తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

నీ జీవితములో|Nee Jeevithamulo

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా / ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2) ||నీ జీవితములో|| / నీ తల్లి గర్భాన నీవుండినపుడే / నిను చూచే ప్రభు కన్నులు (2) / యోచించలేవా ఏ రీతి నిన్ను / నిర్మించే తన చేతులు (2) ||నీ జీవితములో|| / నీలోనే తాను నివసింపగోరి / దినమెల్ల చేజాచెను (2) / హృదయంపు తలుపు తెరువంగ లేవా / యేసు ప్రవేశింపను (2) ||నీ జీవితములో|| / తన చేతులందు రుధిరంపు ధారల్ / స్రవియించే నీకోసమే (2) / భరియించె శిక్ష నీకోసమేగా / ఒకసారి గమనించావా (2) ||నీ జీవితములో|| / ప్రభు యేసు నిన్ను సంధించునట్టి / సమయంబు యీనాడేగా (2) / ఈ చోటనుండి ప్రభు యేసు లేక / పోబోకుమో సోదరా / ఈ చోటనుండి ప్రభు యేసు లేక / పోబోకుమో సోదరీ ||నీ జీవితములో||

ఒక్కడే యేసు ఒక్కడే|Okkade Yesu Okkade

ఒక్కడే యేసు ఒక్కడే / ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2) / మహాదేవుడు మహిమోన్నతుడు / లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే / పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2) / జీవమార్గమై సత్యదైవమై / మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే / అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2) / ఆదరించి ఆశ్రయమిచ్చి / అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే / నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2) / నీ వేదనలో నీ బాధలలో / నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| / మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే / మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2) / పరిశుద్దులను ఆ పరమునకు / కొనిపోవువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||

స్తుతించెదను స్తుతించెదను|Sthuthinchedanu Sthuthinchedanu

స్తుతించెదను స్తుతించెదను / నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను|| / ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) / ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2) / ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను|| / నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2) / నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2) / నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2) ||స్తుతించెదను|| / పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2) / పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2) / పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2) ||స్తుతించెదను|| / తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2) / దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2) / దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2) ||స్తుతించెదను|| / సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2) / స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2) / శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2) ||స్తుతించెదను||

దినదినంబు యేసుకు|Dinadinambu Yesuku

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా / అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) / ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) / పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| / మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) / మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| / ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) / ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| / దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) / ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| / పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) / సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||

దిక్కులెన్ని తిరిగినా|Dikkulenni Thiriginaa

దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) / మనకు దిక్కు ఈ బాల యేసుడే / ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో / ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) / కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) / స్థలము లేక తిరిగి వేసారెను / నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) / కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) / నేడు నోవాహు ఓడ జోరేబు కొండ / గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| / దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2) / తన మార్గమందు నడుప బుట్టెను / ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) / జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) / నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి / హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||

స్తోత్రబలి స్తోత్రబలి|Sthothrabali Sthothrabali

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా / శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) / నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) / నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) / మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) / ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) / యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||