85 songs found
ఆనందము ప్రభు నాకొసగెను / నా జీవితమే మారెను (2) / నా యుల్లమందు యేసు వచ్చెన్ / నా జీవిత రాజాయెను (2) ||ఆనందము|| / ప్రభుని రుచించి ఎరిగితిని / ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2) / విశ్వమంతట నే గాంచలేదు / విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము|| / సంతోషం సముద్రపు అలలన్ పోలి / పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2) / నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసే / నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము|| / శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ / విజయము పొంద బలమొందెదన్ (2) / ప్రభువుతో లోకమున్ జయించెదన్ / ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని / అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) / చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత / వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో / సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| / సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి / ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు / అహా\! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా|| / ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ / ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన / కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా|| / పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ / తరుణములు విరోధముగపై లేచినా – / స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||
ఆనందమే పరమానందమే / ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2) / ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన / అక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే|| / పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే / జీవ జలములు త్రాగనిచ్చితివే (2) / నా ప్రాణమునకు సేదదీర్చితివి / నీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే|| / గాఢాంధకారము లోయలలో నేను / సంచరించినా దేనికి భయపడను (2) / నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును / అనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే|| / నా శత్రువుల ఎదుటే నీవు / నాకు విందును సిద్ధము చేసావు (2) / నీతో నేను నీ మందిరములో / నివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే||
ఆనందింతు నీలో దేవా / అనుదినం నిను స్తుతించుచు (2) / మధురమైన నీ నామమునే (2) / మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు|| / ఆత్మ నాథా అదృశ్య దేవా / అఖిల చరాలకు ఆధారుండా (2) / అనయము నిను మది కొనియాడుచునే / ఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు|| / నాదు జనములు నను విడచినను / నన్ను నీవు విడువకుండా (2) / నీ కను దృష్టి నాపై నుంచి / నాకు రక్షణ శృంగమైన (2) ||ఆనందింతు|| / శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు / మేఘమందు రానైయున్న (2) / ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు / అంతం వరకును భద్రపరచుము (2) ||ఆనందింతు|| / శ్రమలు నన్ను చుట్టిన వేళ / చింతలో కృశించిన వేళ (2) / అభయముగా నీ దర్శనమిచ్చి / శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) ||ఆనందింతు||
ఆనందింతుము ఆనందింతుము / యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2) / గంతులేసి నాట్యమాడి / ఉత్సహించి పాడెదం (2) / యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము|| / భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ / దేవాది దేవుని తోడు మనకుండగా (2) / హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2) / యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2) ||ఆనందింతుము|| / నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ / నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2) / పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2) / యేసుని సన్నిధిలో పరవశించెదం (2) ||ఆనందింతుము|| / ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ / ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2) / మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2) / యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2) ||ఆనందింతుము||
ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే / అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2) / తల్లి కన్నా తండ్రి కన్నా / కాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున|| / నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు / నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2) / ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు / భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు / ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు / నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా ||ఆపత్కాలమున|| / నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత / రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2) / మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ / చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ / నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2) ||ఆపత్కాలమున||
ఆయనే నా సంగీతము బలమైన కోటయును / జీవాధిపతియు ఆయనే / జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| / స్తుతుల మధ్యలో నివాసం చేసి / దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) / వేడుచుండు భక్తుల స్వరము విని / దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| / ఇద్దరు ముగ్గురు నా నామమున / ఏకీభవించిన వారి మధ్యలోన (2) / ఉండెదననిన మన దేవుని / కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| / సృష్టికర్త క్రీస్తు యేసు నామమున / జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) / రాకడలో ప్రభుతో నిత్యముందుము / మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||
ఆరంభమయ్యింది రెస్టోరేషన్ / నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2) / నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం / నా ప్రభువు సమకూర్చి దీవించులే / మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు / ఇకముందు నా చేత చేయించులే / మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ / కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ / రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు / నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి / మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ / కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది|| / మేం శ్రమనొందిన దినముల కొలది / ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును / మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు / తన బుడ్డిలోన దాచుంచెను / సాయంకాలమున ఏడ్పు వచ్చినను – ఉదయము కలుగును / తోట నవ్వు పుట్టును – మాకు వెలుగు కలుగును / దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు – మామ్మాదరించును / కీడు తొలగజేయును – మేలు కలుగజేయును ||రెండంతలు|| / మా పంట పొలముపై దందా యాత్ర చేసిన / ఆ ముడతలను ప్రభువాపును / చీడ పురుగులెన్నియో తిని పారువేసిన / మా పంట మరలా మాకిచ్చును / నా జనులు ఇక సిగ్గునొందరంటు – మా ప్రభువు చెప్పెను / అది తప్పక జరుగును – కడవరి వర్షమొచ్చును / క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో – మా కోట్లు నింపును / క్రొత్త తైలమిచ్ఛ్చును – మా కొరత తీర్చును ||రెండంతలు|| / పక్షి రాజు వలెను మా యవ్వనమును / ప్రభు నిత్య నూతనం చేయును / మేం కోల్పోయిన యవ్వన దినములను / మరలా రెట్టింపుగా మాకిచ్చును / అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా – సారమిచ్చును / జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును / సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు – శక్తినిచ్చును / ఆత్మ వాక్కునిచ్చును – మంచి పుష్టినిచ్చును ||రెండంతలు|| / మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన / మా సొత్తు మాకు విడిపించును / మోసకారి మోసము మేము తిప్పి కొట్టను / ఆత్మ జ్ఞానముతో మేము నింపును / అరె అంధకారమందు రహస్య స్థలములోని – మరుగైన ధనముతో / మమ్ము గొప్ప చేయును – దొంగ దిమ్మ తిరుగును / దొంగిలించలేని పరలోక ధనముతోటి – తృప్తిపరచును / మహిమ కుమ్మరించును – మెప్పు ఘనతనిచ్చును ||రెండంతలు|| / మా జీవితాలలో దైవ చిత్తమంతయు / మేము చేయునట్లు కృపనిచ్చును / సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను / గొప్ప ద్వారములు ప్రభు తెరచును / అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు – అభిషేకమిచ్చును / ఆత్మ రోషమిచ్చును – క్రొత్త ఊపునిచ్చును / మహిమ కలిగినట్టి పరిచర్యచేయునట్లు – దైవోక్తులిచ్చును / సత్య బోధనిచ్చును – రాజ్య మర్మమిచ్చును ||రెండంతలు||
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2) / అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది / అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2) / కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| / సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది / బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2) / ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది / ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2) / కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| / నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి / క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2) / నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది / ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2) / ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2) ||ఆరని|| / భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు / చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2) / ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది / ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2) / ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2) ||ఆరని||
ఆరాధన అందుకో (2) / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో / ఆరాధన అందుకో / అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా / మోషేతో అన్నావు ఉన్నానని (2) / అల్ఫయు నీవే ఓమెగయును (2) / ఆద్యంత రహితుండ నీవేనని / ఘనతా మహిమా నీకేయని / హల్లెలూయా గానము చేసెదను / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో / ఆరాధన అందుకో / పాపంబున జన్మించి నశియించితిని / లోకంబు నాదనుచు ఆశించితిని (2) / అయినా నీవు రక్షణ నివ్వ (2) / వెలిగించి పంపితివి యేసు ప్రభును / ఘనతా మహిమా నీకేయని / హల్లెలూయా గానము చేసెదను / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో / ఆరాధన అందుకో / తెలిసికొంటిని నా యేసు నిన్ను / సర్వ శక్తి గల ప్రభువనియు (2) / రానున్నావు మరలా నాకై (2) / ఆనంద దేశములో నన్నుంచుటకై / ఘనతా మహిమా నీకేయని / హల్లెలూయా గానము చేసెదను / పాప క్షమాపణ జీవమునిచ్చిన / కరుణామయా.. అందుకో ||ఆరాధన||
ఆరాధన అధిక స్తోత్రము (2) / నా యేసుకే నేనర్పింతును (2) / నా యేసుకే నా సమస్తము (2) / పరమ దూత సైన్యము / నిన్ను కోరి స్తుతింపగా (2) / వేనోళ్ళతో నే పాడెదన్ (2) / నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన|| / కరుణ ధార రుధిరము / నన్ను తాకి ప్రవహింపగా (2) / నా పాపమంతయు తొలగిపోయెను (2) / నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||
ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన (4) / యేసయ్య ఆరాధన… / ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన (4) / మెస్సయ్య ఆరాధన… / ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన (4) / పరిశుద్ధుని ఆరాధన… / ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన (4) / పరలోక ఆరాధన…