ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు / మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2) / హృదయాంత రంగములో బాధలు తెలుసు / మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2) / జగత్తు పునాది వేయబడక ముందే / మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో|| / మనసులోని మాట నీవు పలుకకముందే / ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు / తల్లి గర్భమునందు నిను రూపించకముందే / ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2) / సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా / ఆకాశ వీధులలో నీవు విహరించినా (2) / ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా / ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో|| / నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా / యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు / నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా / యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు (2) / నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి / నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు (2) / ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా / ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను / ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2) / ఏ యోగ్యత లేని ఓటి కుండను / నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2) / ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| / నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే / అయినా నీవు క్షమియించినావే / ఊహించని మేలులతో దీవించినావే / నా సంకటములను కదా తీర్చినవే (2) / ఏ యోగ్యత లేని దీనుడను / ఏమివ్వగలను నీ ప్రేమకు / (నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో|| / మా కొరకు బలి పశువై మరణించినావు / మా పాప శిక్ష తొలగించినావు / పలు విధముల శోధనలో తోడైనావు / ఏ కీడు రాకుండ మేము కాచినావు (2) / రుచి చూపినావు నీ ప్రేమను / ఆ ప్రేమలో నేను జీవింతును / నీవే నాకు ఆధారము – (2) ||ఎందుకో||
జీవమా… యేసయ్యా… / ఆత్మతో నింపుమా – అభిషేకించుమా / స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3) / స్తోత్రము యేసయ్యా / ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) ||జీవమా|| / మేడ గది మీద అపోస్తులపై / కుమ్మరించినాత్మ వలె / పరిశుద్ధాగ్ని జ్వాల వలె / నీ ప్రేమను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| / అనుదినం నీ దివ్య సేవలో / అభిషేకం దయచేయుమా / పలు దిశల సువార్త ప్రకటింప / నీ ఆత్మను కుమ్మరించుము (2) ||స్తోత్రము||
నా ప్రాణమైన యేసు / నా ప్రాణములోనే కలిసి / నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ / నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2) / నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన|| / లోకమంతా మరచితినీ / విలువైనది కనుగొంటినీ (2) / నీ నామం స్తుతించుటలో / యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2) / రాజా… ||నా ప్రాణమైన|| / నీ వాక్యం నాకు భోజనమే / శరీరమంతా ఔషధమే (2) / రాత్రియు పగలునయ్యా / నీ యొక్క వచనం ధ్యానింతును (2) / రాజా… ||నా ప్రాణమైన||
యేసు రక్షకా శతకోటి స్తోత్రం / జీవన దాత కోటి కోటి స్తోత్రం / యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2) / నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2) / యేసు ఆరాధించెదను – ఆరాధించెదను / శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు / నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2) / నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) / చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా|| / పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు / ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) / తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2) / నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు రక్షకా|| / యేసు ఆరాధించెదను – ఆరాధించెదను / నా సమస్తము అర్పించి – ఆరాధించెదను / నా సర్వము అర్పించి – ఆరాధించెదను / శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను||
అమ్మా అని నిన్ను పిలువనా / యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2) / అమ్మా… నాన్నా… (2) / (నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా / ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / ఎవరూ లేని ఒంటరి నేనయ్యా / ఎవరూ లేని అనాథను నేనయ్యా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / నేనున్నాను భయమేలను అని / నాకభయమిచ్చిన నా యేసు రాజా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||
నీవే నన్ను కోరుకున్నావు / నీవే నన్ను చేరుకున్నావు / నీవే నన్ను విడిపించావు / నీవే నన్ను విడువనన్నావు / ఎంత ప్రేమ యేసయ్యా / వింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే|| / నీ అరచేతిలో నను చెక్కుకున్నావు / నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు / నీ రాజ్యములో నను దాచి ఉంచావు / నీ నామములో నను రక్షించావు ||ఎంత|| / నీ వాక్యముతో నను శుద్ధి చేసావు / నీ రక్తముతో నను కడిగివేసావు / నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు / నీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత||
బలమైనవాడా బలపర్చువాడా / మరలా నన్ను దర్శించుమా / స్తోత్రం స్తోత్రం (2) / స్తోత్రం నీకేనయ్యా / హల్లెలూయా హల్లెలూయా (2) / హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన|| / ఎండిపోతిని దిగజారిపోతిని / నీ కొరకే నేను బ్రతకాలని / మరలా నన్ను దర్శించుము (2) / మొదటి ప్రేమ మొదటి పవిత్రత / మరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన|| / అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని / నీలోన నేను ఉండాలని / మరలా నన్ను వెలిగించుము (2) / మొదటి తీవ్రత మొదటి శక్తి / సర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన||
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు / పరలోక రాజ్యము వారిది (2) / దుఃఖ పడు వారలు ధన్యులు / వారు ఓదార్చబడుదురు (2) / సాత్వికులైన వారు ధన్యులు / వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2) ||ఆత్మ|| / నీతిని ఆశించువారు ధన్యులు / వారు తృప్తిపరచబడుదురు (2) / కనికరము గలవారు ధన్యులు / వారు దేవుని కనికరము పొందుదురు (2) ||ఆత్మ|| / హృదయ శుద్ధి గలవారు ధన్యులు / వారు దేవుని చూచెదరు (2) / సమాధాన పరచువారు ధన్యులు / వారు దేవుని కుమారులనబడుదురు (2) ||ఆత్మ||
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా / నీ ప్రాభావంబున్ మరతునా / నా ప్రభువున్ ముఖా ముఖిన్ / నే బ్రణుతింతు నీ ప్రభన్ / నా ప్రాణమా సు ప్రార్ధనా / నీ ప్రేరణంబుచే గదా / నీ ప్రేమధార గ్రోలుదు / నో ప్రార్ధనా సుప్రార్ధనా / పిశాచి నన్ను యుక్తితో / వశంబు చేయ జూచుచో / నీ శాంతమైన దీప్తియే / నా శంక లెల్ల మానుపున్ / నీ శక్తి నేను మరతునా / నా శైలమున ప్రార్ధనా / నా శోక మెల్ల దీర్చెడు / విశేషమైన ప్రార్ధనా / నీ దివ్యమైన రెక్కలే / నా దుఃఖ భార మెల్లను / నా దేవుడేసు చెంతకు / మోదంబు గొంచు బోవును / సదా శుభంబు లొందను / విధంబు జూప నీవెగా / నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా / సుధా సుధార ప్రార్ధనా / అరణ్యమైన భూమిలో / నా రమ్యమౌ పిస్గా నగం / బు రంగుగాను నెక్కి నా / చిర గృహంబు జూతును / శరీరమున్ విదల్చి నే / బరంబు బోవు వేళలో / కరంబు నిన్ను మెచ్చెదన్ / పరేశు ధ్యాన ప్రార్ధనా
పరదేశులమో ప్రియులారా మన / పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల|| / చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి / చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల|| / సంత గొల్లు క్షమ సడలిన చందం / బంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల|| / స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని / బరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల|| / మేడలు మిద్దెలు మేలగు సరకులు / పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల|| / ధర ధాన్యంబులు దరగక మానవు / పని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల|| / ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన / మన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల|| / వచ్చితి మిచటికి వట్టి హస్తముల / దెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల|| / ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు / అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల|| / యేసు నందు విశ్వాసం బుంచిన / వాసిగ నిను జేర్చున్ (బరమున) (2) ||పరదేశుల|| / యేసే మార్గము యేసే సత్యము / యేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల||
సన్నుతింతుమో ప్రభో / సదమలమగు భక్తితో (2) / కన్న తండ్రి కావుమా (2) / కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| / నీతి సూర్య తేజమా / జ్యోతి రత్న రాజమా (2) / పాతక జన రక్షకా (2) / పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| / మానవ సంరక్షకా / దీన నిచయ పోషకా (2) / దేవా మానవ నందనా (2) / దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| / ప్రేమ తత్వ బోధకా / క్షేమ దాత వీవెగా (2) / కామిత ఫలదాయక (2) / స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| / పాప చింతలన్నిటిన్ / పారదోలుమో ప్రభో (2) / నీ పవిత్ర నామమున్ (2) / నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో||