ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి / మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా / ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము / ఆనందించెదము మేము ఆనందించెదము / నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము / మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము / యేసు యేసు నీ ద్వారనే / మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి / యేసు యేసు నీ వలనే కదా / మేము నీతోడి దేవునికి వారసులమైతిమి ||మా హృదయములలో|| / ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి / కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి / మా అపరాధముల కొరకు అప్పగింపబడి / మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు / మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను అనుగ్రహించుటకు / పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి ||మా హృదయములలో|| / శ్రమల కాలములో శోకముల ఘడియలలో / నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము / మేమికను పాపులముగా నుండగానే ప్రభూ / మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి / మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము / ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము ||మా హృదయములలో||
ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు / నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము / ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు / నేనేమాత్రము మేము ఏ మాత్రము / నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే / నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు|| / ఎన్నుకొంటివే నన్ను ఎందుకని / హెచ్చించితివే నన్ను ఎందుకని (2) / మందను వెంటాడి తిరుగుచుంటినే (2) / సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన|| / నా ఆలోచనలన్ని చిన్నవని / నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2) / తాత్కాలిక సహాయము నే అడిగితినే (2) / యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము / నీవే ఆధారము – నీవే నా ఆనందము / నీ ప్రేమ నాలో పదిలము / నీలోనే సాక్ష్యమే సంతోషము (2) / సర్వోన్నతుడా నీకే మహిమ / పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే|| / నా జీవితాంతం నిన్నే పొగడెదను / నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2) / నా దేవుని మందిరములో నివసించెదను / నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా|| / నా బలహీన స్థితిలో గతివి నీవైతివే / నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2) / కృంగిన నా హృదయమును లేవనెత్తితివి / అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా||
నీలాంటి ప్రేమ ఈ లోకాన / ఎవరైనా చూపారా? – (2) / నా పాపభారం ఆ సిలువపైన / ఎవరైనా మోశారా? – (2) / యేసయ్యా.. యేసయ్యా.. / యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి|| / చెలికాడే నిన్ను సిలువకు పంపగా / పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / దొంగలే నిన్ను దూషించగను / నా అనువారే అపహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / తండ్రి వీరు చేయునదేమో / ఎరుగరు కనుక క్షమియించుమని (2) / ప్రార్ధన చేసితివయ్యా / మము క్షమియించితివయ్యా (2) ||యేసయ్యా|| / నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా / ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2) / నీదు ప్రేమే నా గానం / నీ ప్రేమే నా భాగ్యం (2) ||యేసయ్యా||
ఆకాశము నీ సింహాసనం / భూలోకము నీ పాద పీఠము / మహోన్నతుడా – మహా ఘనుడా / నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము / స్తుతులకు పాత్రుడా యేసయ్యా / స్తోత్రార్హుడవు నీవేనయ్యా / జీవాధిపతివి నీవయ్యా / జీవము గల మా యేసయ్యా / పాపుల రక్షకా యేసయ్యా / రక్షించుటకు పుట్టావయ్యా / నీ సిలువే నా మరణమును / తప్పించి రక్షించెనయ్యా / అద్భుతకారుడా మహనీయా / ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా / దయగల మా ప్రభు యేసయ్యా / కృపగల మా ప్రభు నీవయ్యా / రానైయున్న యేసయ్యా / బూరధ్వనితో నీవేనయ్యా / మధ్యాకాశంలో విందయ్యా / ఎంతో ధన్యత మాకయ్యా
ఆకాశం నీ సింహాసనం / భూమి నీ పాదపీఠం (2) / సర్వోన్నతుడా సర్వాధికారి / అందుకో ఇల నా హృదయ వందనం / అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2) / మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం|| / పరలోక తెరపైట తొలగించగా / స్తుతి గీత పాటలు వినిపించగా (2) / పరిశుద్ద ఆత్ముడు నను తాకగా / రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా ||ఆకాశం|| / నీ స్వరము ఉరుమై వినిపించగా / అదిరింది నా గుండె ఒకసారిగా (2) / నీ కిరణాలు మెరుపై నను తాకగా / వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా ||ఆకాశం|| / భువిలోని సృష్ఠంత నీ మాటగా / దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2) / పరలోక రాజ్యానికి నువ్వు దారిగా / వెలిసావు ధరపైన నా యేసుగా ||ఆకాశం||
మధురం మధురం నా ప్రియ యేసు / నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2) / వాడిన పువ్వులు వికసింప చేసి / పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ (2) / చెదరిన మనసును చెలిమితో చేర్చి / సేదదీర్చిన యేసుని ప్రేమ (2) ||మధురం|| / స స ని ప మ మ / రి రి గ రి రి గ ని ని స (2) ||మధురం|| / ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స / స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స (2) / ని స ని ప ప ని స / మధురం… మధురం… / అతిమధురం నీ నామం – (2) / కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే / కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె / ఎటుల నే… మరతును… / ప్రభుని ప్రేమ ఇలలో (2) ||మధురం||
ఒక చేతిలో కర్ర / ఒక చేతిలో గొర్రె (2) / చేసేటి చేతులలోన / మేకులు నాటిరి నరులు (2) / కారింది నీదు రక్తం కాలువలై పారే / చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| / నడిచేటి కాళ్ళలలోన / మేకులు నాటిరి నరులు (2) ||కారింది|| / కిరీటంబు తెచ్చిరి / తలపైన పెట్టిరి (2) ||కారింది|| / సిలువను తెచ్చిరి / భుజం పైన పెట్టిరి (2) ||కారింది|| / బల్లెంబు తెచ్చిరి / ప్రక్కలోన పొడచిరి (2) ||కారింది||
దేవా నీ సన్నిధిలో నిలచి / దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా|| / అపరాధులగు నీదు ప్రజల / నెపములన్నియు బాపి (2) / కృపాళుండగు యేసు ప్రభువా / కృపను జూపి రక్షించుమయా (2) ||దేవా|| / చేసి యున్నాము నేరములెన్నో / చేసిన మేలులను మరచి (2) / మోసములలో బడియున్నాము / యేసుప్రభు జయమునిమ్ము (2) ||దేవా|| / లోకపు మర్యాదలకు లొంగి / లోకుల మాటలను వినియు (2) / నీ కట్టడలను మరచితిమి / కట్టుము మమ్ము నీ వాక్యముచే (2) ||దేవా|| / నిస్వార్థులగు నీ దాసులను / విశ్వాస ప్రమాణికులన్ (2) / శాశ్వతమైన ప్రేమతో నింపు / విశ్వాసులు స్థిరపడి నడువ (2) ||దేవా|| / సహవాసములో మమ్ము నిలిపి / సహనము మాకు నేర్పించి (2) / మహిమా పూర్ణుడ యేసు నిన్ను / ఈ మహిలో చాటించుటకు (2) ||దేవా||
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) / తడిసెదను.. నీ జీవనదిలో (2) / తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద|| / వీడిపోయెను నా పాప సంకెళ్లు / నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2) / దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2) / నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద|| / నీ ఆత్మ నాకు తోడుండగా / కానెన్నడు కాను ఒంటరిని (2) / ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2) / నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద|| / నే దాటిపోదును దేశ సరిహద్దులు / ప్రకాశించెద చీకటి లోకంలో (2) / జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2) / నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద||
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు / నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు / ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున|| / తోడు లేని జీవ యాత్ర / చేరలేని కడలి తీరం (2) / బ్రతుకే బరువై పోవగా / క్రీస్తు దరికి సాగి రమ్ము / చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున|| / అలల వలె వ్యధలు రాగా / కనుల నీరే తోడు కాగా (2) / అండగా క్రీస్తేసుడుండ / చింత ఏల భీతి ఏల / బంధాలెల్ల వీడెగా / ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో / నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును / ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)
సర్వోన్నతుడా / నీవే నాకు ఆశ్రయదుర్గము (2) / ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2) / ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) / నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట / నిలువలేరని యెహోషువాతో (2) / వాగ్దానము చేసినావు / వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥ / నిందలపాలై నిత్య నిబంధన / నీతో చేసిన దానియేలుకు (2) / సింహాసనమిచ్చినావు / సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥ / నీతి కిరీటం దర్శనముగా / దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2) / విశ్వాసము కాచినావు / జయజీవితము ఇచ్చినావు (2) ॥సర్వోన్నతుడా॥