ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
నీవే నా ప్రాణము నీవే నా సర్వము / నీవే నా జీవము యేసయ్యా (2) / మరువలేను నీదు ప్రేమ / విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| / మార్గం నీవే సత్యం జీవం నీవే / జీవించుటకు ఆధారం నీవే (2) / అపాయము రాకుండా కాపాడువాడవు / నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| / తోడు నీవే నా నీడ నీవే / నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2) / బ్రతుకంతా నీ కొరకై జీవింతును / నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా / నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2) / నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2) / నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో|| / ధరలోని మన్నుతో సమమైన నన్ను / ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2) / అన్నీ నీవే నాకై సమకూర్చినావు / ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2) / వాక్యపు మన్నాతో పోషించిన నన్నే / ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| / దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు / ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2) / మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు / చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2) / పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో / మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||
నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని / ఎంత కష్టమైనా నీలోనే ఉండాలని / ఆశతో ఉన్నాను నా యేసయ్యా / ఆశలు తీర్చే నా మెస్సయ్యా (2) / నువ్వంటే ఇష్టము నా యేసయ్యా / నాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా (2) / నీ వెంటే నేను నడవాలని / నీ ఇంటిలోనికి రావాలని (2) / నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యా / నీ వాత్సల్యతతో నను నింపావయ్యా (2) / అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం / అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే|| / ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతో / ఈ లోకంలో నే పడియుండగా (2) / నీ కృపచేత నను నీవు నిలిపావయ్యా / నీ కరుణతో నను నీవు నడిపావయ్యా (2) / అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం / అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే||
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా / నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2) / మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా / కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె|| / కొట్టబడిన వేళ / నా గాయం కట్టినావే (2) / బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె|| / అణచబడిన వేళ / నా తలను ఎత్తినావే (2) / శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె|| / విడువబడిన వేళ / నను చేరదీసినావే (2) / కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||
ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని / తిన్ననైన మార్గములో నడువకుందువు? / చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవని / నులివెచ్చని జీవితమును విడువనందువు? (2) / విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము? / దేనిపై ఉన్నది నీ లక్ష్యము? (2) / యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ… / ఇంకెందుకు నీకు ఈ రక్షణ? – (2) ||ఎన్ని మార్లు|| / యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినా / లోకమెప్పు కోసమే వెరచియున్నావా / క్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితే / ఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా (2) / పాపమే వేరు చేసెను / దేవుని నుండి మనలనూ / సిలువ యాగమే దారి చూపెను / ఇకనైనా మార్చుకో నీ మనస్సునూ – (2) ||విశ్వాసీ|| / పాపానికి జీతము మరణమని తెలిసినా / ఇహలోక స్నేహమే పాపమని ఎరుగవా / ఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులే / పరలోకం చేరొచ్చనే భ్రమను విడువవా (2) / చేసిన ప్రతి పాపానికి / తీర్పు దినం ఉంది మరువకు / లేదు నీకు నిత్య జీవము / నీ జీవితం మార్పునొందే వరకు – (2) ||విశ్వాసీ||
అపరాధిని యేసయ్యా / కృపజూపి బ్రోవుమయ్యా (2) / నెపమెంచకయె నీ కృపలో / నపరాధములను క్షమించు (2) / సిలువకు నిను నే గొట్టి / తులువలతో జేరితిని (2) / కలుషంబులను మోపితిని / దోషుండ నేను ప్రభువా (2) / ప్రక్కలో బల్లెపుపోటు / గ్రక్కున పొడిచితి నేనే (2) / మిక్కిలి బాధించితిని / మక్కువ జూపితి వయ్యో (2) / ముళ్ళతో కిరీటంబు / నల్లి నీ శిరమున నిడితి (2) / నా వల్ల నేరమాయె / చల్లని దయగల తండ్రి (2) / దాహంబు గొనగా చేదు / చిరకను ద్రావ నిడితి (2) / ద్రోహుండనై జేసితినీ / దేహంబు గాయంబులను (2) / ఘోరంబుగా దూరితిని / నేరంబులను జేసితిని (2) / కౄరుండనై గొట్టితిని / ఘోరంపు పాపిని దేవా (2) / చిందితి రక్తము నాకై / పొందిన దెబ్బల చేత (2) / అపనిందలు మోపితినయ్యో / సందేహమేలనయ్యా (2) / శిక్షకు పాత్రుడనయ్యా / రక్షణ దెచ్చితివయ్యా (2) / అక్షయ భాగ్యము నియ్య / మోక్షంబు జూపితివయ్యా (2)
అర్పించుచుంటిని యేసయ్యా / నన్ను నీ చేతికి (2) / దీనుడను నన్ను నీ బిడ్డగా / ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని|| / ఈ లోక జీవితం అల్పకాలమే / నీవే నా గమ్యస్థానము (2) / నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) / నా హృదయం వెలిగించు (2) / నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని|| / దప్పిగొన్న జింకవలెనే / ఆశతో చేరితి నీ దరి దేవా (2) / సేదతీర్చి జలము నిన్ను (2) / వాడిన బ్రతుకులో (2) / నింపుము జీవము ||అర్పించుచుంటిని||
నా కనుల వెంబడి కన్నీరు రానీయక / నా ముఖములో దుఖమే ఉండనీయక / చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) / ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| / అవమానాలను ఆశీర్వాదముగా / నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) / నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| / సంతృప్తి లేని నా జీవితములో / సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) / నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||
స్తోత్రింతుము నిను మాదు తండ్రి / సత్యముతో ఆత్మతో నెప్పుడు (2) / పరిశుధ్ధాలంకారములతో / దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / శ్రేష్ఠ యీవుల యూట నీవే / శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2) / త్రిత్వమై ఏకత్వమైన త్రి- / లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / దవలవర్ణుడ రత్నవర్ణుడ / సత్యరూపి యనబడువాడా (2) / నను రక్షించిన రక్షకుండవు / నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / సంఘమునకు శిరస్సు నీవే / రాజా నీకే నమస్కారములు (2) / ముఖ్యమైన మూలరాయి / కోట్లకొలది శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / నీదు సేవకుల పునాది / జ్ఞానమునకు మించిన తెలివి (2) / అందముగనూ కూడుకొనుచు / వేడుకొందుము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / రాజ నీకే స్తుతి స్తోత్రములు / గీతములు మంగళ ధ్వనులు (2) / శుభము శుభము శుభము నిత్యం / హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2) ||స్తోత్రింతుము||
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కరుణ చూపి కలత మాన్పె (2) / యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| / నీకేమీ లేదని ఏమీ తేలేదని / అన్నారా నిన్ను అవమాన పరిచారా / తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని / రేపటిని గూర్చి చింతించుచున్నావా / చింతించకన్న యేసు మాటలు మరిచావా / మారాను మధురంగా మార్చెను చూసావా (2) ||కన్నీరేలమ్మా|| / నీకెవరూ లేరని ఏం చేయలేవని / అన్నారా నిన్ను నిరాశపరచారా / పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని / నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా / నేనున్నానన్న యేసు మాటలు మరిచావా / కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) ||కన్నీరేలమ్మా||
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) / ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| / ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) / మారని వీడని ప్రేమే నీదయ్యా / మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం|| / నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2) / నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా / వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం|| / దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2) / శోధన వేదన తీర్చిన యేసయ్యా / తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) ||ఇంత కాలం||
యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) / నీ సన్నిధిలో నిత్యము / నిన్నారాధించెద యేసయ్యా (2) / ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ|| / ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) / నను వెలుగుగా మార్చినది / నాకు జీవమునిచ్చినది (2) / నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| / పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) / నను నీతిగా మార్చినది / నను ఆత్మతో నింపినది (2) / నీ నామము.. నీ నామము ||ఆరాధనా||