తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

సుందరమైన దేహాలెన్నో|Sundaramaina Dehaalenno

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? / అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా? / కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? / ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా? / ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం / తరచి చూడుము పరికించి చూడము (2) ||సుందరమైన|| / నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో / ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు / అధికార దాహంతో మదమెక్కిన వీరులు / సమాధి లోతుల్లోనే మూగబోయారు (2) / తపోబలము పొందిన ఋషులందరూ / మతాధికారులు మఠాధిపతులు / ఈ కాలగర్భంలోనే కలసిపోయారు / మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2) / యేసులేని జీవితం వాడబారిన చరితం (2) / క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2) ||సుందరమైన|| / ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే / ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా? / పాప సంకెళ్ళలో బందీలైనవారికి / ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2) / శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు / మరో జీవితం లేదనుట భావ్యమా? / రక్తము కార్చిన యేసుని విస్మరించి / ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2) / యేసులేని జీవితం అంధకార భందురం (2) / క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2) ||సుందరమైన||

స్తుతి గానమే పాడనా|Sthuthi Gaaname Paadanaa

స్తుతి గానమే పాడనా / జయగీతమే పాడనా (2) / నా ఆధారమైయున్న / యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై / జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| / నమ్మదగినవి నీ న్యాయ విధులు / మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2) / నీ ధర్మాసనము – నా హృదయములో / స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| / శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు / లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2) / నీ శ్రేష్టమైన – పరిచర్యలకై / కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి|| / నూతనమైనది నీ జీవ మార్గము / విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2) / నీ సింహాసనము – నను చేర్చుటకై / నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||

పావురమా నీ ప్రేమ|Paavuramaa Nee Prema

పావురమా నీ ప్రేమ ఎంత మధురము / పావురమా నీ మనసు ఎంత నిర్మలము / జుంటి తేనె ధార కన్నా / మంచి గోధుమ పంట కన్నా (2) / ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2) / నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము / నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము / కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను / ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2) / ఎటు చూసిననూ ఎం చేసిననూ / మదిలో నిన్నే తలంచుచున్నాను (2) / ఒకసారి కనిపించి / నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా|| / దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు / పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2) / నా వాడు నా ప్రియుడు / మదిలో నిన్నే తలంచుచున్నాడు (2) / ఒకసారి కనిపించి / నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||

ఇదే నా హృదయ వాంఛన|Idhe Naa Hrudhaya Vaanchana

ఇదే నా హృదయ వాంఛన / నీవే నా హృదయ స్పందన (2) / నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2) / నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా|| / నీ యందు నిలిచి ఫలియించాలని / నీ అడుగు జాడలోనే నడవాలని (2) / ఈ లోక ఆశలన్ని విడవాలని (2) / నీ సువార్తను ఇలలో చాటాలని / ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2) / యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా / నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా|| / ప్రతి వారు నీవైపు తిరగాలని / ప్రతి వారి మోకాలు వంగాలని (2) / ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని (2) / ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని / ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2) / యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా / నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా|| / ప్రతి చోట నీ పాట పాడాలని / ప్రతి చోట నీ సువార్త చేరాలని (2) / ప్రతి వారికి రక్షణ కావాలని (2) / ప్రతి వారు నీ సన్నిధి చేరాలని / ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2) / యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా / నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా||