ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
నీవు తోడుండగా నాకు దిగులుండునా / నా మంచి యేసయ్యా / మనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా|| / నీవంటి వారెవ్వరు / నీ తోటి సాటెవ్వరు (2) / నా జీవితాన – నీవే ప్రభువా (2) / నాకెవ్వరు లేరు ఇలలో (2) / హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) / హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా / నీవు తోడుండగా…. / మనుషులలో మహనీయుడా / వేల్పులలో ఘణ పూజ్యుడా (2) / సర్వాధికారి సర్వాంతర్యామి (2) / చేసెద నీ పాద సేవ (2) / హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) / హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా||
పాపానికి నాకు ఏ సంబంధం లేదు / పాపానికి నాపై ఏ అధికారము లేదు / పాపానికి నాకు ఏ సంబంధం లేదు / పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు / నా పాపములు అన్ని – నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా / మరి వాటినెన్నడును – జ్ఞాపకము చేసికొనెను / అని మాట ఇచ్చాడుగా / నేనున్నా నేనున్నా – నా యేసుని కృప క్రింద / నే లేను నే లేను – ధర్మశాస్త్రం క్రింద (2) ||పాపానికి|| / కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువోచ్చా (అట్లనరాదు) / కృప అంటే లైసెన్స్ కాదు / కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు / కృప అంటే దేవుని శక్తి / కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు / గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ / ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| / కృప ద్వారా ధర్మశాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం (నే పొందితినయ్యా) / క్రియల మూలముగా కాదు / కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది / కృప నన్ను మార్చేసినది / నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది / గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి / అండ్ టాట్ మి టు లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా||
నీవు లేనిదే నేను లేను ప్రభువా / నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా / బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2) / నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2) / మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2) / నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు|| / గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ / తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2) / నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2) / ఆ సిలువే నాకు శరణం / నా పాప పరిహారం (2) ||నీవు|| / అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ / జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ (2) / నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే (2) / ఆ సిలువే నాకు నిరతం / నా జీవిత చిరుదీపం (2) ||నీవు||
గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం / పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2) / ప్రేమామయుడు మహిమాన్వితుడు / ఉన్నవాడు అనువాడు (2) / మహిమ ఘనత నిత్యం యేసుకు / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు|| / ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు / నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2) / నీ బాధలన్ని తీర్చేవాడు యేసు / సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ|| / నీ రోగాలను స్వస్థపరచునేసు / నీ శాపాలను తీసివేయునేసు (2) / నీ శోకాలను మాన్పివేయునేసు / పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2) ||మహిమ||
గుండె బరువెక్కిపోతున్నది / ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2) / నా మనసేమో కలవరపడుచున్నది (2) / యేసయ్యా.. ఆదరించ రావా / యేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| / ప్రాకారము లేని పురముగా నేనుంటిని / ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2) / నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2) / యేసయ్యా.. ఆధారం నీవే కదా / యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| / అంధకారంలో నా దీపము ఆరిపోయెనే / అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2) / దినదినము నేను కృంగుచున్నాను (2) / యేసయ్యా.. వెలిగించగ రావా / యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| / ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే / ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2) / ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2) / యేసయ్యా.. దర్శించ రావా / యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె||
యేసు రక్తమే జయము జయమురా / సిలువ రక్తమే జయము జయమురా / ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా / తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు|| / బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము / వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2) / శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం / నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2) / మృత్యువునే గెలుచు రక్తము / పాతాలం మూయు రక్తము / నరకాన్ని బంధించిన / జయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు|| / పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము / అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము (2) / శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు? / ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2) / సాతాన్నే నలగ్గొట్టిన / వాడి తలనే చితగ్గొట్టిన / కొదమ సింహమై మేఘారూఢిగా / తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే ||యేసు||
సంతోషముతో నిచ్చెడు వారిని / నెంతో దేవుడు ప్రేమించెన్ / వింతగ వలసిన-దంతయు నొసంగును / వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో|| / అత్యాసక్తితో నధిక ప్రేమతో / నంధకార జను-లందరకు / సత్య సువార్తను జాటించుటకై / సతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో|| / వేద వాక్యమును వేరు వేరు గ్రా / మాదుల నుండెడు బాలురకు / సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి / సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో|| / దిక్కెవ్వరు లేకుండెడి దీనుల / తక్కువ లన్నిటి దీర్చుటకై / నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు / ప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో|| / ఇయ్యండీ మీ కీయం బడు నని / యియ్యంగల ప్రభు యే-సనెను / ఇయ్యది మరువక మదిని నుంచుకొని / యియ్యవలెను మన యీవుల నికను ||సంతోషముతో|| / భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు / యుక్త మటంచు ను-దారతతో / శక్తి కొలది మన భుక్తి నుండి యా / శక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||
హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా (2) / పరమ తండ్రి నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| / పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| / యేసు రాజా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా||
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2) / పంపుము దయ చేత పతిత పావన నామ / పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము|| / మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2) / యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము|| / వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2) / దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము|| / ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2) / భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||
ఒక క్షణమైనా నిన్ను వీడి / ఉండలేనయ్య నా యేసయ్యా (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా|| / నశియించిపోతున్న నన్ను / బ్రతికించినావయ్యా యేసు / కృశించిపోతున్న నాలో / వేంచేసినావయ్యా యేసు (2) / నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా / నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| / మతిలేక తిరిగిన నన్ను / నీ దరి చేర్చినావయ్యా యేసు / శ్రమ చేత నలిగిన నాకు / వరమిచ్చినావయ్యా యేసు (2) / నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా / నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||
కర్తా మమ్మును దీవించి / క్షేమమిచ్చి పంపుము / జీవాహార వార్త నిచ్చి / మమ్మును పోషించుము / ఇహ నిన్ను వేడుకొని / బహుగా స్తుతింతుము / పరమందు చేరి యింక / స్తోత్రము చెల్లింతుము
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4) / ఆదరణ కర్తా సమాధాన కర్త (2) / సర్వ సత్యములోనికి నడిపే / మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| / స గ గ గ గ మ గ రి స ని ద ప / స గ గ గ గ మ గ ని గ మ / స గ గ గ గ మ గ రి స ని ద ప / ప ద ని రి స.. రి స / మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము / సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2) / శక్తి చేత కానే కాదు / బలముతోను కానే కాదు (2) / నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు / నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా|| / దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము / పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2) / ఆత్మ గల వాడే దేవుని వాడు / ఆత్మ మూలముగా జీవించును (2) / విజ్ఞాపనమును చేయును మన పక్షముగా / సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||