ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా / పదే పదే నేను పాడుకోనా / ప్రతి చోట నీ మాట నా పాటగా / మరి మరి నే చాటుకోనా / మనసంతా పులకించని సాక్షిగా / నా జీవిత గమనానికి గమ్యము నీవే / చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే|| / మమతల మహా రాజా / (నా) యేసు రాజా (4) / అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల|| / అడిగిన వేళ అక్కున చేరి / అనురాగం పంచిన అమ్మవు నీవే / నలిగిన వేళ నా దరి చేరి / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) / అనురాగం పంచిన అమ్మవు నీవే / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||
ఆకర్షించే ప్రియుడా… / అందమైన దైవమా… / ఆకర్షించే ప్రియుడా / అందమైన దైవమా / పరిపూర్ణమైనవాడా (4) / నీదు తలపై ఉన్న అభిషేకం / అధికంగా సువాసన వీచుచున్నది (2) / నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2) / నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే|| / నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది / నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2) / నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2) / అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే|| / నిన్ను పాడి హృదయం ఆనందించును / నాట్యంతో పాటలు పాడెదను (2) / దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2) / అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే||
సేవకులారా సువార్తికులారా / యేసయ్య కోరుకున్న శ్రామికులారా / సేవకులారా సువార్తికులారా / మీ మాదిరికై వందనము / ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా / మా కొరకై నీ ప్రాణం అర్పించితివి / నీలో నిలిచి యుండుటే మా భాగ్యము / నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| / మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే / మనము గొప్పవారము కాదు / మనము మంచివారము కాదు / మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు / దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు / ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు / మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు / నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| / ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి / మీ శరీరము దేవుని ఆలయమిది / మీరు విలువ పెట్టి కొనబడిన వారు / సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు / సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు / మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు / మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| / హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, / దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ / షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ / సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు / ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు / మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు / మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
ప్రభువా ప్రభువా / కడలిని మా గాథ వినవా / ప్రభువా ప్రభువా / ఇకనైనా మా జాలి గనవా / ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు / ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా|| / ఎదలో చెలరేగే సుడిగాలుల్లో / ఎగసే ఆశ నిరాశ కెరటాలు / నావకు చుక్కానివై / నాలో ధైర్యం కలిగించవా / సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో / మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా|| / దేవా నీ దయలో ధన్యుడనవ తగనా / నాలో విశ్వాసం ఇంకా చాలాదనా / మందలో నీ అండలో / నేను ఉన్నా గొర్రెపిల్లనై / దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో / నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||
ఓ నావికా.. ఓ నావికా.. / ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా.. / ఓ నావికా…. ఓ నావికా…. / శ్రమలలో శ్రామికా… (2) / ఊసు వింటివా వింత గంటివా / యేసు సామి ఊసు నీవు వింటివా (2) / హైలెస్సో హైలెస్సా / హైలెస్సో హైలెస్సా (2) / వలేసావు రాతిరంతా / ధార పోసావు కష్టమంతా (2) / చిక్కలేదు చేప ఒక్కటైనా / దక్కలేదు ఫలము కొంతైనా (2) / అడుగడుగో యేసు వచ్చెనయ్యా / వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2) / నింపాడు నీ నావ అద్భుత రీతితో / తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో (2) / వెంబడించు యేసును పూర్ణ శక్తితో / యేసే ఈ జగతికి సర్వాధికారి / యేసే నీ నావకి చూపించు దారి (2) / చేస్తాడు నిన్ను అసలైన జాలరి / మనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా|| / విరిగి నలిగిన మనస్సుతో / చేసావు నీ సమరం (2) / శయనించక ఎడతెగక / ఈదావు ఈ భవ సాగరం (2) / అడుగడుగో యేసు వచ్చెనయ్యా / వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2) / కరుణించాడు నిన్ను చల్లని చూపుతో / నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో (2) / వెంబడించు యేసును పూర్ణ శక్తితో / యేసే ఈ జగతికి సర్వాధికారి / యేసే నీ నావకి చూపించు దారి (2) / చేస్తాడు నిన్ను అసలైన జాలరి / మనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా||
నిన్నంత దేవరు యారు ఇల్ల / నిన్న హాగె ప్రీతిసువవరు ఒబ్బరు ఇల్ల (2) / యేసయ్యా యేసయ్యా నీనిల్లదే నానిల్లయ్యా (2) ||నిన్నంత|| / పాపదా మరణదల్లి ఇద్దంతా నన్నా / ప్రీతి మాడి ప్రాణ కొట్టు బదుకిసిడే దేవా (2) / నిన్న కృపే శాశ్వతా ఎందెందు దేవా (2) / నిన్న ప్రీతియింద నాను జీవిసువే దేవా (2) ||యేసయ్యా|| / నన్నయ జీవితవెల్లవన్ను తిలిదిరువే నీను / నన్నయ కురితు హితవాగి చింతిసువే నీను (2) / నిన్నయ కరది హిడిదు నన్న నడిసిరువే దేవా (2) / నన్న సహాయ నన్న బండె నీనే యేసయ్యా (2) ||యేసయ్యా|| / కష్టగలల్లి దుఃఖగలల్లి జొతేయాగిరువవను / రోగదల్లి సంకటదల్లి బలవా కొడువవవను (2) / కొరితెగలన్ను నీగిసువవను నీనే యేసయ్యా (2) / సోలుగలల్లి జయవను కొడువ దేవా నీనయ్యా (2) ||యేసయ్యా||
నా జీవిత యాత్రలో / ప్రభువా నీ పాదమే శరణం / ఈ లోకమునందు నీవు తప్ప / వేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత|| / పలు విధ శోధన కష్టములు / ఆవరించియుండగా (2) / కలత చెందుచున్న హృదయమును / కదలక కాపాడుము (2) ||నా జీవిత|| / నీ సన్నిధిలో సంపూర్ణమైన / సంతోషము కలదు (2) / నీదు కుడి హస్తములో నిత్యమున / నాకు సుఖ క్షేమముగా (2) ||నా జీవిత|| / ఈ లోక నటన ఆశలన్నియు / తరిగిపోవుచుండగా (2) / మారని వాగ్ధానములన్నియు / నే నమ్మి సాగెదను (2) ||నా జీవిత|| / ముందున్న సంతోషము తలంచి / నిందలను సహించి (2) / నీ సిలువను నే మోయుటకై / నీ కృప నాకీయుము (2) ||నా జీవిత|| / సీయోను యొక్క ఆలోచనతో / సదా నడిపించుము (2) / మహిమలో నీతోనే నిల్చుటకు / నా తండ్రి దయచూపుము (2) ||నా జీవిత||
ఊహకు అందని కార్యముల్ / ఊహించని రీతిలో నాకై చేసిన దేవా / ఊహకు అందని వేళలో / ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా / ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ / నీదు నామ గీతము నాదు జీవితాంతము / కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు|| / కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు / ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) / అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను / అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము / అసాధ్యమైనదేది నీకు లేనే లేదు / ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి|| / బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా / ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా / కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు / నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||
వందనాలు యేసు నా వందనాలో / వందనాలు శతకోటి వందనాలు (2) / అబ్రాహాము దేవా నా వందనాలు / ఇస్సాకు దేవా నా వందనాలు (2) / అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా / యాకోబు దేవా నా వందనాలు (2) / నన్ను పిలిచావు వందనాలో / నన్ను కలిసావు వందనాలు (2) / నన్ను మరువలేదు వందనాలో / నన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / మహిమనే విడిచావు వందనాలు / మహిలోనికి వచ్చావు వందనాలు (2) / మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు / మార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / మరణమే గెలిచావు వందనాలు / మహిమనే చూపావు వందనాలు (2) / మరణమే గెలిచావు – మహిమనే చూపావు / మాటనే నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / సిలువనే మోసావు వందనాలు / నా బరువునే దించావు వందనాలు (2) / సిలువనే మోసి – నా బరువునే దించి / నా ఋణమునే తీర్చావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / నా తోడు నీవే నా వందనాలు / నా నీడ నీవే నా వందనాలు (2) / నా తోడు నీవే – నా నీడ నీవే / నా వాడవు నీవే నా వందనాలు (2) ||నన్ను పిలిచావు||
తరాలు మారినా యుగాలు మారినా / మారని దేవుడు మారని దేవుడు / మన యేసుడు ||తరాలు|| / మారుచున్న లోకములో / దారి తెలియని లోకములో (2) / మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| / సూర్యచంద్రులు గతించినా / భూమ్యాకాశముల్ నశించినా (2) / మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| / నీతి న్యాయ కరుణతో / నిశ్చలమైన ప్రేమతో (2) / మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| / నిన్న నేడు నిరంతరం / ఒకటైయున్న రూపము (2) / మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు / నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) / నే పాడెదన్ – కొనియాడెదన్ (3) / నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| / లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ / గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) / యేసుని ప్రేమ వెల యెంతో / ఇహమందైనా పరమందైనా (2) / వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ / కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా|| / మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ / మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2) / రక్తము కార్చి రక్షణ నిచ్చి / ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) / గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ / బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా||
మరువద్దు మరువద్దు / తండ్రి ప్రేమ మరువద్దు / జీవితాన్ని వ్యర్ధించకుమా / విడువద్దు విడువద్దు / ప్రేమ బంధం విడువద్దు / నీదు స్థానం మరువద్దుమా / తిరిగి రావా తిరిగి రావా / తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు|| / నీకై నీతో జీవాన్ని పంచిన / నీలా నీతో స్నేహించిన (2) / కాచెను కనురెప్పలా / కాపాడెన్ దైవముగా (2) / ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు|| / లోకం స్నేహం సుఖ భోగ పాపాలు / అంతా మలినం మిగిలిందిగా (2) / ఆలస్యం చేయకుమా / వేగమే పరుగెత్తుమా (2) / నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||