తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

నిబంధనా జనులం|Nibandhanaa Janulam

నిబంధనా జనులం / నిరీక్షణా ధనులం / ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం / మేము నిబంధనల జనులం / యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే / మోక్షమందు చేరెదము (2) ||నిబంధనా|| / అబ్రాహాము నీతికి వారసులం / ఐగుప్తు దాటిన అనేకులం (2) / మోషే బడిలో బాలురము (2) / యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / విశ్వాసమే మా వేదాంతం / నిరీక్షణే మా సిద్ధాంతం (2) / వాక్యమే మా ఆహారం (2) / ప్రార్ధనే వ్యాయామం – అనుదినము / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / అశేష ప్రజలలో ఆస్తికులం / అక్షయుడేసుని ముద్రికులం (2) / పునరుత్తానుని పత్రికలం (2) / పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / నజరేయుని ప్రేమ పొలిమేరలో / సహించుటే మా ఘన నియమం (2) / క్షమించుటే ఇల మా న్యాయం (2) / భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / క్రీస్తేసే మా భక్తికి పునాది / పునరుత్తానుడే ముక్తికి వారధి (2) / పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2) / ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / ఎవరీ యేసుని అడిగేవో / ఎవరోలే యని వెళ్ళేవో (2) / యేసే మార్గం యేసే జీవం (2) / యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం / నిబంధనా జనులం ||యేసు రాజు||

వాడిపోకముందే|Vaadipoka Munde

వాడుకో… యేసయ్యా…. / పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా / నీ కాడి నే మోస్తానయ్యా – (2) / వాడిపోకముందే నన్ను వాడుకో / పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) / వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| / నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే / నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| / నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే / నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో|| / నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే / నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో|| / నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే / నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో||

వాగ్ధానము|Vaagdhaanamu

రాజుల రాజా ప్రభువుల ప్రభువా / నాతో ఉన్నవాడా / ఇచ్చిన మాట తప్పనివాడా / స్థిరపరచువాడా / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము / నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / నిరంతరము… / ఓ ఓ ఓ ఓ… / ఓ ఓ ఓ ఓ… / ఓ ఓ ఓ… / నీ చిత్తమే జరుగును / నీ సన్నిధే జయమిచ్చును (2) / నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్.. / నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2) / అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2) / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / నిరంతరము…

యెహోవా నిస్సీ|Yehovaa Nissy

యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ / యెహోవా నిస్సీ – అనుచు పాడెదం / మా ధ్వజము విజయ ధ్వజమే (2) / యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా|| / ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును / కలత చెంద కారణమే లేదుగా / సడలకుండ కరముల కాధారమై / శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2) / సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా|| / మనయందున్నట్టి బలము చాలును / నాధుడేసు సెలవిచ్చెను పోదము / ఆయుధములు భుజబలమవసరమా / పరమ దేవునాత్మ మనలో నుండగా (2) / మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా|| / హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం / యేసు నామ శక్తే సామర్ధ్యము / యేసు రాక వరకే పోరాటము / జయము పొందుటే జీవిత ధ్యేయము (2) / సిలువే మన జయ పతాకము (2) ||యెహోవా||

ప్రతి రోజు చూడాలని|Prathi Roju Choodaalani

ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను / పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2) / తనివి తీర చూసినా నా యేసయ్య రూపం / నా హృదయమే పొంగి పొర్లును / నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| / పరలోకమందున పరిశుద్ధ దూతలతో / పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2) / జీవ జలము యొద్దకు నడిపించును / ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును / నా హృదయమే పొంగి పొర్లును / నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| / ఆకాశమందున రారాజుగా వచ్చును / భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2) / కడబూరధ్వని వినిపించును / పరలోక సైన్యముతో వచ్చును / నా హృదయమే పొంగి పొర్లును / నా మనసే సంతోషించును (2) ||ప్రతి||

నీవు లేని చోటేది|Neevu Leni Chotedi

నీవు లేని చోటేది యేసయ్యా / నే దాగి క్షణముండలేనయ్యా / నీవు చూడని స్థలమేది యేసయ్యా / కనుమరుగై నేనుండలేనయ్యా (2) / నీవు వినని మనవేది యేసయ్యా / నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) / నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| / కయీను కౄర పగకు బలియైన హేబేలు / రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు / అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు / మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) / చెవి యొగ్గి నా మొరను / యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| / సౌలు ఈటె దాటికి గురియైన దావీదు / ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు / సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును / గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) / నీ తోడు నీ నీడ / యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||

దివ్య తార|Divya Thaara

వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2) / దివ్య తార దివ్య తార / దివి నుండి దిగి వచ్చిన తార (2) / వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2) / పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య|| / జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2) / మధురమైన పాటలతో మారుమ్రోగెను / క్రీస్తు జన్మమే పరమ మర్మమే / కారు చీకట్లో అరుణోదయమే (2) / తార తార క్రిస్మస్ తార / తార తార దివ్య తార (2) ||దివ్య|| / ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2) / అవనిలో క్రీస్తు శకము అవతరించినది / క్రీస్తు జన్మమే మధురమాయెనే / శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2) / తార తార క్రిస్మస్ తార / తార తార దివ్య తార (2) ||దివ్య|| / పాపలోక జీవితం – పటాపంచలైనది (2) / నీతియై లోకంలో వికసించినది / క్రీస్తు జన్మమే ప్రేమామయమే / చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2) / తార తార క్రిస్మస్ తార / తార తార దివ్య తార (2) ||దివ్య||

సందడి – 3|Sandadi 3

సందడి చేద్దామా – సంతోషిద్దామా / రారాజు పుట్టేనని / గంతులు వేద్దామా – గానము చేద్దామా / శ్రీ యేసు పుట్టేనని (2) / మనసున్న మారాజు పుట్టేనని / సందడి చేద్దామా – సంతోషిద్దామా / మన కొరకు మారాజు పుట్టేనని / సందడి చేద్దామా… / సందడే సందడి… / సందడే సందడి సందడే సందడి / సందడే సందడి (4) / బెత్లహేములో సందడి చేద్దామా / పశుశాలలో సందడి చేద్దామా / దూతలతో చేరి సందడి చేద్దామా / గొల్లలతో చూచి సందడి చేద్దామా (2) / మైమరచి మనసారా సందడి చేద్దామా / ఆటలతో పాటలతో సందడి చేద్దామా / శాలలో చేరి క్రీస్తుని చూచి / సంతోషించి సందడి చేద్దామా / అర్ధరాత్రిలో సందడి చేద్దామా / చుక్కను చూచి సందడి చేద్దామా / దారి చూపగ సందడి చేద్దామా / గొర్రెల విడిచి సందడి చేద్దామా (2) / మైమరచి మదినిండా సందడి చేద్దామా / మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా / శాలలో చేరి క్రీస్తుని చూచి / సంతోషించి సందడి చేద్దామా / రాజును చూచి సందడి చేద్దామా / హృదయమార సందడి చేద్దామా / కానుకలిచ్చి సందడి చేద్దామా / సాగిలపడి సందడి చేద్దామా (2) / మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా / మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా / శాలలో చేరి క్రీస్తుని చూచి / సంతోషించి సందడి చేద్దామా

రాజ్యాలనేలే మహారాజు|Raajyaalanele Maharaaju

రాజ్యాలనేలే మహారాజు / రాజుగా నిన్ను చూడాలని (2) / సింహాసనాన్ని విడిచి ఇలలో / సామాన్యునిగా అరుదెంచెన్ (2) / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) / పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే / పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2) / చీకటినంత పారద్రోల / పావనుడా పవళించావు / ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప / నీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ|| / తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు / బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2) / గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు / పరవిశించిరి నీ రాకతో / ఆనందమాయెను ఈ జగమంతా / రక్షకుడా నీ జన్మతో ||హ్యాప్పీ||

Telugu Songs — Page 31 | UEC Telugu Church