ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
హల్లెలూయ స్తుతి మహిమ / ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) / ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / అల సైన్యములకు అధిపతియైన / ఆ దేవుని స్తుతించెదము (2) / అల సంద్రములను దాటించిన / ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| / ఆకాశమునుండి మన్నాను పంపిన / దేవుని స్తుతించెదము (2) / బండనుండి మధుర జలమును పంపిన / ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
ప్రేమించెదన్ అధికముగా / ఆరాధింతున్ ఆసక్తితో (2) / నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ / పూర్ణ బలముతో ప్రేమించెదన్ / ఆరాధన ఆరాధనా / ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) / ఎబినేజరే ఎబినేజరే / ఇంత వరకు ఆదుకొన్నావే (2) / ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ || / ఎల్రోహి ఎల్రోహి / నన్ను చూచావే వందనమయ్యా (2) / నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ || / యెహోవా రాఫా యెహోవా రాఫా / స్వస్థపరిచావే వందనమయ్యా (2) / స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
చేయి పట్టుకో నా చేయి పట్టుకో / జారిపోకుండా నే పడిపోకుండా / యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి|| / కృంగిన వేళ ఓదార్పు నీవేగా / నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2) / మరువగలనా నీ మధుర ప్రేమను / యేసు నా జీవితాంతము (2) / యేసు నా జీవితాంతము ||చేయి|| / శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా / విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2) / విడువగలనా ఒక నిమిషమైననూ / యేసు నా జీవితాంతము (2) / యేసు నా జీవితాంతము ||చేయి||
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2) / వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా / వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా / పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2) / నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా / నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా / పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2) / నరులను రక్షించు – కరుణా నముద్రా / నరులను రక్షించు (3) కరుణా నముద్రా / పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2) / పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా / పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా / జనక కుమారాత్మ – లను నేక దేవ (2) / ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా / ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) / రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| / గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) / తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| / మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా (2) / మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| / మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో (2) / ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| / కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) / క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| / ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2) / సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
యెహోవా నా కాపరి నాకు లేమిలేదు / పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా || / మరణపు చీకటిలో తిరుగుచుండినను / ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా || / పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు / ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా || / నూనెతో నా తలను అభిషేకము చేయున్ / నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా || / చిరకాలము నేను ప్రభు మందిరములో / వసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా ||
నా కోసమా ఈ సిలువ యాగము / నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) / కల్వరిలో శ్రమలు నా కోసమా / కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా || / నా చేతులు చేసిన పాపానికై / నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) / నీ చేతులలో… నీ పాదాలలో… / నీ చేతులలో నీ పాదాలలో / మేకులు గుచ్చినారే (2) / యేసయ్యా నాకై సహించావు / యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా || / నా మనస్సులో చెడు తలంపులకై / నా హృదిలో చేసిన అవిధేయతకై (2) / నీ శిరస్సుపై… నీ శరీరముపై… / నీ శిరస్సుపై నీ శరీరముపై / ముళ్ళను గుచ్చినారే (2) / యేసయ్యా నాకై సహించావు / యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము / ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| / అగమ్య ఆనందమే హృదయము నిండెను / ప్రభుని కార్యములు గంభీరమైనవి / ప్రతి ఉదయ సాయంత్రములు / స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| / సంకట సమయములో సాగలేకున్నాను / దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా / వింటినంటివి నా మొర్రకు ముందే / తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| / కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు / పచ్చిక బయలులో పరుండ జేయును / భోజన జలములతో తృప్తి పరచు / నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| / దేవుని గృహములో సదా స్తుతించెదనూ / సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ / స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు / హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||
నాదు జీవమాయనే నా సమస్తము / నా సర్వస్వమేసుకే నాదు జీవము / నాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు|| / కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను / చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను / ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు|| / సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు / రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను / సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2) ||నాదు|| / కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును / తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ / త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2) ||నాదు||
నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా / స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా / నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా ||నా ప్రాణానికి|| / ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు / కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2) / ఆస్తులున్న వేళలో అక్కున చేరారు / ఆపద సమయాలలో అంతు లేకపోయారు / జంటగా నిలిచితివి నా ప్రాణమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి … ||నా ప్రాణానికి|| / నీవే నా ప్రాణమని కడవరకు విడువనని / బాసలన్ని మరచి అనాథగా నను చేసారు (2) / నేనున్నానంటూ నా చెంతన చేరావు / ఎవరు విడచినా నను విడవనన్నావు / జంటగా నిలిచితివి నా ప్రాణమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి … ||నా ప్రాణానికి||
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2) / నీవు పలికితే నాకు మేలయ్యా (2) / నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| / నీ వాక్యమే నన్ను బ్రతికించేది / నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| / నీ వాక్యమే స్వస్థత కలిగించేది / నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| / నీ వాక్యమే నన్ను నడిపించేది / నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||
యేసే నా పరిహారి / ప్రియ యేసే నా పరిహారి / నా జీవిత కాలమెల్ల / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / ఎన్ని కష్టాలు కలిగిననూ / నన్ను కృంగించె భాదలెన్నో (2) / ఎన్ని నష్టాలు వాటిల్లినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / నన్ను సాతాను వెంబడించినా / నన్ను శత్రువు ఎదిరించినా (2) / పలు నిందలు నను చుట్టినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / మణి మాన్యాలు లేకున్ననూ / పలు వేదనలు వేధించినా (2) / నరులెల్లరు నను విడచినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / బహు వ్యాధులు నను సోకినా / నాకు శాంతి కరువైనా (2) / నను శోధకుడు శోధించినా / ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| / దేవా నీవే నా ఆధారం / నీ ప్రేమకు సాటెవ్వరూ (2) / నా జీవిత కాలమంతా / నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||