ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని / నన్ను కొనిపోవ రానైయున్న / ప్రాణప్రియుడా యేసయ్యా (2) / నిన్ను చూడాలని… / నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2) / ఉల్లసించుచున్నది… ||గగనము|| / నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది / నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) / పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను (2) / నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము|| / నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది / మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2) / కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను (2) / యుగయుగాలు నీతో ఏలెదను (2) ||గగనము|| / నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది / తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2) / అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2) / సీయోనులో నీతో నేనుందును (2) ||గగనము||
న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన / ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2) / ఒక గుంపేమో పరలోకపు గుంపు / రక్షింపబడిన వారికే అది సొంతం / మరు గుంపేమో ఘోర నరకపు గుంపు / నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి|| / నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది / కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2) / కలువరిలో తన ప్రాణం పెట్టిన / యేసయ్యే నీ ప్రాణ రక్షణ / సిలువలో క్రయ ధనమే చెల్లించిన / ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో|| / ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు / ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2) / మేఘముపై రానైయున్నాడుగా / త్వరలోనే నిను కొనిపోడానికి / వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా / నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే / నా తండ్రి నీవే – నీవే (2) / యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా / యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి|| / నా అడుగులు తప్పటడుగులై / నడిచిన నా ప్రతి మార్గము / సరిచేయు నా తండ్రివి (2) / పగలు ఎండ దెబ్బయైనను / రాత్రి వెన్నెల దెబ్బయైనను / తగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా|| / గాడాంధకార లోయలో / నే నడచిన ప్రతివేళలో / తోడున్న నా తండ్రివి (2) / వేయిమంది కుడి ఎడమకు / కూలినా కూలును కాని / చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2) ||యేసయ్యా||
మా మధ్యలో సంచరించువాడా / ఆరాధన నీకేనయ్యా / మా మధ్యలో అద్భుతాలు చేయువాడా / ఆరాధన నీకేనయ్యా / మార్గము తెరిచే అద్భుతకరుడా / మాట తప్పని తేజోమయుడా / నీవే.. నీవే యేసయ్యా (2) / మాలో నీవు హృదయాలు మార్చుము / యేసయ్యా యేసయ్యా.. / మా మనసులను స్వస్థపరచుము / యేసయ్యా యేసయ్యా.. నీవే ||మార్గము|| / చీకటి లోయలో సంచరించినా / నిరీక్షణ కోల్పోయినా / గొప్ప కార్యము జరిగించెదవు / నాలో నెరవేర్చెదవు (2) ||మార్గము||
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని / ఊపిరితో మిగిలెదనా ఉదయానికి / తడవు చేయక యేసు నను చేరుకో / నా ప్రక్కనే ఉండి నను పట్టుకో / భయముండగలదా నీవున్నచో / నా చేయి నీ చేతిలో ఉండగా ||నిశిరాత్రి|| / ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం / కనిపించక దారులు మొదలాయెను కలవరము / వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా / తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని / నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు ||నిశిరాత్రి|| / నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి / నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి / ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు / రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి / ఉదయమును చూపించుము నా కంటికి / అల్పము ఈ జీవితమని నేనెరిగితిని / కనురెప్పపాటున ఆవిరికాగలదు / అనుదినమిక నీ కృపనే నే కోరుచు / పయనింతును నా గురివైపు నిను ఆనుకుని / భయముండగలదా నీవున్నచో / నీ కన్నులు నామీద నిలిచుండగా / నా చేయి నీ చేతిలో ఉండగా
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే / నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే / సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా / నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా / నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా / పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు / నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో / పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో / కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు ||లే నిలబడు|| / రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా / పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి / యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే / రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి / ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా / బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా / మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు / ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు / సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం ||లే నిలబడు|| / సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే / ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి / ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న / పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి / బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో / తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన / చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న / ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి / గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం ||లే నిలబడు||
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు / మానక స్తుతించెదము (2) / నీ కనుపాప వలె నన్ను కాచి / నేను చెదరక మోసావు స్తోత్రం (2) / ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే / ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) / స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం / స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| / ఎడారిలో ఉన్న నా జీవితమును / మేలుతో నింపితివే (2) / ఒక కీడైన దరి చేరక నన్ను / తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| / నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును / నీ కృపతో నింపితివే (2) / నీవు చూపిన ప్రేమను పాడగా / పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| / జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే / ఆశ్చర్యమాశ్చర్యమే (2) / నీ పాత్రను కానే కాను / కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
రాతి సమాధిలో పాతిన మన యేసు / లేచెను ఈనాడు జై జై జై (2) / దేవాలయము మూడు దినముల లోపల (2) / పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2) / ఆ బండ నెవరు దొర్లించకుండనే / తెరువంగ బడి యుండె జై జై జై (2) ||రాతి|| / వేకువ జామున చీకటి యుండగ (2) / ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2) / ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా / ముందే లేచియుండె జై జై జై (2) ||రాతి|| / ఆ మింట నున్న నా తండ్రి కడకు (2) / నేనిపుడేగెద నన్నంటకు (2) / తొలిసారి మరియకు కనిపించి పలికెను / ఉల్లాసమాయెను జై జై జై (2) ||రాతి||
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా / నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) / నాకెంతో ఆనందం… / ఏ అపాయము నను సమీపించక / ఏ రోగమైనను నా దరికి చేరక (2) / నీవు నడువు మార్గములో నా పాదము జారక / నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో|| / నా వేదనలో నిన్ను వేడుకొంటిని / నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2) / నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా / నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) ||నాకెంతో|| / నూతన యెరూషలేం నా గమ్యమేనని / నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2) / నీవుండు స్థలములో నేనుండ గోరెదను / నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) ||నాకెంతో||
జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్ / జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతున్ (2) / హల్లెలూయా హోసన్నా (8) / మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ / సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ (2) / హల్లెలూయా హోసన్నా (8) / విన్నపము వినువాడా నీకే ఆరాధన అర్పింతున్ / విడుదల నిచ్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2) / హల్లెలూయా హోసన్నా (8) / కన్నీరు తుడుచువాడా నేకే ఆరాధన అర్పింతున్ / కష్టములు తీర్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2) / హల్లెలూయా హోసన్నా (8)
నా చెలిమి కోరి – నీ కలిమి వీడి / నా చెంత చేరావు శ్రీమంతుడా / నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది / బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| / ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని / గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను / ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి / కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి|| / నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు / కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం / హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా / తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని ||నా చెలిమి|| / ఏ రీతి నిన్ను – కీర్తించగలను / నా నీతి నీవే ఓ యేసుదేవా / నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి / ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా
భయము లేదు దిగులే లేదు / నా జీవితమంతా ప్రభు చేతిలో / నిరాశ నన్నెన్నడు ముట్టలేదు / నిరీక్షణతో అనుదినం సాగెదను (2) / యావే నీవే నా దైవం – తరతరముల వరకు / యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు / నీవు కునుకవు నీవు నిదురపోవు / ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2) / మరణ భయం అంతా పోయెను / శత్రు భీతి అంతా తొలగించెను (2) / మరణమును ఓడించి / శత్రువును జయించిన / సర్వాధికారివి నా దేవా (2) ||యావే|| / ఓటమిని అంతా తీసివేసి / రోగాన్ని అంతా మాన్పివేసి (2) / జయశీలుడవు / పరమ వైద్యుడవు / సర్వశక్తుడవు నా రక్షకా (2) ||యావే||