తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

మానవుడవై సకల|Maanavudavai Sakala Narula

మానవుడవై సకల నరుల / మానక నా దోషముల / బాపుటకు బలియైతివే యేసు – (2) / బహు ప్రేమ తోడ ||మానవుడవై|| / నీదు బలిని నిత్యముగను / నిజముగా ధ్యానించి ప్రేమను / నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2) / నియమంబు నిచ్చి ||మానవుడవై|| / నీ శరీరము రొట్టె వలెనె / నిజముగా విరువంగబడెనే / నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2) / నా యన్న యేసు ||మానవుడవై|| / మంచి యూట మించి దండి / పంచ గాయములలో నుండి / నిత్య జీవపు టూటలు జేసితి – (2) / నీ ప్రేమ నుండి ||మానవుడవై|| / నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు / నీదు ప్రేమ బలిలో మనుటకు / నిత్య మాచరించుడంటివి నీ – (2) / నిజ భక్తి తోడ ||మానవుడవై|| / ఎంతో ప్రేమతో బలిగానయితివి / యెంతో ప్రేమాచారమైతివి / చింతలును నా పాపములు బాప – (2) / శ్రీ యేసు దేవా ||మానవుడవై|| / నిత్య బలియగు నిన్నే నమ్మి / నిన్ను ననుభవించి నెమ్మి / నిన్ను నిముడించుకొని నాలో నీ – (2) / నిజ రూప మొంద ||మానవుడవై|| / నేను నీ బలిలోన గలిసి / నేను నీతో గలిసి మెలిసి / నేను నీవలె నుండి జేసితివే – (2) / నా దివ్య యేసు ||మానవుడవై|| / నీదు శ్రమలను బలిని నిపుడు / నాదు కనులు చూడ నెపుడు / నాదు పాప భారములు దిగునే – (2) / నా దివ్య యేసు ||మానవుడవై|| / నీవు బలియై తిరిగి లేచి / నిత్య తేజోరూపు దాల్చి / నిత్యమును నా బంతి నున్నావే – (2) / నిజ దేవా యేసు ||మానవుడవై|| / నీవే నీ చేతులలో నిత్తువు / ఈ నీ బలి విందునకు వత్తువు / నిన్ను నిట జూచితిని నా యేసు – (2) / ఎన్నడును మరువను ||మానవుడవై||

నీ స్నేహము|Nee Snehamu Entho Sathyamu

నీ స్నేహము ఎంతో సత్యము / ఆద్యంతము నా హృదిలో పదిలము (2) / నా సఖుడా ప్రియ యేసయ్య / నా హితుడా స్నేహితుడా (2) / నీవెంత గొప్ప వాడివయ్యా / నను ఆదరించినావయ్యా (2) / సింహాల బోనులో నా ప్రాణానికి / ప్రాణమైన నా విభుడవు / చెరసాలలోన సంకెళ్ళు విరచి / విడుదల నిచ్చిన రక్షక (2) / కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపే / నన్నెరిగిన నా తండ్రివి ||నా సఖుడా|| / గొల్యాతయినా ఏ యుద్ధమైనా / విజయము నిచ్చిన వీరుడవు / పదివేలమంది నా వైపు కూలినా / నాతో నిలచిన ధీరుడవు (2) / నా దోశములను నీదు రక్తముతో / తుడిచివేసిన పరిశుద్ధుడవు ||నా సఖుడా|| / ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవు / అందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు (2) / నిస్సారమైన నా జీవితములో / సారము పోసిన సజీవుడవు (2) ||నా సఖుడా||

కృపా సత్య సంపూర్ణుడా|Krupaa Sathya Sampoornudaa

స స స ని స గ… స స స ని స గ / స స స ని స గ మ ప / మ మ మ గ ప మ… మ మ మ గ ప మ / మ మ మ గ ప మ గ స / కృపా సత్య సంపూర్ణుడా (2) / కృపామయుడా / కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా|| / స ని స ని మ ప / ని ప ని ప గ మ / ప మ ప మ గ ని స / నీ కృప నను విడువక / శాశ్వతముగా కాచెనుగా (2) / మార్పులేని నీ మహా కృపలో (2) / మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా|| / నీ కృప అభిషేక తైలమై / నా తలపై ప్రోక్షించినావు (2) / నిత్యముండు నీ కృపతో (2) / నిరతము నను గావుము ప్రభువా ||కృపా|| / స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప / మ ప మ ని ని… ప ని ప స స **(2) / **ప ని స గ స ని… మ ప ని స ని ప / గ మ ప ని ప మ… గ మ గ రి స (2) / నీ కృప రక్షణ దుర్గమై / నా ముందర నడచిన ప్రభువా (2) / అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2) / హతమొందించెద నీ కృపతో ||కృపా||

యేసయ్యా నిన్ను ప్రేమించువారు|Yesayyaa Ninnu Preminchuvaaru

యేసయ్యా నిన్ను ప్రేమించువారు / బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2) / శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| / నిన్ను ప్రేమించువారు / సకలమైన ఉపద్రవముల నుండి (2) / నిర్దోషులై కాపాడబడెదరు / అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| / నిన్ను ప్రేమించువారు / దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2) / సమకూడి జరుగును సమస్తము / సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| / నిన్ను ప్రేమించువారిని / ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2) / మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి / తప్పించి బలపరచినావు (2) ||యేసయ్య|| / నిన్ను ప్రేమించువారి / చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2) / వారి కాలమంతట దేశమంతయు / నెమ్మదిగా నుండును (2) ||యేసయ్య||

Telugu Songs — Page 52 | UEC Telugu Church