ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
బలపరచుము స్థిరపరచుము / నా ప్రార్థనకు బదులీయము (2) / లోకాశల వైపు చూడకూండా / లోకస్థులకు జడవకుండా (2) / నీ కృపలో నేను జీవించుటకు / నా మాటలలో నా పాటలలో / నీ సువార్తను ప్రకటించెదను (2) / నే నడచు దారి ఇరుకైననూ / నే నిలుచు చోటు లోతైననూ (2) / నే జడవక నిను కొలుతును / ధ్యానింతును కీర్తింతును / నీ వాక్యమును అను నిత్యము (2) / అపవాది నన్ను శోధించినా / శ్రమలన్ని నాపై సంధించినా (2) / నే జడవక నిను కొలుతును
ఏ భాషకందని భావం నీవు / వెలకట్టలేని ముత్యం నీవు / దేవుడిచ్చిన వరమే నీవు – తీర్చలేని ఓ ఋణం / ఎదలో దాగిన పలుకే నీవు – నా ప్రేమకు తొలిరూపం / అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరాలేదే / నవ మాసాలు నీలో నన్ను దాచావు / నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు / రేయి పగలంతా నాకై శ్రమపడినా / తీరని అనురాగం నీలో చూసానే / నీ సుఖ సంతోషం విడచిన నాకై / తరగని మమకారం నీలో దాచావే / యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే / భయ భక్తులే ఉగ్గి పాలగ పోసావు / దేవుని మాటలే గోరు ముద్దగ చేసావు / తప్పటడుగులే నాలో సరి చేసి / ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు / ప్రతి వేకువలో నాకై నీవు / చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే / నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము / చెల్లించుటే నా ధన్యత / బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము / చేరడమే నా ఆతృత / అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద / నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద / కనులకే కనపడలేని నా కంటి పాపవై / కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2) / నాకే తెలియక నాలో / నీవు నాదు ప్రాణ శ్వాసవై / నడిపించావా దేవా ఇన్నాళ్లుగా / అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి / నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2) / రాతి గుండెను దిద్ది / గుడిగా మార్చుకున్న దైవమా / ముల్లును రెమ్మగా మార్చితివి
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి / నిలుపుచున్నాను (2) / అక్షయ కిరీటం పొందాలని / అనుక్షణం నే స్తుతియింతును (2) / ఆరాధనా ఆరాధనా / యేసయ్యా నీకే నా ఆరాధనా (2) / చుక్కాని లేని నావనై / సంద్రాన నే చిక్కుబడగా (2) / నా దరి చేరి – ఈ ధరలోన / నీ దరి నడిపించావే (2) / అన్య జనులు ఏకమై / నిందలు నాపైన మోపినా (2) / నిందలు బాపి – నన్నాదుకొని / విడువని కృప చూపినావే (2) / నాశనకరమైన ఊభిలో / నేను పది కృంగగా (2) / హస్తము చాచి – నను ఆదుకొని / (నీ) ఆత్మతో బలపరచినావే (2)
నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా / నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2) / నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే / నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2) / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2) / నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా / దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2) / ఏమివ్వగలను నీ కృపకు నేను / వెలకట్టలేను నీ ప్రేమను (2) / జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా / జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2) / ఏమివ్వగలను నీ కృపకు నేను / వెలకట్టలేను నీ ఆత్మను (2)
మనసులొకటాయే భువిలో / ఇరువురొకటాయే హృదిలో (2) / మనసు పరవశమై మధుర లాహిరిలో (2) / మనసులోని భావాలు / ఉరకలు వేసే ఈ వేళా / ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట / దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2) / ఈ మధురమైన శుభవేళ (2) / ఒకరికొకరు తోడు నీడగా / సాగే ఈ తరుణం / అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై / జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2) / ఘన యేసుని దివ్య ఆశీస్సు (2) / జీవితాంతం నిండుగ మెండుగ / నీతో నిలిచే ఈ తరుణం
గుర్తుండిపోయే ఈ క్షణాలలో / ప్రతి గుండె నిండా ఆనందమే / ఘనమైన ఈ వివాహ వేడుక / చేసావు మాకు తీపి జ్ఞాపిక / దేవా నీకు వందనం (4) / చిన్ని మొగ్గలా లేత సిగ్గులా / చిరునవ్వుల ఈ నవ వధువు / నింగి చుక్కలా కాంతి రేఖలా / సుందరుడు ఈ నవ వరుడు (2) / దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2) / దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని / దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని / నీ బాటలో నీ మాటలో / సాగనీ అనురాగమై / నీ ధ్యాసలో నీ ఊసులో / ఎదగనీ అనుబంధమై (2) / దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2) / దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని / దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని
అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా / నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2) / నీ ప్రేమ కొదువ లేనిది / ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2) / ఓ తల్లి తన బిడ్డను మరచునా / వారైనా మరచినా నేను మరువను / అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2)
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము / యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము / నీ వాక్యమే దీపము… / నా త్రోవకు వెలుగై యున్నది / యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము / యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు / కష్టములలో నష్టములలో / వ్యాధులలో నా వేదనలో (2) / ఆదరించును ఆవరించును / తీర్చి దిద్ది సరిచేయును / స్వస్థపరచును లేవనెత్తును / జీవమిచ్చి నడిపించును / యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము / యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2) / నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా / నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) / ప్రేమధ్వజమును సిలువలో నిలిపి / అనంతప్రేమను చూపితివి / పాపమునుండి విడిపించి / రక్షణవస్త్రం నొసగితివి (2) / నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం / వర్ణించలేనిది వివరించలేనిది (2) / యోగ్యతలేని మాకై నీ / పౌరసత్వాన్ని ఇచ్చితివి / పరిశుద్దాత్మను మాకొసగి / బలవంతులుగా చేసితివి (2) / ఎలాగు మరువను ఎలాగు విడువను / నీ స్నేహము నీ బంధము (2)
కంటి పాపను కాయు రెప్పలా / నను కాచెడి యేసయ్యా / చంటి పాపను సాకు అమ్మలా / దాచెడి మా అయ్యా / నీవేగా నీడగా తోడుగా / నీతోనే నేనునూ జీవింతు / నీకన్నా మిన్నగా ఎవరయ్యా / నాకు నీవే చాలయ్యా / మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు / దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు / ఇది ఎవరూ చూపించని ప్రేమ / ఇది లాభం ఆశించని ప్రేమ / ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ / ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ / ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు / నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు / ఇది ఎవరూ చూపించని ప్రేమ / ఇది లాభం ఆశించని ప్రేమ / ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ / ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ
ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా / నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2) / ఏమని నిన్ను నేను కీర్తింతును / ఏమని నిన్ను నేను పూజింతును (2) / ఏమని నిన్ను నేను ఆరాధింతును (2) / ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / నా పితరులెందరో నిన్ను ఘనపరచి / దహనబలులు నీకు అర్పించగా (2) / ఇంపైన సువాసనగా అంగీకరించి / దీవెన వర్షము కురిపించితివే (2) / నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి / స్తుతుల సింహాసనము నీకు వేయగా (2) / ఆనంద తైలముతో నన్నభిషేకించి / స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2) / నా కొరకు సీయోనును సిద్ధపరచి / మహిమతో తిరిగి రానైయుంటివే (2) / ఆనంద ధ్వనులతో నన్నూరేగించి / శాశ్వత జీవము నాకిచ్చితివే (2)