తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

ఏ గుంపులో నున్నావో|Ae Gumpulo Nunnaavo

ఏ గుంపులో నున్నావో / ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2) / జాగు చేయక వేగ మేలుకో (2) / మరణమనెడి మొదటి గుంపు / మారని గుంపు – నిర్జీవపు గుంపు (2) / దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) / మెచ్చుఁకొనుట కిచ్చకంబు / లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2) / చచ్చియుండిన సమాధుల గుంపు (2) / కరుణ లేక కఠినమైన / కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2) / కరకు కల్గిన కఠోరపు గుంపు (2) / యేసు వాక్యమనగ నేమో / ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2) / ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) / ధరణి నరుల తరిమి కొట్టు / దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2) / పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) / పరమ తండ్రి కడకు జేర / పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2) / కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) / సర్వ లోక మోసగాడు / ఆది సర్పము – అదే ఘట సర్పము (2) / సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) / వధువు మంద మేయు మర్మ / మనగ గమనిక – గమనించి తెలుసుకో (2) / గదిలో చేరుకో పదిలపర్చుకో (2)

యుగయుగాలు మారిపోనిది|Yugayugaalu Maariponidhi

యుగయుగాలు మారిపోనిది / తరతరాలు తరిగిపోనిది / ప్రియ యేసు రాజు నీ ప్రేమా / నిను ఎన్నడు వీడిపోనిది / నీకు ఎవ్వరు చూపలేనిది / ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది / హద్దే లేని ఆ దివ్య ప్రేమతో / కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో / నీ కోసమే బలి అయిన దైవము రా (2) / లోకంతో స్నేహమొద్దు రా / చివరికి చింతే మిగులు రా / పాపానికి లొంగిపోకు రా / అది మరణ త్రోవ రా (2) / నీ దేహం దేవాలయము రా / నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) / తను చేసిన మేలు ఎట్టిదో / యోచించి కళ్ళు తెరువరా / జీవమునకు పోవు మార్గము / క్రీస్తేసుని ఆలకించారా (2) / నీ ముందర పందెము చూడరా / విశ్వాసపు పరుగులో సాగరా (2)

నీ కృప చాలును|Nee Krupa Chaalunu

నీ కృప చాలును / నీ ప్రేమ చాలును / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నీవు లేని జీవితం అంధకార బంధురం (2) / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో / నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2) / నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2) / నా జీవితాంతము నీలోనే నిలిచెదన్ / నా జీవితాంతము నీతోనే నడిచెదన్ / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2) / నిను పోలి నేను ఈ లోకమందు / నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2) / నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్ / నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)

Telugu Songs — Page 43 | UEC Telugu Church