ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
చిరు దివ్వెల వెలుగులతో / నీ దివ్య కాంతులతో / నను బ్రోవ రావయ్యా / కంటి పాపలా.. నను కాన రావయ్యా (2) / యేసయ్యా.. యేసయ్యా.. (2) / నను బ్రోవ రావయ్యా / నను కాన రావయ్యా (2) / ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో / ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2) / దహించివేస్తున్న అవమానము / కరువైపోయిన సమాధానము (2) / పగిలిన హృదయము / కన్నీటి ధారల సంద్రము (2) / ఎగసి పడుతున్న కెరటము / కానరాని గమ్యము (2) ||చిరు|| / ఏకమైన ఈ లోకము / వేధిస్తున్న విరోధము / దూరమవుతున్న బంధము / తాళలేను ఈ నరకము (2) / ఈదలేని ప్రవాహము / చేరువైన అగాధము (4) ||చిరు||
నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా / నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2) / నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను / నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను / నాకన్ని నేవే దేవా / నా బ్రతుకు నీకే ప్రభువా (2) / దీపముగా నీ వాక్యాన్నిచ్చి / తిన్నని త్రోవలో నన్ను నడిపి / నాకు ముందుగా నీవే నడచి / జారిపడకుండా కాపాడితివి / కొండ తేనెతో నన్ను తృప్తి పరచి / అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి / ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2) ||నాకన్ని|| / ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి / అంధకార శక్తులపై విజయాన్నిచ్చి / ఆశ్చర్య కార్యములెన్నో చేసి / శత్రువుల యెదుట భోజనమిచ్చి / ఎక్కలేని కొండలు ఎక్కించితివి / నా గిన్నె నిండి పార్ల చేసియితివి / నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి – (2) ||నాకన్ని||
మందిరములోనికి రారండి / వందనీయుడేసుని చేరండి (2) / కలవరమైనా కలతలు ఉన్నా (2) / తొలగిపోవును ఆలయాన చేరను / కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము|| / దేవుని తేజస్సు నిలిచే స్థలమిది / క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2) / వెంటాడే భయములైనా / వీడని అపజయములైనా (2) ||తొలగిపోవును|| / సత్యము భోదించు దేవుని బడి ఇది / ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2) / శ్రమల వలన చింతలైనా / శత్రువుతో చిక్కులైనా (2) ||తొలగిపోవును|| / శాంతి ప్రసాదించు దీవెన గృహమిది / స్వస్థత కలిగించు అమృత జలనిధి (2) / కుదుటపడని రోగమైనా / ఎదను తొలిచే వేదనైనా (2) ||తొలగిపోవును||
నా స్తుతుల పైన నివసించువాడా / నా అంతరంగికుడా యేసయ్యా (2) / నీవు నా పక్షమై యున్నావు గనుకే / జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) / నన్ను నిర్మించిన రీతి తలచగా / ఎంతో ఆశ్చర్యమే / అది నా ఊహకే వింతైనది (2) / ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి / ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| / ద్రాక్షావల్లి అయిన నీలోనే / బహుగా వేరు పారగా / నీతో మధురమైన ఫలములీయనా (2) / ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే / విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల|| / నీతో యాత్ర చేయు మార్గములు / ఎంతో రమ్యమైనవి / అవి నాకెంతో ప్రియమైనవి (2) / నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి / పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) ||నా స్తుతుల||
యేసు దేవా నను కొనిపోవా / నీ రాజ్యముకై వేచియున్నా (2) / శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది / శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది / నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను / అంత వరకు నీదు శక్తినిమ్మయా / నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను / అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| / ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది / ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2) / నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా / నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2) ||యేసు|| / నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను / నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2) / నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము / నీ ఆత్మ శక్తితో నను బలపరచుము / నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు / కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను ||యేసు||
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను / ఆత్మతో సత్యముతో స్తుతించెదను / ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము / ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| / దుప్పి నీటికై ఆశపడునట్లుగా / దేవుని కొరకై ఆశ పడుచున్నాను / దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2) / దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| / లోక ఆశలు లయమైపోవును / లోకులెవ్వరు కాపాడలేరు / లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2) / లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||
నీ దయలో నేనున్న ఇంత కాలం / నీ కృపలో దాచినావు గత కాలం (2) / నీ దయ లేనిదే నేనేమౌదునో (2) / తెలియదయ్యా… ||నీ దయలో|| / తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో / చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2) / నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా / నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా / నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని / నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో|| / నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు / అపవాది కోరలకు అంటకుండ దాచావు (2) / నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము / ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు / నీ పాదాల చెంతనే నే పరవశించాలని / నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో / మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) / ఇది పండుగ – క్రిస్మస్ పండుగ / జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| / పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) / కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| / సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2) / నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ|| / శరీర ధారిగా – కృపగల దేవునిగా (2) / పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||
శత కోటి రాగాలు వల్లించిన / నా యేసుకే నేను స్తుతి పాడనా / దినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగా / ఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనా / హ్యాపీ న్యూ ఇయర్ (2) / మై విషెస్ టు ఆల్ హియర్ (2) / నా కంటి పాపై నా ఇంటి వెలుగై / నన్నాదరించాడు నా యేసుడే / నా మంచి కోరి నా మేలు కోరి / నను పెంచుతున్నాడు నా యేసుడే / నా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2) / అయినా నను ప్రేమిస్తాడు / కన్న తల్లిలా నను లాలిస్తాడు ||హ్యాపీ|| / నా ఆశ తానై – నా శ్వాస తానై / నన్ను నడుపుతున్నాడు నా యేసుడే / నాలోన యుక్తయి – నాలోన బలమై / నను దరికి చేర్చాడు నా యేసుడే / ఏమైనా నేనేమి ప్రభుకివ్వగలను (2) / వరదలా దీవిస్తాడు / కన్న తండ్రిలా నను మెప్పిస్తాడు ||హ్యాపీ||
జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్ / వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్ / రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్ / మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) / ఈ రాత్రిలో కడు దీనుడై / యేసు పుట్టెను బెత్లెహేములో (2) / తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై / నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి|| / ఇమ్మానుయేలుగా అరుదించెను / దైవ మానవుడు యేసు దేవుడు (2) / నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు / ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి||
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా / విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా / అవిధేయత తొలగించుమయ్యా / నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| / పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి / ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2) / సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2) / అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| / పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి / ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2) / శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2) / రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||
త్యాగమెంత చేసావు దేవా / నా పాపమంత కడిగావా నేస్తం (2) / ఓ యేసయ్యా… నా నేస్తమా… (2) ||త్యాగమెంత|| / గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా / ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా (2) / కన్నీరు తుడిచి / కల్వరికి నడిచావా (2) ||ఓ యేసయ్యా|| / తల వాల్చుటకైన నీకు తావే లేదుగా / తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా (2) / స్వస్థత నాకిచ్చి / సిలువ నీవు మోసావా (2) ||ఓ యేసయ్యా||