ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
విలువైనది నీ ఆయుష్కాలం / తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) / దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం / దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| / బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా / దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా / నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన / నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున / పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) / క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| / మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు / అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు / ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము / ఆదరించువారు లేని కన్నీటి క్షణములు / దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) / దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
చలి రాతిరి ఎదురు చూసే / తూరుపేమో చుక్క చూపే / గొల్లలేమో పరుగునొచ్చె / దూతలేమో పొగడ వచ్చె / పుట్టాడు పుట్టాడురో రారాజు / మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2) / పశుల పాకలో పరమాత్ముడు / సల్లని సూపులోడు సక్కనోడు / ఆకాశమంత మనసున్నోడు / నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2) / సంబరాలు సంబరాలురో / మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి|| / చింతలెన్ని ఉన్నా చెంత చేరి / చేరదీయు వాడు ప్రేమగల్లవాడు / ఎవరు మరచినా నిన్ను మరవనన్న / మన దేవుడు గొప్ప గొప్పవాడు (2) / సంబరాలు సంబరాలురో / మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||
యేసూ… నీకు కావాలని / నన్ను కోరుకున్నావా (2) / నే ఘోర పాపిని ప్రభువా / ఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ (2) / కలుషాల్ని కడిగిన కరుణామయుడా / కన్నీటి గాథను మలిచావా ప్రభువా (2) / ఈ పేద బ్రతుకును అరచేతులలో / చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2) / నేను నేనే కానయ్యా / నాలో నీవే యేసయ్యా (2) / నీ ప్రేమకుప్పొంగిపోనా / ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ|| / దాహముతో ఉన్న నా యేసు ప్రభువా / నీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా (2) / నశియించు ఆత్మల దాహముతో / నను చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2) / నేను నేనే కానయ్యా / నాలో నీవే యేసయ్యా (2) / నీ ప్రేమకుప్పొంగిపోనా / ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ||
స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని / మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) / ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2) / ఆది అంతము లేనివాడు (2) / మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| / జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2) / ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| / గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2) / తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2) ||స్తుతి పాడి||
ఆలకించు దేవా స్తోత్రాలాపన / ఆత్మతో సత్యముతో ఆరాధించెదం / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / నీవు చేసిన మేళ్లను తలచి / మహిమ పరచెదము నిరంతరం / కృతజ్ఞత స్తుతులర్పించెదమ్ / కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో / సంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము / నశించు జనులను రక్షింపను / సిలువలో రక్తము కార్చితివా / నజరేయుడ నిజ రక్షకుడా / రక్షణ ఆనందము స్వస్థత సంతోషము / శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా / ప్రతి విషయములో ప్రార్ధించెద౦ / ప్రతి రోజు ఇల ప్రార్ధించెదం / ప్రజలందరికై ప్రార్ధించెదం / ప్రార్ధననాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా / ప్రార్ధన చేసెదం విజ్ఞాపన చేసెదం
అప్పగింపబడిన రాత్రి / చెప్ప సాగే శిష్యులతో (2) / చెప్పరాని దుఃఖముతో / తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప|| / రొట్టె విరచి ప్రార్ధించి / నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2) / పట్టుదలతో నేనొచ్చుఁ వరకు / ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప|| / ద్రాక్షా రస గిన్నెను చాపి / వీక్షించుడిదియే నా రక్తం (2) / రక్షణార్థం దీని త్రాగి / మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప|| / రాతివేత దూరాన / చేతులెత్తి ప్రభు మోకరించి (2) / నా తండ్రి నీ చిత్తమైతే / ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప|| / ఇదిగో వచ్చె తుది ఘడియ / హృదయ బాధ హెచ్చెను (2) / పదిలపరచు-నట్లు తండ్రిన్ / మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||
మాకు తోడుగ నీవుంటివి / జీవిత యాత్రలో (2) / మమ్ము విడువని మా దేవా / నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు|| / మాతో కూడా ఉందునంటివి / మారని మా దేవా (2) / పరము చేరు వరకు దేవా / మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని|| / శత్రువు మాపై చెలరేగగా / కృంగదీయ జూడగా (2) / యెహోవా నిస్సిగా మాకుండి / విజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని|| / కష్టములెన్నెన్నో ఎదురైనా / నిన్నే వెంబడింతుము (2) / మాకు తోడుగా నీవుండగా / మేము భయపడము (2) ||మమ్ము విడువని||
తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా / యేసు ప్రేమ నీకు గురుతుందా / మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు / ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2) / కపటము కలిగిన గొర్రె / ద్వేషము కలిగిన గొర్రె / ఐక్యత లేని గొర్రె / యేసు ప్రేమ గురుతుందా (2) / మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2) / యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి|| / ప్రార్ధన చేయని మనుష్యుడా / వాక్యము వదలిన మనుష్యుడా / దేవుని మరచిన మనుష్యుడా / యేసు ప్రేమ గురుతుందా (2) / చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2) / మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా (2) ||మంచి||
నీవు లేని క్షణమైనా ఊహించలేను / నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2) / నీవే నా కాపరి – నీవే నా ఊపిరి / నీవే నా సర్వము యేసయ్య / నీతోనే జీవితం – నేనే నీకంకితం / గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| / శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా / నను ధైర్యపరిచె నీ వాక్యం / సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా / నను మునగనీయక లేవనెత్తిన (2) / నీవే నా కండగా – నాతో నీవుండగా / భయమన్నదే నాకు లేదూ / సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా / వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని|| / శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా / అవి నన్ను కాల్చజాలవుగా / దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా / నాకేమాత్రం హాని చేయవుగా (2) / వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన / వేదనలే తొలగించిన యేసయ్యా / సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా / వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||
నమ్ముకో యేసయ్యను / నమ్మకు మనుష్యులను (2) / యోసేపు నమ్మాడు అన్నలను (2) / నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో ||నమ్ముకో|| / సంసోను నమ్మాడు దెలీలాను (2) / నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో ||నమ్ముకో|| / యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2) / నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో ||నమ్ముకో|| / రాజులను నమ్ముట వ్యర్ధమురా (2) / యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు ||నమ్ముకో||
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును / ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2) / నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును / రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా (2) / కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా (2) / అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా (2) / ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా (2) / నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ (2) / తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ (2) / నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా (2) / ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా (2) / రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును (2) / నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును (2)
జాలిగల దైవమా యేసయ్యా / మనసారా స్తుతింతున్ స్తోత్రింతును / నీవు దేవుడు సర్వశక్తుడు (2) / నీ జాలికి హద్దులే లేవు / నీ ప్రేమకు కొలతలే లేవు (2) / అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్ (2) ||జాలిగల|| / నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని / దుఃఖములను భరించితివే (2) / అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| / మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత / నీపైన పడెనే ప్రభూ (2) / అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| / మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే / గాయములచే స్వస్థమైతిమి (2) / నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు||