ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
యేసుని నామములో – మన బాధలు పోవును / దుష్టాత్మలు పారిపోవును / శోధనలో జయమొచ్చును / మృతులకు నిండు జీవమొచ్చును / హృదయములో నెమ్మదొచ్చును / యేసు రక్తముకే – యేసు నామముకే / యుగయుగములకూ మహిమే / అభిషిక్తులగు తన దాసులకు / ప్రతి సమయమునా జయమే ||యేసుని|| / ఘోరమైన వ్యాధులెన్నైనా / మార్పులేని వ్యసనపరులైనా / ఆర్ధికముగా లోటులెన్నున్నా / ఆశలు నిరాశలే ఐనా / ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు / పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || / రాజువైనా యాజకుడవైనా / నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా / ఆశ్రయముగా గృహములెన్నున్నా / నిలువ నీడే నీకు లేకున్నా / శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా / నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే ||
రాజుల రాజుల రాజు / సీయోను రారాజు (2) / సీయోను రారాజు నా యేసు / పైనున్న యెరూషలేము నా గృహము (2) / తల్లి గర్భము నుండి వేరు చేసి / తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2) / సీయోను కొరకే నన్ను ఏర్పరచిన / సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| / నిషేధించబడిన రాయి / సీయోనులో మూల రాయి (2) / ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన / సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా / (ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2) ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు / నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2) / ఈ అన్నల నమ్మే కంటే… / ఈ అన్నల నమ్మే కంటే / అన్న యేసుని నమ్ముకో / రాజ్యం నీదే మేలుకో / పరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు / పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా (2) / ఈ మనుషులలోనే… / ఈ మనుషులలోనే – మమతలు లేవు / మంచితనానికి రోజులు కావు / సమయం మనకు లేదమ్మా / ఇక త్వరపడి యేసుని చేరమ్మా ||జీవితమంటే|| / నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు / నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే (2) / యేసుని రాకకు ముందే… / యేసుని రాకకు ముందే / మారు మనస్సును పొందుమా / ప్రభుని చెంతకు చేరుమా / రక్షణ భాగ్యం పొందుమా ||జీవితమంటే||
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా / విడువని దేవుడా నా యేసయ్యా / శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా / ఓదార్చే దేవుడా యేసయ్యా / ప్రేమించే వారే లేకున్నా / నన్ను కరుణించే వారే లేకున్నా / ఆదరించే యేసు నన్ను / తల్లి కన్న మిన్నయై ||కలనైనా|| / జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు / లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా / నీకేమి చెల్లింతు యేసయ్యా / నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా|| / పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు / లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు / నీకేమి చెల్లింతు యేసయ్యా / నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
దేవా నీ సాక్షిగా నేనుండుట / ఈ మంటికి భాగ్యము (2) / జాలిగా మనుజాళికై / కలువరిలోని ఆ యాగము / చాటెద ప్రతి స్థలమందు / నా తుది శ్వాస ఆగే వరకు ||దేవా|| / నాలాంటి నర మాత్రుని చేరుట / నీ వంటి పరిశుద్ధునికేలనో (2) / ఏ మేధావికి విధితమే కాదిది / కేవలం నీ కృపే దీనికాధారము / ఈ సంకల్పమే నా సౌభాగ్యమే / నా బ్రతుకంత కొనియాడుట ||దేవా|| / నా ఊహకందని మేలుతో / నా గుండె నిండింది ప్రేమతో (2) / నా కన్నీటిని మార్చి పన్నీరుగా / నాట్యము చేయు అనుభవమిచ్చావుగా / ఈ శుభవార్తను చాటు సందేశము / నేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా||
నాలో ఉన్న ఆనందం / నాకున్న సంతోషం / నా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో|| / నా ఆశ్రయము నా దుర్గము / నా కోట నీవే యేసు / నా బలము… నా యేసుడే (2) / గాఢాంధకారములో నే సంచరించిననూ / ఏ అపాయమునకు నే భయపడను (2) / నీ దుడ్డు కర్రయు నీ దండమును / నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| / నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును / నన్నాదరించును నా వెంట వచ్చుఁను (2) / చిరకాలము నేను నీ మందిరావరణములో / నివాసము చేసెదను నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము||
వికసించు పుష్పమా (2) / యేసు పాదాల చెంతనే వికసించుమా / తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు|| / నీ ప్రాణ ప్రియుడు సుందరుడు / నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2) / మనోహరుడు అతి కాంక్షణీయుడు (2) / స్తోత్రార్హుడు (2) ||వికసించు|| / నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4) / మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2) / పరిశుద్ధుడు (2) ||వికసించు|| / నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4) / విడువని వాడు నిను ఎడబాయని వాడు (2) / నీతి సూర్యుడు (2) ||వికసించు||
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) / నా ప్రాణమున్నంత వరకు / విడచిపోలేనయ్యా ||మేలులు|| / కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా / శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) / నీది గొర్రెపిల్ల మనస్సయ్యా / యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) / అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా / జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) / నీది పావురము మనస్సయ్యా / యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) / చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా / దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) / నీది ప్రేమించే మనస్సయ్యా / యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)
గూడు లేని గువ్వలా దారి తప్పితి / గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2) / నీ గుండెలో దాచుమా / నీ గూటికే చేర్చుమా (2) / నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా / నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు|| / గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం / నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2) / నువ్వంటే ఇష్టం యేసయ్యా / నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా|| / చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం / నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2) / నేనంటే నీకెంతో ఇష్టమయ్యా / నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
రారే మన యేసు స్వామిని / జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని / గూరిమి భక్తుల జేరువ విందట / భూరిద యామృత సారము లొలికెడు / చారు కటాక్ష వి – శాలేక్షనుడట / నారకులగు నర – నారీ జనులకు / దారక మొసగను దానే పిలుచునట / దారుణ పాప మ-హారణ్యమునకు / గారు చిచ్చు గతి గన్పడువాడట / ఘోర దరిద్రత గూల్చెడి వాడట / సారంబగు తన సభకు మకుటమాట ||రారే|| / పతిత పావనమౌ వేల్పట / అనాది దేవ సుతుడై – ఇల జేరినాడట / సతతము కడు దురి – తతమోయుతమగు / ప్రతి దేశమునకు – హిత భాస్కరుడట / అతులిత మోక్షో – న్నత గుణగణుడట / కుతలంబున స-ద్గతి రహితంబగు / పతితుల గావను – మృతుడైనాడట / అతి పుణ్య తను – క్షత శోణితమును / వ్రతముగ సిలువను నతఁడొసంగెనట / మృతిని జయించుచు బ్రతికి లేచెనట / మతి నమ్మిన మన గతి యితడేనట ||రారే|| / తుదలేని మహిమ వాడట / తను గొల్చు సాధు – హృదయుల సొమ్ము మూటట / చెదరిన గొర్రెల – వెదక వచ్చెనట / చిదురుపలగు జన హృదయములన్నిట / బదిలముగా నె-మ్మది నిడువాడట / నదితట మఠ జన వదనముల స / మ్మద శుభవార్తను – బలికినవాడట / సదయత సంధుల – కక్షుల నిడెనట / వెదకి బధిరులకు – వీనులొసగె నట / సదమల మోక్ష ప్రభుడగు విభుడట / యిదిగో మనకిత డేలినవాడట ||రారే||
కరుణించవా నా యేసువా / ఓదార్చవా నజరేతువా (2) / నీ కృపలో అనుదినము రక్షించవా / నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా|| / నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ / బలమైన శోధన నను తరిమిన వేళ (2) / మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2) / లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా|| / ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ / నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2) / సాతాను పోరాటమే అధికమైన వేళ (2) / విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా||
నన్నెంతగా ప్రేమించితివో / నిన్నంతగా దూషించితినో / నన్నెంతగా నీవెరిగితివో / నిన్నంతగా నే మరచితినో / గలనా – నే చెప్పగలనా / దాయనా – నే దాయగలనా (2) / అయ్యా… నా యేసయ్యా / నాదం – తాళం – రాగం / ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) / ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో / ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) / ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో / ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| / ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో / ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) / ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో / ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||