ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను / పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు ||పుట్టె|| / ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా / పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2) ||పుట్టె|| / యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున / నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2) ||పుట్టె|| / తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి / సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2) ||పుట్టె||
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త / బలవంతుడైన దేవుడా / నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి / మనకై జన్మించెను (2) / వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) / హోసన్నా హల్లలూయా / క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| / ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై / స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ / అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై / ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ / ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు / దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2) / దొంగలను మార్చి దయచూపినావు (2) / ధవళ వస్త్రములు ధరింప చేసి / ధన్యుని చేసావు ||వి విష్|| / నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు / నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2) / నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2) / నీతో నిరతం జీవించుటకు / నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||
విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త / మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను / వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను / తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2) / ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం / యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా|| / దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని / గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా / లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా|| / ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని / జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా / రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము / చల్లని దేవుని నీడలో / గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం / సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| / లోకమే నటనాలయం / జీవితమే రంగుల వలయం (2) / పరలోకమే మనకు శాశ్వతం / పరలోక దేవుని నిత్య జీవం / ప్రేమామయుడే ఆ పరమాత్ముడే / పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| / మారు మనస్సు మనిషికి మార్గం / పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) / నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా / నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా / పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే / కరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు||
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన / క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) / క్రీస్తులోనే విశ్వాసం / క్రీస్తులోనే ఉల్లాసం / క్రీస్తులోనే అభిషేకం / క్రీస్తులోనే సమస్తం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్|| / యేసులోనే రక్షణ / యేసులోనే స్వస్థత / యేసులోనే విడుదల / నమ్మితే నిత్య జీవం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||
వినుమా యేసుని జననము / కనుమా కన్య గర్భమందున (2) / పరమ దేవుని లేఖనము (2) / నెరవేరే గైకొనుమా (2) / ఆనందం విరసిల్లె జనమంతా / సంతోషం కలిగెను మనకంతా / సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత / చిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా|| / గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట / చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి / మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన / ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా ||వినుమా|| / పాపులనంతా రక్షింపగా / పరమును విడిచె యేసు (2) / దీనులకంతా శుభవార్తేగా (2) / నడువంగ ప్రభువైపునకు (2) ||ఆనందం|| / అదిగో సర్వలోక రక్షకుడు / దివినుండి దిగివచ్చినాఁడురా (2) / చూడుము యేసుని దివ్యమోమును (2) / రుచియించు ప్రభుని ప్రేమను (2) ||ఆనందం||
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు / నా రాజు రాజులకు రాజు (2) / యేసు పుట్టెను ఈ లోకంలో / ఆనందమే గొప్ప ఆనందమే (2) / ఆనందమే గొప్ప ఆనందమే / సంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే|| / యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా / లోక రక్షకుడు జన్మించెను / లోక పాపాలను కడిగి వేయగా / భువిలో బాలుడిగా అరుదించెను (2) / పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను / మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే|| / వీనుల విందుగా – దీనుల అండగా / కరుణా కారకుడు కడలివచ్చెను / పాపుల శాపాలను తానే మోయగా / పరమ పాలకుడు పుడమి చేరెను (2) / కుల మత బేధాలను హరియించ వచ్చెను / పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2) ||ఆనందమే||
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి / వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి|| / గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2) / హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి|| / పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2) / పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి|| / పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2) / కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి / నా శ్రమ దినములలో – కృపలతో కాచితివి (2) / స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా / మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా (2) / ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి / తల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి (2) / నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపిన / లేని అర్హతలను నాకు వరముగా చేసిన (2) దేవా ||ఉన్నత|| / కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండా / నీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా (2) / శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపిన / హీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన (2) దేవా ||ఉన్నత|| / గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినా / పదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా (2) / నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగా / ఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా (2) దేవా ||ఉన్నత||
నీ చల్లని నీడలో / నీ చక్కని సేవలో (2) / నా బ్రతుకు సాగనిమ్మయ్యా / యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని|| / కష్టాలు ఎన్ని వచ్చినా / వేదనలు ఎదురైనా (2) / నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు / నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని|| / ఏర్పరచబడిన వంశములో / రాజులైన యాజకులుగా చేసితివి (2) / పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా / నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని||
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా / యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా / ఓ సంఘమా వినుమా / రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో / వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో / ఆనంద తైల సుగంధాభిషేకము (2) / పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా|| / క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని / స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ / మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2) / సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా|| / చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు / శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని / గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2) / సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా|| / చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును / నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో / నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2) / ఆసక్తితో రక్షణ పొందుమా (2) ||ఓ సంఘమా||
వర్ణించలేను వివరించలేను / అతి శ్రేష్టమైన నీ నామమున్ / యేసు నీ నామమున్ – (2) / కొనియాడెదన్ కీర్తించెదన్ (2) / అత్యంతమైన నీ ప్రేమను / యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| / మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే / పాపినేని చూడక ప్రేమించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / సర్వాధికారి సర్వోన్నతుడా (2) / హీనుడైన నన్ను కరుణించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2) / నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||