ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
పరుగెత్తెదా పరుగెత్తెదా / పిలుపుకు తగిన బహుమతికై / ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో / గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| / దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2) / అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| / ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2) / అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| / యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2) / వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||
సృష్టి కర్తా యేసు దేవా / సర్వ లోకం నీ మాట వినును (2) / సర్వ లోక నాథా సకలం నీవేగా / సర్వ లోక రాజా సర్వము నీవేగా / సన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| / కానాన్ వివాహములో అద్భుతముగా / నీటిని ద్రాక్షా రసము చేసి / కనలేని అంధులకు చూపు నొసగి / చెవిటి మూగల బాగు పరచితివి / నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో / ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| / మృతుల సహితము జీవింపజేసి / మృతిని గెలిచి తిరిగి లేచితివి / నీ రాజ్యములో నీతో వసింప / కొనిపోవ త్వరలో రానుంటివే / నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో / ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ||
యేసు రాజ నాలో నిన్ను చూడనీ / త్వరలో నీలో నన్ను సాగనీ (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ|| / తరిమే తరతరాల ఒరవడిలో / ఉరికే పరిసరాల సవ్వడిలో (2) / నీ తోడే చాలని – నీ నీడే మేలని / నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| / పెరిగే అన్యాయపు చీకటిలో / కరిగే అనురాగపు వాకిటలో (2) / నీ మాట చాలని – నీ బాట మేలని / నా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||
కావలివాడా ఓ కావలివాడా / కనులు తెరచి పొలమును చూడు / కోతకు వచ్చిన పంటను కోయుము ||కావలి|| / పిలిచెను నీ యజమానుడు / జత పనివాడవై యుండుటకు (2) / కొలుచును నీ ఫలమంతమున / పని చేసిన రీతిగనే (2) ||కావలి|| / నమ్మెను నీ యజమానుడు / అప్పగించెను తన స్వాస్థ్యము (2) / తిరిగి వచ్చును జీతమియ్యను / సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2) ||కావలి|| / ఎంచెను నీ యజమానుడు / నీ పాదములు సుందరములని (2) / ఉంచెను కర్మెలు పర్వతముపై / పరుగిడుము పరాక్రమ శాలివై (2) ||కావలి|| / వేయుము పునాది నేర్పరివై / చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2) / కొయ్య కాలును కర్ర గడ్డియు / కాలిపోవును అగ్ని పరీక్షలో (2) ||కావలి||
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ / దర్శించగా రావా / అభిషేకం లేక దర్శనము రాక / నశియించుచున్నానయ్యా (2) / కావలివాడు ఉదయం కోసం / మెలుకువ కలిగి చూచునట్లుగా (2) / నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా / నా జీవం నీవేనయ్యా (4) / ఎండిన నేల వర్షం కోసం / నేలను విరచి చూచునట్లుగా (2) / నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా / నా జీవం నీవేనయ్యా (4) / దుప్పి నీటి వాగుల కొరకు / ఇలలో ఎదురు చూచునట్లుగా (2) / నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా / నా జీవం నీవేనయ్యా (4)
నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును / నా ఊహ చాలదు ఊపిరి చాలదు / ఎంతో ఎంతో మధురం / నీ ప్రేమ ఎంతో మధురం / ప్రభు యేసు ప్రేమ మధురం / నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో / నా పూర్ణ మనస్సుతో / నిను పూజింతును నా ప్రభువా (2) ||నీ ప్రేమ|| / దేవదూతలు రేయింబవలు / కొనియాడుచుందురు నీ ప్రేమను (2) / కృపామయుడా కరుణించువాడా / ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2) ||నా పూర్ణ|| / సృష్టికర్తవు సర్వలోకమును / కాపాడువాడవు పాలించువాడవు (2) / సర్వమానవులను పరమున చేర్చెడి / అద్వితీయుడా ఆరాధ్యదైవమా (2) ||నా పూర్ణ||
జీవ నాథ ముక్తి దాత / శాంతి దాత పరమాత్మ / పావనాత్మ పరుగిడి రావా / నా హృదిలో నివసింప రావా / నీ రాక కోసం వేచియున్నాను / వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) / ముక్తి ప్రసాదించుము / భక్తిని నేర్పించుము / నీ ఆనందముతో నను నింపుము – (2) / వేంచేయు మా ఆత్మ దేవా / వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ|| / నీ శాంతి నింపంగ రావా / నీ శక్తి నింపంగ రావా (2) / నీ పరమ వారములతో నింపేవా (2) / వేంచేయు మా ఆత్మ దేవా / వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ||
నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా / నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2) / మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా / ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా|| / ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా / ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2) / వస్తువాహనాల కాధారం / సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా|| / ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా / ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2) / డబ్బును నమ్మకురా / గబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా|| / ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా / ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా (2) / ధనము కోరిక తీర్చునురా / నరకానికి చేర్చునురా (2) ||నమ్మకురా||
యేసయ్యా నా ప్రాణ నాథా / రుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో – (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా|| / నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకు / నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమ / నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి / కడు దీనుడవై నా పాప భారం మోసితివి / రిక్తుడవై వేలాడితివే / రక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా|| / పునరుత్తానుండా మృతి చెందలేదే – నీ ప్రేమ / యుగముల అంతము వరకు నాకై వేచినది – నీ ప్రేమ / ప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలో / శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివి / అందదు నా మందికి అద్భుత ప్రేమ – (2) ||హల్లెలూయా|| / నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను – నిర్మించితివే / నీ స్వకీయ సంపాద్యముగా నన్ను – చేసితివే / నను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు / ఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా / చాలదు నా జీవిత కాలమంతా – (2) ||హల్లెలూయా||
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా / నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2) / నీ దీవెనా నాకు చాలయ్యా (2) / ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| / నన్ను ప్రేమించి నన్నాదరించి / నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా|| / ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా / నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా|| / కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా / నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2) / నీ సువార్తను నే చాటెదను (2) / ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||
పునరుత్థానుడా నా యేసయ్యా (2) / మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2) / స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు / ఆరాధించెద నీలో జీవించుచు (2) / నీ కృప చేతనే నాకు / నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2) / పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2) / నా విమోచకుడవు నీవేనని / రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి|| / నే ముందెన్నడు వెళ్ళని / తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2) / సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2) / నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే / పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి|| / చెరలోనైన స్తుతి పాడుచు / మరణము వరకు నిను ప్రకటించెదా (2) / ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2) / యేసు మేఘాలపై త్వరగా రానుండగా / నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2) / తప్పిపోయిన గొర్రె నేను / వెదకి కనుగొన్నావయ్యా / నీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత|| / సుఖములంటూ లోకమంటూ / నీదు వాక్యము మరచితి / నీదు సన్నిధి విడచితి (2) / యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా / నా అతిక్రమములు క్షమియించి / జాలి చూపితివి (2) ||ఎంత|| / నా తలంపులు నా క్రియలు / నీకు తెలిసేయున్నవి / నీవే నిర్మాణకుడవు (2) / యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా / కృతజ్ఞతా స్తుతులు నీకు / సమర్పించెదను (2) ||ఎంత||