57 songs found
ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం / ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2) / దేవుడే నీ జీవిత గమ్యం / దేవ రాజ్యం నీకే సొంతం / గురి తప్పక దరి చేరుమురా / తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| / కష్టాలకు కృంగిపోకురా / నష్టాలకు కుమిలిపోకురా / అశాంతిని చేరనీకురా / తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| / గెలుపోటమి సహజమురా / దివ్య శక్తితో కదులుమురా / ఘన దైవం తోడుండునురా / తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||
ఎవరు ఉన్నా లేకున్నా / యేసయ్య ఉంటే నాకు చాలు (2) / అందరి ప్రేమ అంతంత వరకే / యేసయ్య ప్రేమ అంతము వరకు (2) ||ఎవరు|| / కునుకడు నిదురపోడు / కాపాడుతాడు నన్నెప్పుడు (2) / ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2) / రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) ||అందరి|| / తల్లి మరచినా తండ్రి విడచినా / నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2) / ముదిమి వచ్చినా తల నెరిసినా (2) / చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2) ||అందరి|| / అలసిన కృషించినా / తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2) / శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2) / రెక్కలు చాపి నన్ను కాపాడును (2) ||అందరి||
ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని / ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2) / నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా / నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు|| / తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే / ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే / నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా / ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా / ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన / నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ / ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా / ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు|| / ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా / విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం / నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు / నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ / నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన / నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన / శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో / నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
ఎవరు నన్ను చేయి విడచినన్ / యేసు చేయి విడువడు (2) / చేయి విడువడు (3) / నిన్ను చేయి విడువడు ||ఎవరు || / తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) / లాలించును పాలించును (2) ||ఎవరు|| / వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) / వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు|| / రక్తము తోడ కడిగి వేసాడే (2) / రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| / ఆత్మ చేత అభిషేకించి (2) / వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప / ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2) / నా యేసయ్యా హల్లెలూయా / నా యేసయ్యా హల్లెలూయా (2) / నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2) / నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా|| / ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2) / అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా||
నీవున్నావని ఒకే ఆశ / నడిపిస్తావని ఒకే ఆశ / ఎవరున్నారు నాకిలలో (2) / నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో / ఎవరున్నారు నాకు యేసయ్యా / ఎవరున్నారయ్యా / నీవున్నావని ఒకే ఆశతో / నడిపిస్తావని ఒకే ఆశలో (2) / ఆదరిస్తావని ఆదుకుంటావని (2) / అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా / ఆశలే అడి ఆశలై / బ్రతుకెంతో భారమై (2) / కలలన్ని కన్నీటి వ్యధలై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / ఆప్తులే దూరమై / బంధు మిత్రులకు భారమై (2) / నా అన్న వారే నాకు కరువై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / యాత్రలో తుఫానులే / నా నావనే ముంచేసినా (2) / అద్దరి చేరే ఆశలే అనగారినా / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||
ఎవరూ లేక ఒంటరినై / అందరికి నే దూరమై (2) / అనాథగా నిలిచాను / నువ్వు రావాలేసయ్యా (4) / స్నేహితులని నమ్మాను మోసం చేసారు / బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2) / దీనుడనై అంధుడనై / అనాథగా నే నిలిచాను (2) / నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| / నేనున్నాను నేనున్నానని అందరు అంటారు / కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) / దీనుడనై అంధుడనై / అనాథగా నే నిలిచాను (2) / నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| / చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి / శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2) / దీనుడనై అంధుడనై / అనాథగా నే నిలిచాను (2) / నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
ఎవరూ సమీపించలేని / తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) / నీ మహిమను ధరించిన పరిశుద్ధులు / నా కంటబడగానే (2) / ఏమౌదునో నేనేమౌదునో (2) / ఇహలోక బంధాలు మరచి / నీ యెదుటే నేను నిలిచి (2) / నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి / నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| / పరలోక మహిమను తలచి / నీ పాద పద్మములపై ఒరిగి (2) / పరలోక సైన్య సమూహాలతో కలసి / నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| / జయించిన వారితో కలిసి / నీ సింహాసనము నే చేరగా (2) / ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో / నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
ఎవరో తెలుసా యేసయ్యా / చెబుతా నేడు వినవయ్యా / పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి / రక్షణ పొందయ్యా (2) / దేవాది దేవుడు యేసయ్యా / మానవ జన్మతో వచ్చాడయ్యా (2) / మరణించాడు మరి లేచాడు / నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో|| / ధనవంతుడై యుండి యేసయ్యా / దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2) / రూపు రేఖలు కోల్పోయాడు / నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో|| / పాపుల రక్షకుడేసయ్యా / కార్చెను రక్తము పాపులకై (2) / తన దరి చేరిన పాపులనెల్ల / కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో|| / యేసే దేవుడు ఎరుగవయ్యా / రాజుల రాజుగా వస్తాడయ్యా (2) / నమ్మినవారిని చేర్చును పరమున / నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో|| / యేసుని తరుపున ప్రతినిధినై / దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2) / అతి వినయముగా బతిమాలుచున్నాను / నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో||