ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం / నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) / నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2) / నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| / నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు / నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2) / నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను / నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2) / దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| / నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు / ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2) / నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా / నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2) / దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన||
మన యేసు బెత్లహేములో / చిన్న పశుల పాకలో పుట్టె (2) / పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు|| / గొల్లలంతా దూత ద్వారా / యేసుని యొద్దకు వచ్చియుండిరి (2) / వచ్చియుండిరి నమస్కరించిరి (2) ||మన యేసు|| / జ్ఞానులంతా చుక్క ద్వారా / యేసుని యొద్దకు వచ్చియుండిరి (2) / వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2) ||మన యేసు||
వర్ష ధారగా రావా నా యేసయ్యా / ఎండిపోయిన భూమి నేనయ్యా (2) / ఈ నేలలో పంట లేదయ్యా / నా మనస్సులో శాంతి లేదయ్యా (2) / వర్ష ధారగా రావా నా యేసయ్యా / ఫలింపజేయుమా పరమేశ్వరా (2) / పాపములన్ని పరిహరించుమా / భయములెల్ల పారద్రోలుమా (2) / యేసు నాథుడా నా రక్షకా (4) / నీదు కృపతో ఆదరించుమా (2) ||వర్ష|| / మనో వ్యధలను గుణ పరచుమా / తనువు గాయమెల్ల స్వస్థపరచుమా (2) / యేసు నాథుడా పరమ వైద్యుడా (4) / గాయములెల్ల స్వస్థపరచుమా (2) ||వర్ష||
నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా / చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా / ఆశలు ఆవిరై పోయినా / నీ కలలన్ని చెదరిన / అలసిపోక సాగిపోవుమా (2) ||నెమ్మది|| / నీ వారు నిన్ను హేళన చేసినా / నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ / గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ / అవమానం నింద కలచి వేస్తున్నా / నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును / నీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చును / నీ కోసమే తను నిలిచెను / నీ బాధను తొలగించును ||నెమ్మది|| / నీ కన్నీరంతా తుడిచి వేయును / నీ గాయాన్నంతా మాన్పి వేయును / విలువైన పాత్రగ నిన్ను మార్చును / నీ వారికే నిన్ను దీవెనగా చేయును / కాపరి వలె నిన్ను తన కృపలతో నడుపును / నిత్య జీవ మార్గం నీకు ఆయనే చూపును / తన ప్రేమకు నువ్వు సాక్షిగా / జీవించుమా ఇల నిత్యము / నెమ్మది పొందు నెమ్మది పొందు – యేసే నీ తోడు / చీకటి బ్రతుకులో వెలుగు చూపే – యేసే నీ మార్గం
మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా / ఈలాంటి ప్రేమను కలిగినను / క్షమించు నింతటి నేరమును / జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను / ఆశయు అక్కరయు పాపమై / చిక్కితి శత్రువు చేతులలో / మరణపు టంచున చేరితిని / ఇంతలోనే యేసు కరుణింప వచ్చి / క్షమియించి విడిపించెను / ఈలాంటి ప్రేమను కలిగినను / క్షమించు నింతటి నేరమును / నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను / ఏ పాపికి కడు భాగ్యమే / యేసుని చేరగ ధన్యమే / యేసుని ప్రేమ అనంతమే / నీ పాపమంతా తొలగించి / యేసు ప్రేమించి దీవించును / నీ భారమంతయు భరియించును / కన్నీరు తుడిచి ఓదార్చును / శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్ / మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా / ఆ సిల్వ ప్రేమను చూపెదను / నా క్రీస్తు వార్తను చాటెదను / జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని / నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని / దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని / దేవా… యేసయ్యా నిన్ను చేరాలని / జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ / జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2) / మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ / మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ / శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప / వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2) / ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా / తరతరాలు మారినా మారని దేవుడా ||జీసస్|| / విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా / మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2) / తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద / నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును ||జీసస్||
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు / ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2) / చెంత చేరి సంతసించుమా (2) / స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో|| / పాపాల పంకిలమై శోకాలకంకితమై / మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2) / దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2) / జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో|| / సాతాను శోధనలే శాపాల వేదనలై / విలపించే దీనులకై అలరించు దీవెనలై (2) / శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2) / గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) ||నింగిలో||
అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం / అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం / ఉన్నత నామం – సుందర నామం / ఉన్నత నామం – శ్రీ యేసు నామం / అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం / యేసు నామం – యేసు నామం (2) / ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును / ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2) / పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా / పరలోక దీవెనలు పొందగ చేరుము / హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత|| / పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్ / మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2) / పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా / పరలోక దీవెనలు పొందగ చేరుము / హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత||
నీవు తడితే తలుపు తీయనా ప్రభు / నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు|| / పాపముతో నిండియున్న నా బ్రతుకును / పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా / పాపములో జీవించుచున్న నాపై / ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) / నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి / నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు|| / తెరిచాను నా తలుపులు రావా ప్రభు / ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను / నాలోన నీవుండి పోవాలి / నీతోనే నడవాలి ఇక మీదట (2) / రక్షణనే కేడెము చేత పట్టి / ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు|| / విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి / వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా / స్వస్థతనే వరముల దయచేయుమా / కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2) / ఎల్లవేళలా నాతో ఉండి నన్ను / చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు||
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2) / సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2) / రారాజు రానైయున్నాడు / వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము|| / కాలం బహు కొంచమేగా / నీకై ప్రభు వేచెనుగా / జాగు చేసెనేమో నీ కోసమే (2) / సిద్ధమేనా ఇకనైనా / సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| / యేసు వచ్చు వేళకై / వేచి నీవు ప్రార్ధించి / పరిశుద్ధముగా నిలిచెదవా (2) / సిద్ధమేనా ఇకనైనా / సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
రాజా నీ సన్నిధి-లోనే / దొరికెనే ఆనందమానందమే / జీవా జలముతో పొంగే హృదయమే / పాడే స్తుతియు స్తోత్రమే / శ్రమల వేళా నీ ధ్యానమే / నా గానం ఆధారం ఆనందమే / నిలువని సిరుల కన్ననూ / క్షయమౌ ప్రేమ కన్ననూ / విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే / నిలువని సిరుల కన్ననూ / క్షయమౌ ప్రేమ కన్ననూ / విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా|| / మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం / నిలువదాయె పాప శాపాల భారం (2) / నీలో నిలిచి ఫలియించు తీగనై / ఆత్మ ఫలము పొందితినే ||నిలువని|| / తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం / జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2) / నీకై నిలిచి ఇలలోన జీవింప / ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||
ఏమని పాడను – ఏమని పొగడను (2) / నాదు దేవా – లోకనాథా / నీదు నామం – పాడ తరమా / నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని|| / నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే / నీవేగా యేసువే (2) / నిన్ను పాడి స్తుతించుట / ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2) / నీలో భాగమై నీవే జీవమై / నీలో ఉండుటను గూర్చి ||ఏమని|| / జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే / నా ఆశ నీవేగా (2) / దిన దినము నీ ప్రేమ / బాటలో నడువ నాకు నేర్పుము (2) / నీలో భాగమై నీవే జీవమై / నీలో ఉండుటను గూర్చి ||ఏమని||