ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
సంతోష గీతం పాడెదను / యేసూ నీ ఘనతను చాటెదను (2) / స్తోత్రము చెల్లింతును / నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| / నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు / నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2) / నా విజ్ఞాపన అలించావు / నా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| / సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు / తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2) / నను బాగుగ పరిశీలించావు / నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష||
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు / గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2) / లోకమే సంతోషించగా / ప్రేమనే పంచే క్రీస్తుగా / బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా / పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| / దేవుని కోపము నుండి / తప్పించే ప్రియ పుత్రుడాయనే (2) / ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను|| / గుండెలో కొలువైయుండి / దీవించే ధనవంతుడాయనే (2) / ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను|| / తోడుగ వెంటే ఉండి / రక్షించే బలవంతుడాయనే (2) / చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||
మాటే చాలయ్యా యేసూ నాకు / నీ మాటలోనే జీవం ఉన్నది (2) / నీ మాట వల్లె జరుగును అద్భుతాలు / నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2) / నీ మాటకు సమస్తం సాధ్యమే (2) ||మాటే|| / సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి / సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2) / నీ మాటకు శక్తి ఉన్నదయ్యా / నీ మాటకు సమస్తం లోబడును (2) ||నీ మాట వల్లె|| / పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు / దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును (2) / నీ మాటలో స్వస్థత ఉందయ్యా / నీ మాటతోనే విడుదల కలుగును (2) ||నీ మాట వల్లె|| / జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు / నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది (2) / నీ మాటలో జీవం ఉందయ్యా / నీ మాటలే మాకు జీవాహారాము (2) ||నీ మాట వల్లె||
నా కొరకై అన్నియు చేసెను యేసు / నాకింకా భయము లేదు లోకములో (2) / నా కొరకై అన్నియు చేసినందులకు (2) / నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై|| / క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను / క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2) / క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2) / ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై|| / ఆకాశ పక్షులను గమనించుడి / విత్తవు అవి పంట కోయవు (2) / వాటిని పోషించునట్టి పరమ పితా (2) / మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై|| / ఏమి ధరింతుమని చింతపడకు / అడవి పువ్వులను తేరి చూడుము (2) / అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2) / తానె – నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై|| / రేపటి దినము గూర్చి చింత పడకు / ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2) / రేపు దాని సంగతులనదే చింతించున్ (2) / ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై|| / ఆశీర్వదించెడి యేసు అరణ్యములో / పోషించెను ఐదు వేల మందిని కూడా (2) / తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2) / యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||
క్రిస్మస్ శుభదినం / మహోన్నతమైన దినము / ప్రకాశమైన దినము / నా యేసు జన్మ దినము (2) / క్రిస్మస్ శుభదినం / హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) / విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ / వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2) / దావీదు వేరు చిగురు / వికసించె నేడు భూమిపై (2) / అద్వితీయ కుమారునిగా / లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ|| / కన్నుల పండుగగా మారెను / నా యేసు జన్మదినం (2) / కన్య మరియకు జన్మించెను / కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ|| / ఆనందముతో ఆహ్వానించండి / క్రీస్తుని మీ హృదయములోకి (2) / ఆ తారగా మీరుండి / నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ||
మహాఘనుడవు మహోన్నతుడవు / పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2) / కృపా సత్య సంపూర్ణమై / మా మధ్యలో నివసించుట న్యాయమా / నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2) / వినయముగల వారిని / తగిన సమయములో హెచ్చించువాడవని (2) / నీవు వాడు పాత్రనై నేనుండుటకై / నిలిచియుందును పవిత్రతతో (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| / దీన మనస్సు గలవారికే / సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2) / నీ సముఖములో సజీవ సాక్షినై / కాపాడుకొందును మెళకువతో (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| / శోధింపబడు వారికి / మార్గము చూపించి తప్పించువాడవని (2) / నా సిలువ మోయుచు నీ సిలువ నీడను / విశ్రమింతును అంతము వరకు (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను / కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం / దైవం నీవయ్యా పాపిని నేనయ్యా / నీదు రక్తముతో నన్ను కడుగు / జీవం నీవయ్యా జీవితం నీదయ్యా / నీదు సాక్షిగా నన్ను నిలుపు / కారణ భూతుడా పరిశుద్ధుడా / నీదు ఆత్మతో నన్ను నింపు / మరనాత యేసు నాథా / నీదు రాజ్యములో నన్ను చేర్చు / ఘనుడా సిల్వ ధరుడా / అమూల్యం నీదు రుధిరం (2) ఓ… / నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం / నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం / ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం / సర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా|| / ప్రియుడా ప్రాణ ప్రియుడా / వరమే నీదు స్నేహం (2) / నా రక్షణకై పరమును వీడే / నా విమోచనకై క్రయ ధనమాయె / ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం / పరమాత్ముడా నీకే సర్వం ||యెహోవా||
కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2) / క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే / పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే / కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే / కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే / సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే / విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే / శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే / ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే / శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే / ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే / ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా / నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) / లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను / లోక నాథుడై మరియకవతరించెను (2) / ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| / బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము / యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2) / ఈ నాడే మనకు పండగ / రారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| / ఆకశాన తార ఒకటి బయలుదేరెను / తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2) / చిన్నారి యేసు బాబును / కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి|| / పొలములోని గొల్లవారి కనుల ముందర / గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2) / మేరమ్మ జోల పాడగా / జగాలు పరవశించెగా (3) ||రాత్రి|| / లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను / భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2) / ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||
నేడే ప్రియరాగం పలికే నవ గీతం / ప్రేమే మన కోసం వెలసే / లోకాన శాంతి మురిసింది / మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే|| / దివినేలు దేవుడు ఉదయించగానే / ఇలలోన ప్రకృతి పులకించెగా / పరలోక దూతలు స్తుతియించగానే / జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే|| / మనిషైన సుతుడు జనియించగానే / విశ్వాన గోళాలు విభవించెగా / చిన్నారి యేసుని చిరునవ్వుతోనే / నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే|| / హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / హ్యాప్పీ క్రిస్మస్ టు యు… / లోకాన శాంతి మురిసింది / మన మనస్సులో రాగాల కాంతి విరిసింది
పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును / మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును / ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా / యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) / అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును / పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ / రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా / నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2) ||పరిశుద్ధుడా||
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా / ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి / యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| / కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట / భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని / ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| / మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై / అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను / అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న|| / వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను / పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే / నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న|| / కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను / సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము / బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె ||ఉన్న|| / నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని / కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని / భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె ||ఉన్న|| / దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను / తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు / డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న||