ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
సిలువలో నాకై చేసిన యాగము / మరువలేనయ్యా మరచిపోనయ్యా / నీ ప్రేమను… నీ త్యాగము… / మరువలేనయ్యా నీ ప్రేమను / మరచిపోనయ్యా నీ త్యాగము (2) / సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| / నా కోసమే నీవు జన్మించితివి / నా కోసమే నీవు సిలువనెక్కితివి (2) / నా కోసమే నీవు మరణించితివి (2) / నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| / ఎవరూ చూపని ప్రేమను చూపి / ఎవరూ చేయని త్యాగము చేసి (2) / విడువను ఎడబాయను అన్నావు (2) / నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||
నిను పాడాలని కీర్తించాలని / ఆశ.. యేసు నా ఆశ / ఆశ.. యేసు నా ఆశ (2) / ఆరాధింతును ఆనందింతును (2) / నీలో.. యేసు నీలో (2) ||నిను|| / నిరాశపడిన వేళలో / నా ఆశ నీవైతివే / నా ఆశ నీవైతివే (2) / నా సంతోషమా నా ఆనందమా (2) / నా ఆధారమా నీవే (2) ||నిను|| / నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే / నను చేసినది నీవే / నను చేసినది నీవే (2) / స్తుతియింతును ఘనపరతును (2) / నా దైవం నీవే అని (2) ||నిను||
చాచిన చేతులు నీవే / అరచేతిలో చెక్కినావే / కమ్మని అమ్మవు నీవే / కాచిన తండ్రివి నీవే / నీలా ఎవరు ప్రేమిస్తారు / నాకై ప్రాణం అర్పిస్తారు / కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు / కళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన|| / కొండలు గుట్టలు చీకటి దారులు / కనిపించదే కళ్ళు చిట్లించినా / కారాలు మిరియాలు నూరేటి ప్రజలు / అన్నారు పడతావొక్క అడుగేసినా / రక్షించే వారే లేరని / నీ పనైపోయిందని (2) / అందరు ఒక్కటై అరచేసినా / అపవాదులెన్నో నాపై మోపేసినా (2) / నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి / శత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన|| / పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు / అవమానపడతాడని నవ్వేసినా / చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ / అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా / నీవెంత నీ బ్రతుకెంతని / నిలువలేవు నీవని (2) / అందరు ఒక్కటై తేల్చేసినా / కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2) / నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి / నా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన||
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2) / యేసుతోనే కడవరకు పరముదాక / యేసయ్యతోనే కడవరకు పరముదాక / వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2) / విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా / నా హృదయమా ||సాగి|| / ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం / ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2) / ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2) / విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా / ఎంతో వింతగా ||సాగి|| / పాపమందు నిలచిన పడిపోదువు / పరలోక యాత్రలో సాగకుందువు (2) / ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2) / నిత్య జీవ మార్గమందు సాగిపోదువు / కొనసాగిపోదువు ||సాగి|| / విశ్వాస పోరాటంలో విజయ జీవితం / విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును (2) / విలువైన ఆత్మతో బలము నొందుము (2) / వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు / పడిపోక నిలుతువు ||సాగి||
సకలము చేయు సర్వాధికారి / సర్వ జగతికి ఆధారుడా / నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) / ఆరాధ్యుడా నా యేసయ్యా / ఆరాధన నీకే (2) ||సకలము|| / జగద్రక్షకుడా విశ్వవిదాత / సర్వ కృపలకు దాతవు నీవే (2) / బలియైతివా మా రక్షణకై / సర్వ ఘనతలు నీకే ప్రభువా (2) / సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| / బల శౌర్యము గల యుద్ధ శూరుడవు / సైన్యములకు అధిపతి నీవే (2) / నా జయములన్ని నీవే ప్రభువా / నా ఘనతలన్ని నీకే ప్రభువా (2) / నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము|| / కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న / మహిమ గలిగిన రారాజువు నీవే (2) / చీకటి ఎరుగని రాజ్యము నీది / అంతమే లేదు నీ మహిమకు (2) / అంతమే లేదు నీ మహిమకు ||సకలము||
ప్రభువా ఈ ఆనందం / నాలో కలిగిన వైనం / వర్ణింపలేనిది ఈ అద్భుతం (2) / నీలో నేను ఉండగా / నాలో నీవు నిలువగా / నీకై నేను పాడగా ఆనందం (2) / ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ / ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ / ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా|| / ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం / అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2) / వర్ణింపలేనిది సరిపోల్చలేనిది / నా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్|| / స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం / ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2) / పరలోకపు మార్గములో నను నడువ చేయునది / ప్రభు యేసుని వాక్యాహారం (2) ||ప్రభువా||
రాజులకు రాజైన ఈ మన విభుని / పూజ చేయుటకు రండి / ఈ జయశాలి కన్నా / మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు|| / కరుణ గల సోదరుండై ఈయన / ధరణికేతెంచెనయ్యా (2) / స్థిరముగా నమ్ముకొనిన / మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు|| / నక్కలకు బొరియలుండే నాకాశ / పక్షులకు గూళ్లుండెను (2) / ఒక్కింత స్థలమైనను / మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| / త్వరపడి రండి రండి ఈ పరమ / గురుని యొద్దకు మీరలు (2) / దరికి జేరిన వారిని / ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు||
ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో / నను బలపరచిన దేవుని సన్నిధిలో / స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో / ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| / నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో / నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2) / ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో / స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| / పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో / పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2) / ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో / స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||
నీవే నీవే / నా తోడున్న దేవుడవు (2) / నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే|| / కష్టాల కడలిలోనైనా / కన్నీటి బాధలోనైనా (2) / యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| / ఏ ఘోర పాపము అయినా / మరణకర వ్యాధి అయినా (2) / యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||
దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా? / ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2) / ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న / వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2) / మరచినవా నీ అపజయములు / గుర్తు లేదా! ఆ శోధనలు / నీవు చూపిన ఆ వినయములు / ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు / తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము / అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥ / అందుకొంటివి బాప్తిస్మమును / పొందు కొంటివి ఆ రక్షణను / వదలబోకు ఆత్మీయతను / చేరనివ్వకు నిర్లక్ష్యమును / తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు / నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2) ॥ఎంత॥
నీతోనే నే నడవాలని / నీలోనే నే నిలవాలని / నీవలె నే మారాలని / నీ సాక్షిగా నే బ్రతకాలని (2) / (నా) మదిలోని కోరిక నా యేసయ్యా / నే నీతోనే ఉండాలని (2) / నీతో నీతో నీతో నీతో / నీతో నీతో నీతో (2) ||నీతోనే|| / దవళవర్ణుడా రత్న వర్ణుడా / పదివేల మందిలో అతి సుందరుడా (2) / సువర్ణ వీధులలో నీతోనే నడవాలని / నా మనసు కోరెను నజరేయుడా (2) ||నీతో|| / కీర్తనీయుడా పూజ్యనీయుడా / స్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా (2) / ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలని / నా హృది కోరెను నా యేసయ్యా (2) ||నీతో||
మెల్లని స్వరమే వినిపించావే / చల్లని చూపుతో దీవించినావే / వాక్యపు ఒడిలో లాలించినావే / ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే / నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా / నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని|| / తీయని గీతాన్ని వినిపించాలని / చల్లని వేళలో నిను నేను చేరితిని / అమృత రాగాన్ని వినిపించాలని / చల్లని వేళలో నిను నేను చేరితిని (2) / నాకంటే ముందుగా నీవొచ్చినావే / నీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని|| / కృంగిన కాలములో వేదనల వేళలో / సోమసిన సమయములో నిను నేను చేరితిని (2) / నా గాథ అంతయు గమనించినావే / నా గుండె మంటలను ఆర్పేసినావే (2) ||మెల్లని||