తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

అల్ఫా ఒమేగయైన|Alphaa Omegayaina

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా / అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2) / రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా / ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా / నాతో స్నేహమై నా సౌఖ్యమై / నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా|| / కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే / ఉన్నతముగా నిను ఆరాధించుటకు / అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి / నూతన వసంతములు చేర్చెను (2) / జీవించెద నీ కొరకే / హర్షించెద నీలోనే (2) ||అల్ఫా|| / తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే / ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు / ఆశ నిరాశల వలయాలు తప్పించి / అగ్ని జ్వాలగా నను చేసెను (2) / నా స్తుతి కీర్తన నీవే / స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా|| / నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే / శుభ సూచనగా నను నిలుపుటకు / అంతులేని అగాధాలు దాటించి / అందని శిఖరాలు ఎక్కించెను (2) / నా చెలిమి నీతోనే / నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||

నువ్వెవరో యేసు|Nuvvevaro Yesu

ఈ లోకం కన్నా మిన్నగా / నా బంధం కన్నా అండగా / అన్నీ నీవై నిలిచి / నను వెదకి వచ్చితివే / నువ్వెవరో యేసు నువ్వెవరో… / నా తల్లి కన్నా నీవే / నా తండ్రి కన్నా నీవే / నా అండ దండ తోడు నీడ నీవై / నన్ను కాచితివే / ఈ లోకం కన్నా మిన్నగా / నా బంధం కన్నా అండగా / అన్నీ నీవై నిలిచి / నను వెదకి వచ్చితివే / నా తల్లి నను మరచే / నేనెన్నో సార్లు ఏడ్చే / నీవు నన్ను మరువక / నా ప్రక్కన ఉంటివే / నా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనే / నా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే ||ఈ లోకం|| / నా తండ్రి నను విడచే / నేనొంటరినై నడచే / నీవు నన్ను విడువక / నా చెంత నడచితివే / ఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయే / తుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే / (యేసు) నువ్వేలే నా సర్వం – (2) ||నా తల్లి||

నా తనువు నా మనసు|Naa Thanuvu Naa Manasu

నా తనువు నా మనసు / నా నైపుణ్యం నీ కొరకే / నా తలంపులు నా మాటలు / నా క్రియలు నీ కొరకే / నా ప్రయాసే కాదు / నీ కరుణతో నిలిచింది ఈ జీవితం / నీ నామం కీర్తించాలని / నీ బలం చూపించాలని / అందుకేగా నన్నిలలో నియమించితివి / నీ స్వరూపముగా / నీ శ్వాసతో నను సృజియించితివి / నీ మహిమగా నేనుండుటకు / నీతోనే జీవించుటకు (2) / అందుకేగా నన్నిలలో సృజియించితివి / అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు|| / గర్భ వాసమున లేనప్పుడే / నన్ను ప్రతిష్టించితివి / నీ వెలుగునే ప్రకాశించుటకు / నీ ప్రేమనే పంచుటకు (2) / అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి / అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||

తలవంచకు నేస్తమా|Thalavanchaku Nesthamaa

తలవంచకు నేస్తమా (2) / తలవంచకు ఎప్పుడూ / తలవంచకు ఎన్నడూ / స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో / కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో / కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో / ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో / నీవు కావాలి ఓ.. మాదిరి / నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ / నీవు మండాలి ఓ.. జ్వాలగా / నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| / చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే / క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది / రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే / క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు|| / పెకిలించు కొండలను – విశ్వాస బాటలో / గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో / యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని / మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2) ||నీవు||