57 songs found
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు / ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2) / నీకే నీకే నీకే పాదాభివందనము / నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక|| / బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు / ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2) / ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను / ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే|| / పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు / ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2) / ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను / ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే||
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా / నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2) / హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో|| / బాధలలో మంచి బంధువువైనావు / వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2) / చీకటి బ్రతుకులో దీపము నీవై / పాపములన్నియు కడిగిన దేవా (2) / నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా / నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| / శోధనలో సొంత రక్షకుడైనావు / శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2) / హృదయ వేదన తొలగించినావు / కృపా క్షేమముతో నడిపించినావు (2) / నా కోసం భువికొచ్చిన దైవ మానవా / నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు / మానక స్తుతించెదము (2) / నీ కనుపాప వలె నన్ను కాచి / నేను చెదరక మోసావు స్తోత్రం (2) / ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే / ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) / స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం / స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| / ఎడారిలో ఉన్న నా జీవితమును / మేలుతో నింపితివే (2) / ఒక కీడైన దరి చేరక నన్ను / తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| / నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును / నీ కృపతో నింపితివే (2) / నీవు చూపిన ప్రేమను పాడగా / పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| / జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే / ఆశ్చర్యమాశ్చర్యమే (2) / నీ పాత్రను కానే కాను / కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2) / నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| / నీ ప్రేమ శాశ్వతమేగా (2) / నీ కరుణ సాగరమేగా (2) / నిను కొలువ భాగ్యమే కదా (2) / నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| / నీ పలుకే తీర్చునాకలి (2) / నీ స్మరణము కూర్చు బలిమిని (2) / నీ బ్రతుకే వెలుగు బాట (2) / నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| / వలదయ్యా లోక భ్రాంతి (2) / కడు భారము ఘోర వ్యాధి (2) / నిను చేరిన నాకు మేలు (2) / నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2) ||ఎరుగనయ్యా||
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను / ఎలా విడువగలనయ్యా నీ సేవను (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా|| / ఆత్మీయులే నన్ను ఆదరించలేదు / ప్రేమించువారే ప్రేమించలేదు (2) / ఆదరించావు ప్రేమించావు (2) / అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| / బంధువులే నన్ను ద్వేషించినారు / సొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2) / చేరదీసావు సేదదీర్చావు (2) / అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| / అనాథగా నేను తిరుగుచున్నప్పుడు / ఆకలితో నేను అలమటించినప్పుడు (2) / ఆదరించావు ఆకలి తీర్చావు (2) / అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
హోలీ హోలీ హోలీ / హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ / హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) / ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం / బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2) / శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము / సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం / అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2) / నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు / నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ / పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2) / రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా / నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / అడోనై అడోనై అడోనై అడోనై / ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2) / సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు / నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / యావే యావే యావే యావే / యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2) / పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు / ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను / దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను / ప్రతి ఉదయం – నిను నమ్మి / ప్రతి రాత్రి – నిను వేడి / ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్ / ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం / ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం (2) / ఎల్ షమా (3) / నా ప్రార్ధన వినువాడా (2) / ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను (వేచి వేచి యున్నాను) / నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను (2) / ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు / పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము / ఆత్మ వర్షం కురిపించి నను బ్రతికించుము / నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు ||ఎల్ షమా|| / విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను / అడుగడుగు నా తోడై ఒడ్డుకు నను చేర్చవా (2) / యెహోవా నా దేవా నీవే నాకున్నది / బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) ||ఎల్ షమా|| / నీ శక్తియే విడిపించును / నీ హస్తమే లేవనెత్తును / నీ మాటయే నా బలము / నీ మార్గము పరిశుద్ధము (2) ||ఎల్ షమా||
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి / ప్రతి సమయములోను… / ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2) / యెహోవా చేసిన మేలుల కొరకై / ఎల్లప్పుడును ఆనందించండి (2) / ఆరాధించండి ||ఎల్లప్పుడును|| / పాపంబు తోడ చింతించుచుండ / నరునిగా ఈ భువిలో ఉదయించెగా / మన పాప భారం తన భుజమున మోసి / మనకై తన ప్రాణం అర్పించెగా (2) / ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి / ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును|| / విశ్వాసమునకు కలిగే పరీక్ష / ఓర్పును కలిగించే ఒక సాధనమై / శోధనకు నిలిచి సహించిన వేళ / జీవ కిరీటమును పొందెదము (2) / నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి / సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును|| / ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి / మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి / మనతో నివాసమును కలిగి యుండుటకు / త్వరలోనే రారాజుగా రానైయుండె (2) / శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి / సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి ||ఎల్లప్పుడును||
ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది / అవధులు లేనిది – యేసుని ప్రేమ / నిశ్చలమైనది ఎన్నడు మారనిది / మాటే తప్పనిది – యేసుని ప్రేమ / ప్రేమా.. యేసుని ప్రేమా / ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు|| / జీవిత యాత్రలో నీ కలలో చెదరినా / జీవన పయనంలో అందరు విడచినా (2) / విడువనిది మరువనిది (2) / యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) / ప్రేమా.. యేసుని ప్రేమా / ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు|| / కల్వరి పయనంలో రక్తపు ధరలు / దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2) / తరగనిది చెదరనిది (2) / యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) / ప్రేమా.. యేసుని ప్రేమా / ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||
ఎల్లవేళలందు – కష్టకాలమందు / వల్లభుండా యేసున్ స్తుతింతున్ / ఎల్లను నీవే నా కెల్లెడల / వల్లపడదే వివరింపన్ (2) / విమోచకుడా – విమోచన నీవే / రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు|| / సృష్టికర్తవు – సహాయము నీవే / ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్ఞానము నీవే – నా పానము నీవే / దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్యోతివి నీవే – నా నీతివి నీవే / ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు|| / నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే / స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జీవము నీవే – నా దేవుడవు నీవే / పావన నీవే – నా కావలి నీవే (2) ||ఎల్లవేళలందు|| / కాంతియు నీవే – నా శాంతియు నీవే / సంతస నీవే – నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు||
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) / నీ కోసమే నా కోసమే / కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి|| / ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా / ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) / మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో / నడువలేని నడకలతో తడబడుతూ పోయావా / సోలి వాలి పోయావా…. ||ఎవరి|| / జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము / జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2) / మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా / నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి / తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు / వీరిని క్షమించు, వీరిని క్షమించు / అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||
ఎవరికి ఎవరు ఈ లోకంలో / చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| / ఎవరెవరో ఎదురౌతుంటారు / ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) / కష్టాలలో వారు కదిలి పోతారు / కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| / ధనము నీకుంటే అందరు వస్తారు / దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) / ఎవరిని నమ్మిన ఫలితము లేదురా / యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| / మనుషుల సాయం వ్యర్ధమురా / రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) / యెహోవాను ఆశ్రయించుట / ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||