తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

రక్షకుడు వచ్చినాడు|Rakshakudu Vachchinaadu

రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా / నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2) / పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా / ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా / మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా / జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2) / ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా / మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2) / బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా / విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం|| / వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా / నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2) / వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి / నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా ||మన కోసం||

ఇంతవరకు కాపాడినావు|Intha Varaku Kaapaadinaavu

ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా / ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2) / అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2) / (మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2) / వందనాలే… ఆ ఆ.. ఆ… / వందనాలే… రాజా… / వందనాలయ్యా వందనాలయ్యా / వందనాలయ్యా వందనాలయ్యా / వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా / అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) / మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా (2) / (నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) ||వందనాలే|| / నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా / మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా (2) / మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా (2) / అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా (2) ||వందనాలే|| / వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా / చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా (2) / కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా (2) / (నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా (2) ||వందనాలే||

నేను ఓడిపోనయా|Nenu Odiponayaa

నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) / నేను ఓడిపోనయా – నా పక్షానుండగా / నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2) / నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) / నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా|| / అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే / వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే / నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే / నన్ను దూషించిన చోటే దీవించినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||

నూతన హృదయము|Noothana Hrudayamu

నూతన హృదయము నూతన స్వభావము / నూతన ప్రారంభం నాకు దయచేయుము / చెదరిన బ్రతుకును పగిలిన గుండెను / నలిగిన మనస్సును నూతన పరచుము / యేసు నీవే నన్ను సృజియించిన వాడవు / నా బలహీనతలన్ని యెరిగియున్నావు / రాతి గుండెను నాలో తీసివేయుము / అతి మెత్తని హృదయము దయచేయుము ||నూతన హృదయము|| / జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని / పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని / నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను / హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని / నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక / వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను / శుద్ధజలమును నాపై వెదజల్లుము / హిమము కంటెను తెల్లగా కడిగివేయుము ||నూతన హృదయము|| / నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని / నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని / నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని / నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను / నీ శరణు కోరువారిని త్రోసివేయవు / కృపగల మహాదేవ నన్ను మన్నించుము / సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును / సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును ||నూతన హృదయము||

నీ కృపయే|Nee Krupaye

నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చుంచునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా (2) యేసయ్యా… / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||

రవికోటి తేజుడు|Ravikoti Thejudu

నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు / నా దేవుడే నాకు మార్గ దర్శకుడు / నా దేవుడే నాకు నిత్య పోషకుడు / నా దేవుడే నాకు జీవన దాయకుడు / గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే / మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే ||నా దేవుడే|| / శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను / నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు / మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను / నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు / క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము / క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము / క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని|| / వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను / నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము / ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను / నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము / నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా / నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే / విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని||

యేసు కోసమే జీవిద్దాం|Yesu Kosame Jeeviddaam

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం / యేసుని పోలి నడిచే సాక్షులం / యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం / లోకములో యేసుని ప్రతినిధులం / శోధనలెదురైనా అవరోధములెన్నున్నా / విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు / ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా / లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు కోసమే|| / నిందారహితులుగా జీవించుట మన పిలుపు / నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు / యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము / లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే / ప్రేమయు సహనము యేసుని హృదయము / కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము ||యేసు కోసమే|| / యేసు స్వభామును ధరించిన వారలము / మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము / సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను / రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము / రాజులు జనములు యేసుని చూచెదరు / విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు ||యేసు కోసమే||

సాటి ఎవ్వరూ|Saati Evvaru

సాటి ఎవ్వరూ లేరు ఇలలో / సమానులెవ్వరూ ఇహ పరములో (2) / యోగ్యత లేని నాపై దేవా / మితిలేని కృప చూపి / నిరాశే మిగిలిన ఈ జీవితంలో / నిరీక్షణనిచ్చావు ||సాటి ఎవ్వరూ|| / దేవా నా కరములనెత్తి / దేవా నిన్నే కీర్తించి / దేవా నిన్నారాధింతును (4) / పాప బానిస బ్రతుకు / ఆకర్షణ నిండిన లోకం / సర్వమనే భ్రమలోనే బ్రతికానే / నీ వాక్యముతో సంధించి / నా ఆత్మ నేత్రములు తెరచి / ప్రేమతో నన్నాకర్షించావే (2) / దేవా నా కరములనెత్తి / దేవా నిన్నే కీర్తించి / దేవా నిన్నారాధింతును (2) / మలినమైన మనసు / గమ్యంలేని పయనం / హృదయమే చీకటిమయమయ్యిందే / నీ రక్తముతో నను కడిగి / నాకు విడుదలను దయచేసి / వెలుగుతో నాకు మార్గం చూపావే (2) / దేవా నా కరములనెత్తి / దేవా నిన్నే కీర్తించి / దేవా నిన్నారాధింతును (2) ||సాటి ఎవ్వరూ||