85 songs found

ఆరాధన స్తుతి ఆరాధన|Aaraadhana Sthuthi Aaraadhana

ఆరాధన స్తుతి ఆరాధన (3) / నీవంటి వారు ఒక్కరును లేరు / నీవే అతి శ్రేష్టుడా / దూత గణములు నిత్యము కొలిచే / నీవే పరిశుద్దుడా / నిన్నా నేడు మారని ||ఆరాధన|| / అబ్రహాము ఇస్సాకును / బలి ఇచ్చినారాధన / రాళ్ళతో చంపబడిన / స్తెఫను వలె ఆరాధన (2) / ఆరాధన స్తుతి ఆరాధన (2) / పదివేలలోన అతి సుందరుడా / నీకే ఆరాధన / ఇహ పరములోన ఆకాంక్షనీయుడా / నీకు సాటెవ్వరు / నిన్నా నేడు మారని ||ఆరాధన|| / దానియేలు సింహపు బోనులో / చేసిన ఆరాధన / వీధులలో నాట్యమాడిన / దావీదు ఆరాధన (2) / ఆరాధన స్తుతి ఆరాధన (2) / నీవంటి వారు ఒక్కరును లేరు / నీవే అతి శ్రేష్టుడా / దూత గణములు నిత్యము కొలిచే / నీవే పరిశుద్దుడా / నిన్నా నేడు మారని ||ఆరాధన||

ఆరాధనా నీకే ఆరాధనా|Aaraadhanaa Neeke Aaraadhanaa

ఆరాధనా నీకే ఆరాధనా / ఆరాధనా యేసు అన్ని వేళలా (2) / నా కష్టాలలో ఆరాధన / శోక సంద్రములో నీకే ఆరాధన / నా నష్టాలలో ఆరాధన / లోకమే నను విడచినా నీకే ఆరాధన ||ఆరాధనా|| / ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా / ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన / నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా / నను విడువని యేసుని చూస్తూ ఆరాధన (2) / యేసయ్యా నీకే నా ఆరాధన / యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా|| / రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా / సర్వమును భరించు యేసుకే ఆరాధన / శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా / లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన (2) / యేసయ్యా నీకే నా ఆరాధన / యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా||

ఆరాధించెదం|Aaraadhinchedam

ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో / ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో / సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం / జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము / యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా / యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా / యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయే / ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగా / స్తుతులపై ఆసీనుడా యేసయ్యా / మా ప్రార్ధనలు ఆలకించువాడా / స్తుతియాగము చేయు వాడే / నిన్ను మహిమ పరచు వాడు ||యేసయ్యా|| / యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగా / యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగా / దేవుడే యుద్ధము జరిపెను / అద్భుత జయమును పొందిరి / బెరాకా లోయలో కూడిరి / కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి ||యేసయ్యా||

ఆరాధించెదము ఆత్మతో|Aaraadhinchedamu Aathmatho

ఆరాధించెదము ఆత్మతో నిరతము / యెహోవా దేవుని మనమంతా / ఆనంద గానము మనసారా పాడుచు / అనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము|| / అక్షయ నాథుడు అద్వితీయుడు / పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2) / ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2) / అమరుడై యున్నవాడు మన దేవుడు (2) ||ఆరాధించెదము|| / సత్య స్వరూపి మహోన్నతుడు / మహిమాన్వితుడు మనకును తండ్రియే (2) / ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2) / పరమందు ఆసీనుడు పూజార్హుడు (2) ||ఆరాధించెదము|| / సమస్తమునకు జీవాధారుడై / శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2) / భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2) / యుగములకు కర్తయే శ్రీమంతుడు (2) ||ఆరాధించెదము||

ఆరాధించెదము యేసయ్య|Aaraadhinchedamu Yesayya

ఆరాధించెదము యేసయ్య నామమును / పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2) / ఆరాధన ఆరాధన ఆరాధనా / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము|| / ఆది యందు ఉన్న దేవుడు / అద్భుతాలు చేయు దేవుడు (2) / అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2) / అద్వితీయ సత్య దేవుడు / యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన|| / మోక్షము నిచ్చు దేవుడు / మహిమను చూపు దేవుడు (2) / మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2) / మహిమ గల దేవుడు నిత్య దేవుడు / యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) ||ఆరాధన|| / దాహము తీర్చు దేవుడు / ధన ధాన్యములిచ్చు దేవుడు (2) / దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2) / ధరణిలోన గొప్ప దేవుడు / యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) ||ఆరాధన||

Telugu Songs Starting with "ఆ" — Page 5 | UEC Telugu Church