడవే / నిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే ||మనస|| / అచ్చి పాపములను బాప – వచ్చినాడట / వా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందున / తా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట ||మనస|| / ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచు / న-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్ / ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా ||మనస|| / పట్టి దొంగవలెను గంత – గట్టి కన్నులన్ / మరి – గొట్టి చెంపలన్ వడి – దిట్టి నవ్వుచున్ / నిను – గొట్టి రెవ్వరదియు మాకు – జెప్పమనిరట ||మనస|| / ముళ్ల తోడ నొక కిరీట – మల్లి ప్రభు తలన్ / బెట్టి – రెల్లు కర్రతో నా – కళ్ళ జనములు / రా-జిల్లు మనుచు గొట్టి నవ్వి – గొల్లు బెట్టిరా ||మనస|| / మొయ్యలేక సిల్వ భారము – మూర్చ బోయెనా / అ-య్యయ్యో జొక్కెనా యే-సయ్య తూలెనా / మా – యయ్యనిన్ దలంపగుండె – లదరి పోయెనా ||మనస|| / కాలు సేతులన్ గుదించి – కల్వరి గిరిపై / నిన్ – గేలి జేయుచు నీ – కాళ్ళ మీదను / నినుప – చీలలతో గృచ్చి నిన్ను – సిల్వ గొట్టిరా ||మనస|| / దేవ సుతుడా వైతి వేని – తీవరంబుగా / దిగి – నీవు వేగమే రమ్ము – గావు మనుచును / ఇట్లు – గావరించి పల్కు పగర – కరుణ జూపెనా ||మనస|| / తన్ను జంపు శత్రువులకు – దయను జూపెనా / తన – నెనరు జూపెనా ప్రభు – కనికరించెనా / ఓ – జనక యీ జనుల క్షమించు – మనుచు వేడెనా ||మనస|| / తాళలేని బాధ లీచ్చి – దాహమాయెనా / న-న్నేలువానికి నా – పాలి స్వామికి / నే-నేల పాపములను జేసి – హింస పరచితి ||మనస|| / గోడు బుచ్చి సిలువపైన – నేడు మారులు / మా-ట్లాడి ప్రేమతో నా – నాడు శిరమును / వంచి – నేడు ముగిసె సర్వ మనుచు – వీడె ప్రాణము ||మనస|| / మరణమైన ప్రభుని జూచి – ధరణి వణకెనా / బల్ – గిరులు బగిలెనా – గుడి తెరయు జీలెనా / దివా-కరుడు చీకటాయె మృతులు – తిరిగి లేచిరి ||మనస|| / ఇంత జాలి యింత ప్రేమ – యింత శాంతమా / నీ – యంత కరుణను నే – జింత చేయగా / నీ – వింత లెల్ల నిత్య జీవ – విధము లాయెనా ||మనస||
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము / నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము / నీ ఆత్మతో నను నింపుమా / నీ సేవలో ఫలియింపగా / దేవా… దేవా… ||నీ దయ|| / కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా / ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) / ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు / నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) / ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా / నీవె నా మార్గము – నీవె నా జీవము / నీవె నా గమ్యము – నీవె నా సర్వము / నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| / ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి / వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) / నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని / నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) / నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం / నీవె నా తోడుగా – నీవె నా నీడగా / ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా / నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||
అనుదినం ఆ ప్రభుని వరమే / అనుక్షణం ఆశ్చర్య కార్యమే / ఆనందం-తో స్వీకరించుము / అబ్బురం-తో ఆనందించుము / పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2) / నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం|| / అనుదినం ఆ ప్రభుని వరమే / అనుక్షణం ఆశ్చర్య కార్యమే / ఆనందం-తో స్వీకరించుము / అబ్బురం-తో ఆనందించుము / తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2) / ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును ||అనుదినం|| / అనుదినం ఆ ప్రభుని వరమే / అనుక్షణం ఆశ్చర్య కార్యమే / ఆనందం-తో స్వీకరించుము / అబ్బురం-తో ఆనందించుము / నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2) / సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు ||అనుదినం||
భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు / దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2) / ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా / దేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం|| / ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు / విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు / సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు / కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు / నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా / యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) ||భేదం|| / పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా / తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము / పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో / కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా / నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా / కలువరి నాథుడే రక్షణ మార్గము (2) ||భేదం||
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో / తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) / వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా / నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| / నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు / భారమైన సిలువ- మోయలేక మోసావు (2) / కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) / తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| / వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె / మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) / దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2) / ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ||వెలి|| / నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే / నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2) / నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2) / సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2) ||వెలి||
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2) / గడచిన కాలము కృపలో మమ్ము / దాచిన దేవా నీకే స్తోత్రము / పగలూ రేయి కనుపాపవలె / కాచిన దేవా నీకే స్తోత్రము (2) / మము దాచిన దేవా నీకే స్తోత్రము / కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| / కలత చెందిన కష్టకాలమున / కన్న తండ్రివై నను ఆదరించిన / కలుషము నాలో కానవచ్చినా / కాదనక నను కరుణించిన (2) / కరుణించిన దేవా నీకే స్తోత్రము / కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| / లోపములెన్నో దాగి ఉన్నను / ధాతృత్వముతో నను నడిపించినా / అవిధేయతలే ఆవరించినా / దీవెనలెన్నో దయచేసిన (2) / దీవించిన దేవా నీకే స్తోత్రము / దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||
క్షణమైన నీవు నను విడచి పోలేదుగా / కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) / కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన|| / పర్వతములు అన్ని తొలగిపోయినా / నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2) / నా వెన్నంటి నా తట్టు నిలచి / కన్నీటినంతా తొలగించితివి (2) / నీ కృప నను విడిచిపోలేదు / నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన|| / శోధనలు నన్ను చుట్టుముట్టినా / శ్రమలే నన్ను కృంగదీసినా (2) / నా తండ్రివై నా తోడుగా నిలచి / నా భారములన్ని తొలగించితివే (2) / నీ కృప నను విడిచిపోలేదు / నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన||
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా / నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) / నీ వాక్యమే నా పరవశము / నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) / నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ కృపయే నా ఆశ్రయము / నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) / నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ సౌందర్యము యెరూషలేము / నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2) / నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా / ఎనలేని నీ ప్రేమను (2) / నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) / తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ|| / నా మనసు వేదనలో – నాకున్న శోధనలో / ఉల్లాసమే పంచెను / ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో / మధురామృతమునే నింపెను (2) / అనాథయిన నను వెదకెను / ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ|| / నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో / నీ ప్రేమ రుజువై నిలిచెను / వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో / నా హృదయమే కరిగెను (2) / ఇది నీ ప్రేమకే సాధ్యము / వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||
దేవ సంస్తుతి చేయవే మనసా / శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా / దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని / పావన నామము నుతించుమా – నా యంతరంగము / లో వసించు నో సమస్తమా ||దేవ|| / జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) / నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు / లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ|| / చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) / జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద / జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ|| / యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2) / యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు / భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ|| / ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2) / విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను / విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ|| / అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) / నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు / నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ|| / పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) / భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ / ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ|| / పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2) / ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను / ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ|| / కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2) / యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల / యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ|| / మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2) / మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి / కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ|| / పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2) / వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ / ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ|| / పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2) / నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి / తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా / ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా / నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2) / హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా / హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో|| / నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు / పాతాళ వేదన శ్రమలనుండి / నన్ను విడిపించావు (2) ||నీ కృపను|| / నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు / నా గాయములను బాగు చేయ / నీవు శ్రమనొందావు (2) ||నీ కృపను|| / నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు / పరలోక పరిచర్య భాగస్వామిగా / నన్ను స్వీకరించావు (2) ||నీ కృపను||
నీవు లేని రోజు అసలు రోజే కాదయా / నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) / నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| / బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు / నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2) / నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| / ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే / నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2) / నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||