ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
చెప్పనా చెప్పనా యేసు నీ ప్రేమను / చూపనా చూపనా మార్చిన బ్రతుకును / గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా / ప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2) ||చెప్పనా|| / చీకటి రాత్రిలో చీరు దీపమైన లేక / ఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళ / కంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతో / అయిపోయిందంతా అనుకున్నవేళ / నా చేయి పట్టావు నా వెన్నుతట్టావు / నేనున్నానని నన్ను నిలబెట్టావు ||చెప్పనా|| / నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చి / బాధ కలుగు దేశమందు బలమిచ్చావు / ఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చి / అవమానము తొలగించి బలపరిచావు / అంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చి / నీ చల్లని నీడలో నను దాచావు ||చెప్పనా||
అంబరానికి అంటేలా / సంబరాలతో చాటాలా (2) / యేసయ్య పుట్టాడని / రక్షింప వచ్చాడని (2) / ప్రవచనాలు నెరవేరాయి / శ్రమ దినాలు ఇక పోయాయి (2) / విడుదల ప్రకటించే / శిక్షను తప్పించే (2) ||యేసయ్య|| / దివిజానాలు సమకూరాయి / ఘనస్వరాలు వినిపించాయి (2) / పరముకు నడిపించే / మార్గము చూపించే (2) ||యేసయ్య|| / సుమ వనాలు పులకించాయి / పరిమళాలు వెదజల్లాయి (2) / ఇలలో నశియించే / జనులను ప్రేమించే (2) ||యేసయ్య||
యెహోవా దయాళుడు / ఆయనకే కృతజ్ఞత / స్తుతులు చెల్లించుడి / చీకటి నుండి వెలుగునకు / మరణము నుండి జీవముకు / నన్ను నడిపించితివి / ఆయనకే కృతజ్ఞత / స్తుతులు చెల్లించుడి / కష్టములలో నుండి / ఆపదలలో నుండి / నన్ను విడిపించితివి / ఆయనకే కృతజ్ఞత / స్తుతులు చెల్లించుడి
తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే / ఆటలు పాటలు ఇక్కడేగా / ఆడుదాం కొనియాడుదాం / పాడుదాం నాట్యమాడుదాం (2) / హల్లెలూయా ఆనందమే / హద్దులేని సంతోషమే (2) ||తండ్రి|| / వేచియుండి కనుగొంటిరి / కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం|| / పరిశుద్ధ ముద్దు పెట్టి / పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం|| / పాపానికి మరణించి / క్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం|| / ఆత్మ అనే వస్త్రమిచ్చె / అధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం||
సూడ సక్కని బాలుడమ్మో / బాలుడు కాడు మన దేవుడమ్మో (2) / కన్య మరియ గర్భమున / ఆ పరిశుద్ధ స్థలమున (2) / మనకై జన్మించినాడు / మనలను రక్షించినాడు (2) ||సూడ|| / బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను / లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2) / ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను / ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2) / సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి / పరవశించ సాగెను (2) ||సూడ|| / మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను / మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2) / పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు / మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2) / దివి నుండి భువిపైకి దిగి వచ్చి / మానవులను ప్రేమించెను (2) ||సూడ||
శుద్దుడా ఘనుడా రక్షకుడా / నా కాపరి నీవే నా దేవుడా / శక్తి లేని నాకు బలమిచు వాడా / నా స్నేహితుడా బలవంతుడా / హర్షింతును నిన్ను ఆరాధింతును / స్తుతియింతును నే కీర్తింతును / శక్తి లేని నాకు బలమిచ్చు వాడా / నా స్నేహితుడా బలవంతుడా / రక్షణా ఆధారం నీవే / విమోచనా నీవే యేసయ్యా / నా స్నేహితుడా బలవంతుడా
సాగిపోదును – ఆగిపోను నేను / విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) / ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను / కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2) / నా సహాయకుడు – నా కాపరి యేసే (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) / పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా / పగవాని బానములకైనా – నేను భయపడను (2) / నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) / పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను / ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం (2) / నాకు కేడెము – నా కోటయు యేసే (2) / హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)
పదివేలలో అతిసుందరుడా / నిన్ను నే ఆరాధింతున్ / సూర్యచంద్రులకన్న తేజోమయుడా / నిత్యము ఆరాధింతున్ / నిన్ను నే ఆరాధింతున్ / నిత్యము ఆరాధింతున్ / ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివే / ఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివే / నన్ను ప్రేమించి రక్షించితివే / నీ కృపను చూపించితివే / నిన్ను నే ఆరాధింతున్ / నిత్యము ఆరాధింతున్ / ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునే / తన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునే / పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా / యోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడా / నిన్ను నే ఆరాధింతున్ / నిత్యము ఆరాధింతున్
నాకై నా యేసు కట్టెను / సుందరము బంగారిల్లు / కన్నీరును కలతలు లేవు / యుగయుగములు పరమానందం / సూర్య చంద్రులుండవు / రాత్రింబగులందుండవు / ప్రభు యేసు ప్రకాశించును / ఆ వెలుగులో నేను నడచెదను / జీవ వృక్షమందుండు / జీవ మకుట మందుండు / ఆకలి లేదు దాహం లేదు / తిని త్రాగుట యందుడదు
హోలీ హోలీ… హోలీ హోలీ… (2) / హోలీ హోలీ హోలీ హోలీ / హోలీ… యు ఆర్ హోలీ (2) / వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2) / నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావే / ప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావే / రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే / రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే / అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప|| / అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు / అధికారం ఇచ్చే మహా దేవుడవు / ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు / నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు / నీ రాజ్యము నిలుచును నిరతము / నీదేగా సర్వాధికారము / నీవెవ్వరికి ఇత్తువో వారిదే ఔను భూ రాజ్యము / మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము ||రక్షణ|| / దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజల జీవులు / అన్నియును నీ యందే సృజియింపబడెన్ / సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారములు / అందరును నీ శాసనముకు లోబడును / నీ మాటతో ఏలెడి ప్రభుడవు / నీవొకడివే సృష్టికి కర్తవు / పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే / భూ రాజులు నివాసులు తమ మహిమనంతా తెచ్చి పూజింతురే ||రక్షణ||
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా / ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2) / నీ ఆత్మ చేత అభిషేకించి (2) / నీ కృప చేత బలపరచయ్యా (2) / నే ఉన్నది నీ కోసమే యేసయ్యా / నీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ|| / బలహీనతతో నన్ను బలపరచుము / ఒంటరైన వేళలో ధైర్యపరచుము (2) / కృంగిన వేళ నీ దరి చేర్చి (2) / నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2) ||నే ఉన్నది|| / ఆత్మీయుడవై నన్ను ఆదరించుము / అలసిన వేళ దర్శించుము (2) / అవమానములో నీ దరి చేర్చి (2) / నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా (2) ||నే ఉన్నది||
స్తోత్ర గానం చేసింది ప్రాణం / క్రొత్త రాగం తీసింది హృదయం / నా యేసు ప్రేమ నా మదంతా నిండగా / ధన్యమే ఈ జీవితం / యేసుతో మరింత రమ్యమే / భూమిపై చిన్ని స్వర్గమే / యేసుతో నా ప్రయాణమే / నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| / నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం / కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం / లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే / ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే / యేసులో నిత్యమే ||స్తోత్ర|| / ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం / నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం / లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం / పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే / యేసులో నిత్యమే ||స్తోత్ర||