ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
సొంతమైపోవాలి నా యేసుతో / మిళితమై పోవాలి నా ప్రియునితో (2) / సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2) / ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో / లీనమై పోవాలి ఆ ప్రేమలో (2) / నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి / నా వరుడు కలువరిలో బలియాయెను (2) / బలి అయిన వానికే నా జీవితం / అర్పించుకొనుటే నా ధర్మము (2) / ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై|| / పరదేశిగా నేను వచ్చానిలా / తన ప్రేమ కీర్తిని చాటాలని (2) / ప్రియుని కోసమే బ్రతికెదను / కాపాడుకొందును సౌశీల్యము / ప్రభువు కోసమే బ్రతికెదను / కాపాడుకొందును నా సాక్ష్యము / యేసుతో జీవితం పరమున శాశ్వతం (2) ||సొంతమై||
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) / నీ కోసమే నా కోసమే / కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి|| / ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా / ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) / మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో / నడువలేని నడకలతో తడబడుతూ పోయావా / సోలి వాలి పోయావా…. ||ఎవరి|| / జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము / జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2) / మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా / నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి / తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు / వీరిని క్షమించు, వీరిని క్షమించు / అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||
ఈ దినం సదా నా యేసుకే సొంతం / నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2) / రానున్న కాలము – కలత నివ్వదు (2) / నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| / ఎడారులు లోయలు ఎదురు నిలచినా / ఎన్నడెవరు నడువని బాటయైనను (2) / వెరవదెన్నడైనను నాదు హృదయము (2) / గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| / ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా / యుద్ధకేక నా నోట యేసు నామమే / విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు / యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||
మనిషి బ్రతుకు రంగుల వలయం / ఆ బ్రతుకే క్షణ భంగురం (2) / మారాలి ప్రతి హృదయం / వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి|| / గడ్డి పువ్వురా మనిషి జీవితం / గాలి వీచగా రాలిపోవును (2) / గాలిలో నిలువని దీపమురా ఇది / గాలిలో ఎగిరే గాలిపటం రా (2) / తెలుసుకో ఓ మానవా / ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| / ఆత్మ వెళ్లగా శవమని నిన్ను / ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2) / ఇరుగు పొరుగువారు కూడ కొందరు / వల్లకాటి వరకే వచ్చెదరు (2) / తెలుసుకో ఓ మానవా / ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| / ధనమున్నదని గర్వించకురా / ధనమే నీకు తోడు రాదురా (2) / లోకమే నీకు అశాశ్వతంబురా / పరలోకమే నీకు శాశ్వతంబురా (2) / తెలుసుకో ఓ మానవా / ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||
ఎంత మంచి దేవుడవయ్యా / ఎంత మంచి దేవుడవేసయ్యా / చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా / ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత|| / ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2) / నీ ప్రేమతో నను క్షమియించి / నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత|| / నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2) / ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ / నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత|| / నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2) / నీతో కూడా ఈ లోకం నుండీ / పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||
కన్న తల్లి చేర్చునట్లు / నను చేర్చు నా ప్రియుడు (2) / హల్లేలుయా హల్లేలుయా (2) / కౌగిటిలో హత్తుకొనున్ / నా చింతలన్ బాపును (2) ||కన్న|| / చేయి పట్టి నడుపును / శికరముపై నిలుపును (2) ||కన్న|| / నా కొరకై మరణించే / నా పాపముల్ భరియించే (2) ||కన్న|| / చేయి విడువడు ఎప్పుడు / విడనాడడు ఎన్నడు (2) ||కన్న||
ఎవరు నన్ను చేయి విడచినన్ / యేసు చేయి విడువడు (2) / చేయి విడువడు (3) / నిన్ను చేయి విడువడు ||ఎవరు || / తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) / లాలించును పాలించును (2) ||ఎవరు|| / వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) / వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు|| / రక్తము తోడ కడిగి వేసాడే (2) / రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| / ఆత్మ చేత అభిషేకించి (2) / వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2) / నీ బ్రతుకంతా మారుటే మేలు / కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ|| / పాププు చీకటి బ్రతుకేలా / శాపము భారము నీకేలా (2) / పావన యేసుని పాదము చేరిన / జీవము నీదగురా ||ఓ క్రైస్తవ|| / మారిన జీవిత తీరులలో / మానక నీప్రభు సేవకురా (2) / మహిమ కిరీటము మనకొసగును / ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ|| / భయపడి వెనుకకు పరుగిడక / బలమగు వైరిని గెలిచెదవా (2) / బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన / గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో / నేరములెంచని వాడా – నాదు నజరేయుడా / తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా / ఏ రీతి స్తుతియింతునో… / నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి / నేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి|| / మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి / సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ|| / వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి / రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ|| / ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా / ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2) ||నా ప్రాణ||
ఎవరో తెలుసా యేసయ్యా / చెబుతా నేడు వినవయ్యా / పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి / రక్షణ పొందయ్యా (2) / దేవాది దేవుడు యేసయ్యా / మానవ జన్మతో వచ్చాడయ్యా (2) / మరణించాడు మరి లేచాడు / నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో|| / ధనవంతుడై యుండి యేసయ్యా / దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2) / రూపు రేఖలు కోల్పోయాడు / నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో|| / పాపుల రక్షకుడేసయ్యా / కార్చెను రక్తము పాపులకై (2) / తన దరి చేరిన పాపులనెల్ల / కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో|| / యేసే దేవుడు ఎరుగవయ్యా / రాజుల రాజుగా వస్తాడయ్యా (2) / నమ్మినవారిని చేర్చును పరమున / నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో|| / యేసుని తరుపున ప్రతినిధినై / దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2) / అతి వినయముగా బతిమాలుచున్నాను / నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో||
ఎందరో… ఎందరు ఎందరో… / యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు / రాయబారులై బారులు తీరి తరలండి / క్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండి / వందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయి / సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2) ||ఎందరో|| / పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం / పల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాం / వాగులు వంకలు దాటుదాం / యేసు సిలువ ప్రేమనే చాటుదాం (2) ||వందలు||
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా / నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా / ఊహించలేనే నీ కృపలేని క్షణమును / కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| / లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే / ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే / నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను / నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే / ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2) / స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా / హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||