ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ / నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) / అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే / అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే / తన చిత్తమునకు తల వంచితే / ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) / స్తుతియించుట మానను / కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా / స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2) / మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) / మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| / ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా / ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2) / యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2) / ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా|| / అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా / నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) / నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) / నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| / ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా / అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2) / నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2) / పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| / చదువులే రాకున్నా – ఓటమి పాలైనా / ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2) / నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు (2) / నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| / సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు / సమస్తము సమకూడి – మేలుకై జరుగును (2) / యేసుని సారూప్యము – నేను పొందాలని (2) / అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2) ||అంతా|| / నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు / ఇక మీదట నేను – తెలిసికొందును (2) / ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2) / అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2) ||అంతా||
నీ సాక్ష్యము ఏది / నీ బలియర్పణ ఏది (2) / ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల / ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ / మేల్కో లెమ్ము (2) / రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము|| / అపోస్తుల కాలమందు / ఉపద్రవముల ఒత్తిడిలో (2) / అన్నింటి సహించుచు (2) / ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము|| / కొరడాతో కొట్టబడిరి / చెరసాలయందుంచబడిరి (2) / చెరసాల సంకెళ్లును (2) / వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము|| / కోత విస్తారమెంతో / కోత కోయువారు కొందరే (2) / యేసు నిన్ పిలచుచుండే (2) / త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది / చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు / ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ|| / గాలి వానొచ్చి నడి యేటిలోన / నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో.. / కంట చూడంగ గాలాగిపోయే / అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2) / నీవే రేవంట ఏ నావకైనా / కడలే నీవంట ఏ వాగుకైనా (2) / ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా|| / దిక్కు లేనట్టి దీనాత్ములంటే / నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ.. / జంతు బలులిచ్చే మూడాత్ములంటే / నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా (2) / నిన్ను పొగడంగ నేనెంత వాడ / నీటి మడుగులలో చేపంటి వాడ (2) / నా దారి గోదారిలో ||ప్రభువా||
స్తుతియింతుము స్తోత్రింతుము / పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| / నీ నామము రుజువాయే / నీ ప్రజలలో దేవా (2) / వర్ణింప మా తరమా / మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| / మా ప్రభువా మా కొరకై / సిలువలో సమసితివి (2) / మాదు రక్షణ కొరకై / రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| / పరిశుద్ధ జనముగా / నిర్దోష ప్రజలనుగా (2) / పరలోక తనయులుగా / పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము||
యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను / అందరము – విజయ గీతములు పాడెదము / విజయ గీతములు పాడెదము / మన శ్రమలలో విజయమునిచ్చెన్ / తన రాజ్యమునందు మనలను చేర్చును (2) / ఘన విజయమును మనకై పొందెన్ (2) / మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు|| / మనమాయన సంఘముగా / తన రక్తము ద్వారా సమకూర్చెను (2) / సంఘమునకు శిరస్సాయనే (2) / సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2) ||యేసు|| / మహోన్నతుడు మహా ఘనుడు / మహిమ రాజు మనకు విజయమునిచ్చే (2) / మరణము గెల్చి తిరిగి లేచే (2) / ఆర్భాటముతో హర్షించెదము (2) ||యేసు||
నమ్మదగిన దేవుడా / నెమ్మదినిచ్చే యేసయ్యా (4) / నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2) / నీ తోడుంటే చాలయ్యా / భయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే|| / శ్రమ అయినా బాధ అయినా / కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే|| / కష్టమైనా కన్నీరైనా / కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే|| / సాగరాలే ఎదురు నిలిచినా / శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే|| / భరువైనా భారమైనా / బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే|| / ఎవరున్నా లేకున్నా / కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||
రారాజు వస్తున్నాడో / జనులారా.. రాజ్యం తెస్తున్నాడో / త్వరపడి వేగమే రండి / ప్రియులారా.. ప్రభుని చేరగ రండి / వస్తానన్న యేసు రాజు రాక మానునా / తెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు|| / పాపానికి జీతం రెండవ మరణం / అది అగ్ని గుండము అందులో వేదన (2) / మహిమకు యేసే మార్గము జీవము (2) / అందుకే నమ్ముకో యేసయ్యను / పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| / పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను / ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2) / యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం / యేసయ్య గాయాలు రక్షణకు మార్గం / అందుకే నమ్ముకో యేసయ్యను / పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| / కనురెప్ప పాటున కడబూర మ్రోగగా / పరమున ఉందురు నమ్మిన వారందరు (2) / నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2) / అందుకే నమ్ముకో యేసయ్యను / చేరుకో పరలోక రాజ్యంబును (2) ||వస్తానన్న||
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా / చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2) / నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) / నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా|| / కలిమి చేజారి నను ముంచినా / స్థితిని తలక్రిందులే చేసినా (2) / రెండింతలుగా దయచేసెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / పరుల ఎగతాళి శృతి మించినా / కలవరము పొంది నే కృంగినా (2) / నా మొర విని కృప చూపెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / శ్రమలు చెలరేగి బెదిరించినా / ఎముకలకు చేటునే తెచ్చినా (2) / ఆపదలలో విడిపించెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
ఉపవాసంతో ప్రార్ధనలో / నీ వైపే చూస్తున్నా దేవా / మోకాళ్లపై కన్నీటితో / నే చేయు ప్రార్ధన వినుము దేవా / అడిగిననూ ఇయ్యవా దేవా / వెదకిననూ దొరకవా దేవా / తట్టిననూ తీయవా దేవా / యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో|| / నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా / నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2) / దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2) / రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2) ||అడిగిననూ|| / జీవించు కాలమంతా నీ సేవ చేయాలి / నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2) / నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2) / రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2) ||అడిగిననూ||
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం / ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2) / కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా / యేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ|| / ఈ లోక ఘనత నన్ను విడిచినన్ / లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2) / నా సహోదరులు నన్ను విడిచినన్ / యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ|| / నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు / శాశ్వత రాజు నా సహాయకుడు (2) / భారం నాకెందుకు వ్యాకులమెందుకు / ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) ||క్రైస్తవ|| / బూర శబ్దంబు మ్రోగెడి వేళ / శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ (2) / ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు / ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ (2) ||క్రైస్తవ||
ముఖ దర్శనం చాలయ్యా / నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) / సమీపించని తేజస్సులో / నివసించు నా దైవమా (2) / నీ ముఖ దర్శనం చాలయ్యా (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) / అన్న పానములు మరచి నీతో గడుపుట / పరలోక అనుభవమే / నాకది ఉన్నత భాగ్యమే (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) / పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది / మహిమలో చేరుటయే / అది నా హృదయ వాంఛయే (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) / కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి / గానము చేసెదను / ప్రభువా నిత్యము స్తుతియింతును (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
విడువవు నన్నిక ఎన్నడైననూ / పడిపోకుండా కాయు రక్షకా (2) / పడిపోవు వారెల్లరిని / లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| / ప్రభువా నీకవిధేయుడనై / పలు మారులు పడు సమయములలో (2) / ప్రేమతో జాలి దీన స్వరముతో / ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| / ఆదాము హవ్వలు ఏదెనులో / ఆశతో ఆజ్ఞ మీరినను (2) / సిలువకు చాయగా బలినర్పించి / ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| / మా శక్తియు మా భక్తియు కాదు / ఇలలో జీవించుట ప్రభువా (2) / కొల్లగా నీ ఆత్మను నొసగితివి / హల్లెలూయా పాడెదను (2) ||విడువవు||