ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2) / నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని / నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని / చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా / చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| / కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని / బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2) / లేరు ఎవరు వినుటకు / రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| / లోకమంత వెలివేయగ కుమిలిపోతిని / నమ్మినవారు నను వీడగ భారమాయెను (2) / లేరు ఎవరు వినుటకు / రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||
వాటి వాటి కాలమున అన్నిటిని / అతి మనోహరముగా చేయువాడా (2) / యేసయ్యా.. యేసయ్యా.. / నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి|| / ఆశ భంగం కానేరదు / మంచి రోజు ముందున్నది (2) / సత్క్రియను ఆరంభించెను / ఎటులైన చేసి ముగించును (2) / (నే) రూఢిగా నమ్ముచున్నాను / ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా|| / అద్భుతములు చేసెదను / నీ తోడుంటానంటివి (2) / నా ప్రజల ఎదుట నీవు / (నను) హెచ్చింప చేసెదవు (2) / (నే) రూఢిగా నమ్ముచున్నాను / హెచ్చింప చేసెదవు (2) ||యేసయ్యా|| / ఇప్పుడున్న వాటి కంటే / వెయ్యి రెట్లు చేసెదవు (2) / ఆకాశ తార వలె / భువిలో ప్రకాశింతును (2) / (నే) రూఢిగా నమ్ముచున్నాను / భువిలో ప్రకాశింతును (2) ||యేసయ్యా||
నా మనస్సా ఆయన మరచునా / దేవుడు నిన్ను మరచిపోవునా (2) / ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే / ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) / స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే / కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) / నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో / సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) / తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే|| / సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే / బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే / సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు / ఈ నూతనవత్సరములో – అలంకరించునే… / విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు / ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2) / కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే|| ||నా మనస్సా||
నా మార్గమందు నా కంటె ముందు / నడిచావయ్యా నా యేసయ్యా / పరలోకమందు నేనుండాలని / ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2) / నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి / సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి / అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి / మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నీ ప్రేమను – ప్రకటించుటకు / నీ చిత్తము – నెరవేర్చుటకు / నీ సేవలో – కొనసాగుటకు / నీ మహిమలో – నేనుండుటకు / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు – (2)
శ్రమలందు నీవు నలిగే సమయమున / ప్రభు నీకు తోడుండునని / యోచించలేదా? గమనించలేదా? / ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు|| / శ్రమలందు ఏలియాకు కాకోలముచేత / ఆహారము పంపించ లేదా? (2) / ఈనాడు నీకు జీవాహారముతో / నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు|| / శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి / రాజ్యాధికారమీయలేదా? (2) / ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి / పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు||
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు / సంతోషాలే పొంగేనండి – హైలెస్సా / దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే / సంగీతాలే పాడాలండి – హైలెస్సా / అంధకారాన్ని తొలగించే మహనీయుడు / పుట్టినాడండి యేసయ్య మన దేవుడు / నిన్నే కోరి – నిన్నే చేరి / ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో|| / లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా / ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2) / దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక / ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని / మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో|| / వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి / ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2) / మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే / కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే / ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో|| / ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా / వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2) / సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ / భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా / మన యేసయ్య మనకుండగా ||ఏలో||
దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ / ఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున / ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు / నీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు / ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు / బేత్లెహేమందు నేడు జన్మించెన్ / శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము / ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి యుత్సాహముతో / ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు / పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు / భూనివాసులందరు – మృత్యు భీతి గెల్తురు / నిన్ను నమ్మువారికి – ఆత్మ శుద్ధి కల్గును / జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట / మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ / సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము / ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి / రండి నేడు పుట్టినట్టి / రాజునారాధించుడి (2) / నీకు నమస్కరించి నీకు నమస్కరించి / నీకు నమస్కరించి పూజింతుము / యేసు పుట్టగానే వింత – (2) / ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా – (2) / నేడు లోక రక్షకుండు – (2) / పుట్టినాడురా ఈ పుడమి యందున – (2) / పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో – (2) / పవళించెను… పవళించెను… / పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు – (2) / దూతల గీతాల మోత విను బేతలేమా / పరమ దూతల గీతాల మోత విను బేతలేమా / ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి – (2) / పరమ దూతల గీతాల మోత విను బేతలేమా – (2)
ఉదయించినాడు నా జీవితాన / నా నీతిసూర్యుడు నా యేసయ్యా / నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2) / సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ / ఇష్టులైన వారికిల సమాధానము (2) ||ఉదయించినాడు|| / మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా (2) / మరియమ్మ గర్భాన జన్మించినాడు / మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) / మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు|| / గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను (2) / గుణవంతుడైన నా యేసయ్యనే / గురిగా నేను నిలుపుకుంటినే (2) / గురిగా నేను చేసుకుంటినే ||ఉదయించినాడు|| / కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2) / కడతేర్చుటకు కరుణామయునిగా / ఇలలో నాకై ఏతెంచెను (2) / ఇలలో నాకై ఏతెంచెను ||ఉదయించినాడు||
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు / ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2) / ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన (2) / నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే / నీ శక్తినే చాట నన్నుంచెనే చోట / నిన్నెరుగుటే మా ధనం / ఆరాధనే మా ఆయుధం / ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా / ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2) / నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా / నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2) ||ఊరుకో|| / ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు / అన్యాయము చేయుట అసంభవమేగా (2) / వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు / దుష్కార్యము చేయుట అసంభవమేగా (2) ||ఊరుకో|| / అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా / అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2) / యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను / చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2) ||ఊరుకో||
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా / ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన / నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) / జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా / నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| / ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు / సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2) / నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై / తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| / నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు / కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2) / నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై / నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| / హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు / కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2) / నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై / నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే||
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు / నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు / నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను / నీ ప్రేమకు సాటి లేదు (2) / నశించుటకు ఎందరో వేచియున్నను / నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను / ద్రోహము నిందల మధ్యలో నే నడచినను / నీ నిర్మల హస్తము నన్ను భరియించెను / యజమానుడా నా యజమానుడా… / నన్ను పిలచిన యజమానుడా / యజమానుడా నా యజమానుడా… / నన్ను నడిపించే యజమానుడా / మనుషులు మూసిన తలుపులు కొన్నైనను / నాకై నీవు తెరచినవి అనేకములు / మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను / నన్ను వెంటాడి నీ సేవను చేసితివి / నా ఆధారమా నా దైవమా / పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2) / పిలిచిన నీవు నిజమైన వాడవు / నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు / ఏదేమైనను కొనసాగించితివి / నీపై ఆధారపడుటకు అర్హుడవు / నిన్ను నమ్మెదను వెంబడింతును / చిరకాలము నిన్నే సేవింతును (2) ||నీ పిలుపు||
రాజులకే రారాజు పుట్టాడోయ్ / దివి నుంచి భువికే వచ్చాడోయ్ / ఊరూ వాడా కలిసి రారండోయ్ / సంబరాలు సంబరాలు చేయండోయ్… / అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని / పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి (2) / పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2) / ఆర్భాటించి చాటించి మోగించేద్దామా / సంబరాలు సంబరాలు చేసేద్దామా – (4) / పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని / సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2) / జన్మ పాపమే లేనివాడని / నీదు భారము మోయువాడని (2) ||ఆర్భాటించి|| / వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని / కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని (2) / మార్గం సత్యము జీవం యేసని / మోక్ష ద్వారమై పుట్టినాడని (2) ||ఆర్భాటించి|| / సంబరాలు సంబరాలు చేసేద్దామా (5) / క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా