ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
సమాధాన గృ-హంబులోను / సమాధాన-కర్త స్తోత్రములు (2) / క్రీస్తు యేసు మనకిలలో / నిత్య సమాధానము (2) / మద్యపు గోడను కూల ద్రోసెను (2) / నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన|| / పర్వతములు తొలగినను / తత్థరిల్లిన కొండలు (2) / నాదు కృప నిను విడువదనెను (2) / నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన|| / లోకమిచ్చునట్లుగా / కాదు ప్రభు సమాధానము (2) / సత్యమైనది నిత్యము నిల్చును (2) / నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన||
నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి (2) / నా ఇంటి వస్తువులు లెక్క చూడగా (2) / ఏదియు నాకు నష్టముండదు (2) ||నా గుడారము|| / కంచె వేసితివి నా చుట్టు నీవు / ఘనముగా చెప్పితివి నా విషయమై (2) / రాజ్యములు జయించితిని విశ్వాసముతో (2) / కృప వెంబడి కృప చూపుచుండగా (2) / నా కుటుంబీకులు పచ్చిక వలెను / విస్తారమగును నా సంతానము (2) / ఆకు వాడక తన కాలమందున (2) / ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును (2) / పితరులు చూడని వాగ్ధాన ఫలమును / అనుభవించుచుంటిని నీ దయతో (2) / విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు (2) / మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను (2) / ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు / పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద (2) / నా చేతి పనులన్ని సఫలము చేసి (2) / ఆశీర్వాదము నా సొత్తు చేసితివి (2) / యాత్రికుడనై పరదేశిగా నేను / నివసించుచుంటిని గుడారాలలో (2) / మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై (2) / మరచిపోతిని నా జన్మ భూమిని (2) ||నా గుడారము||
దేవునికే మహిమ (2) / యుగయుగములు కలుగును గాక (2) ||దేవునికే|| / దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2) / దానికి మనలను వారసుల జేసెను (2) / వందనములు చెల్లింతుము (2) ||దేవునికే|| / నిలవరమైనది మనకిల లేదని (2) / వల్లభుడు స్థిరపరచెను పరమందు (2) / చెల్లించి స్తుతులను పూజింతుము (2) ||దేవునికే|| / సీయోను పురమగు దేవుని నగరుకు (2) / సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2) / స్తోత్ర గీతములను పాడెదము (2) ||దేవునికే|| / శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2) / ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2) / ముదమారగను ప్రణుతింతుము (2) ||దేవునికే||
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2) / నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2) / ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।। / పరలోక ప్రేమ ఈ ధరలో / ప్రత్యక్షమాయె ప్రతివానికై (2) / ఆదియందున్న ఆ దేవుడు / ఏతెంచె నరుడై ఈ భువికి (2) / ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।। / పాపంధకారములో అంధులుగా / చీకటి త్రోవలో తిరుగాడగా (2) / జీవపు వెలుగైన ఆ ప్రభువు / వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2) / ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।।
నన్ను నీవలె నిర్మించినను / కోల్పోతి దేవా నీ రూపమును / హేయ క్రియలతో సిలువేసినను / నాపై నీ కృపను తొలగించవెందుకు / నిను బాధించినా భరియించితివా / నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె|| / ఎరిగి ఎరిగి చెడిపోతిని / తెలిసి తెలివిగా తప్పిపోతిని (2) / బ్రతికున్న శవమునై నేనుంటిని / అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె|| / భయభక్తులు లేని వెర్రివాడనై / కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2) / ఒక పూటకూటికై ఆశపడితిని / వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె|| / సిల్వలో నీ శ్రమ చూడకుంటిని / కల్వరి ప్రేమను కానకుంటిని (2) / నిన్ను సిలువ వేయమని కేకలేసితి / అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||
మారదయా నీ ప్రేమ / మార్పు రాదయా నీ ప్రేమలో (2) / ఎన్ని మారినా మారని ప్రేమ (2) / యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2) ||మారదయా|| / నిరీక్షించుచుంటిని నీ రాకకై / వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు (2) / అప్పటి వరకు మారదు / నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| / (నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు / నా శ్రమలలో నాకు నీవే జవాబు (2) / అప్పటి వరకు మారదు / నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| / నీ మాటలయందే ఆశ యేసయ్యా / వాగ్ధానములు నాలో నెరవేర్చుమా (2) / అప్పటి వరకు మారదు / నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||
ఫేస్బుక్.. యూట్యూబ్.. ఏదైనా కానీ / నీ ఆత్మకు మేలుకై వాడుకోమని / వాట్సాప్.. మెసెంజర్.. ఏదైనా కానీ / దేవుని మహిమకై వాడుకోమని / నీ చెవిలో అరచి చెప్పనా / రిమైండర్ లా గుర్తు చెయ్యనా / ఓ అన్నా ఓ అక్కా / ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా / యేసయ్య ప్రేమను / మించిందేమి లేదంటూ చాటి చెప్పనా / మండే.. ట్యూస్డే.. ఏ రోజైనా కానీ / దేవుని సన్నిధిని వదలవద్దని / సమ్మర్.. వింటర్.. ఏదైనా కానీ / దేవుని పనికై ముందుండాలని / నీ చెవిలో అరచి చెప్పనా / రిమైండర్ లా గుర్తు చెయ్యనా / ఓ అంకుల్ ఓ ఆంటీ / ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా / యేసయ్య ప్రేమను / మించిందేమి లేదంటూ చాటి చెప్పనా / కోపం.. ఆనందం.. ఏదైనా కానీ / దేవుని ప్రేమను మరువవద్దని / ఫీవర్.. కాఫ్ అండ్ కోల్డ్.. ఏదైనా కానీ / దేవుని స్తుతించడం మానవద్దని / నీ చెవిలో అరచి చెప్పనా / రిమైండర్ లా గుర్తు చెయ్యనా / ఓ అన్నా ఓ అక్కా / ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా / యేసయ్య ప్రేమను / మించిందేమి లేదంటూ చాటి చెప్పనా / చాటి చెప్పనా – (2)
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా / బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా.. / ఓ బాటసారి ఓహో బాటసారి / జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా / గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది / నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / పుట్టగానే తొట్టెలో వేస్తారు / గిట్టగానే పెట్టెలో మూస్తారు / జాగు చేయక కాటికి మోస్తారు / ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2) / బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు / ఏడిపిస్తూ సమాధికి పోతావు / కూడబెట్టినవి మోసుకు పోలేవు / ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. (2) / జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / మరణము ఒక నిద్ర యేసునందు / అంతము అది కాదు క్రీస్తునందు / మృతులు లేచుట స్థిరము యేసునందు / నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. (2) / నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||
నీ నామం అతి మధురం / నీ గానం నే చేసెదను (2) / నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము / ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము (2) / మహోన్నతమైనది యేసు నీ నామము / కీర్తింపతగినది సాటిలేని నీ నామం ||నీ నామం|| / ఆదరించే నామం – ఆశ్రయంబగు నామం / ఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం (2) / అన్ని నామములకు పైన నామం / ఉన్నతంబగు నీ నామం ||నీ నామం|| / జాలి గలిగిన నామం – జాగు చేయని నామం / జవాబు నొసగే నామం – జయమునిచ్చే నామం (2) / జుంటె తేనె కన్న మధురం / జీవ జలమగు నీ నామం ||నీ నామం||
నిన్ను కాపాడువాడు కునుకడు / నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2) / నీ భారము వహియించు యేసు / నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు|| / పలుకరించే వారు లేక పరితపిస్తున్నా / కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2) / కలతలెన్నో కీడులెన్నో / బ్రతుకు ఆశను అణచివేసినా (2) / ఎడబాయడు యేసు నిన్ను / దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| / మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా / పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2) / భీతులెన్నో భ్రాoతులెన్నో / సంతసంబును త్రుంచివేసినా (2) / ఎడబాయడు యేసు నిన్ను / దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా / నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా / స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును / నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి / నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి / ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు ||నీ కృప|| / పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు / పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు / నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ ||నీ కృప|| / నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య) / నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద / చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం ||నీ కృప||
ఆకాశ పక్షులను చూడండి / అవి విత్తవు అవి కోయవు / గరిసెలలో దాచుకోవూ / కొట్లలో కూర్చుకోవు ||ఆకాశ|| / అనుదినము కావలసిన ఆహారము / అందజేయును వాటికి ఆ దేవుడు / కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి / కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ|| / స్వార్ధము వంచన వాటికుండదు / సాటివాని దోచుకొనే మనసు ఉండదు / రేపటిని గూర్చిన చింత ఉండదు / పూట ఎలా గడపాలని బాధ ఉండదు ||ఆకాశ|| / పక్షులను పోషించే ఆ దేవుడు / మనుష్యులను పోషించుట మానివేయునా / సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా / ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ||ఆకాశ||