ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
ఎనలేని ప్రేమ నాపైన చూపి / నీ వారసునిగ చేసినావు (2) / నీ ప్రేమ నేను చాటెదన్ / నా సర్వం నీవే యేసయ్యా (2) / నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా / నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2) / నీ కృప చేత రక్షించినావే / నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని|| / తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై / ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2) / కన్నీరు తుడచి నన్నాదరించిన / ఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని||
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా / స్తుతి మహిమలు నీకే / నా ఆత్మలో అనుక్షణం / నా అతిశయము నీవే – నా ఆనందము నీవే / నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి|| / నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2) / నీ తోటలోని ద్రాక్షావల్లితో / నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి|| / నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2) / నీకిష్టమైన పాత్రను చేయ / నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి|| / నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2) / త్రియేక దేవా ఆదిసంభూతుడా / నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి||
శాశ్వత కృపను నేను తలంచగా / కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| / నా హృదయమెంతో జీవముగల దేవుని / దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2) / నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| / దూతలు చేయని నీ దివ్య సేవను / ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2) / ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| / భక్తిహీనులతో నివసించుటకంటెను / నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2) / వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| / సీయోను శిఖరాన సిలువ సితారతో / సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2) / సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత|| / నూతనమైన ఈ జీవ మార్గమందున / నూతన జీవము ఆత్మాభిషేకమే (2) / నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||
పోరాటం ఆత్మీయ పోరాటం (2) / చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు / సాగిపోవుచున్నాను / సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) / నా యేసుతో కలిసి పోరాడుచున్నాను / అపజయమే ఎరుగని జయశీలుడాయన (2) / నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / నా యేసు వెళ్ళిన మార్గము లేనని / అవమానములైనా ఆవేదనలైనా (2) / నా యేసు కృపనుండి దూరపరచలేవని (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / ఆదియు అంతము లేనివాడు నా యేసు / ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2) / ఆ సింహాసనం నా గమ్యస్థానం (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||
నీ పద సేవయే చాలు / యేసు నాకదియే పది వేలు / నీ పద సేవయే చాలు / నీ పద జ్ఞానము నాకిలా క్షేమము / నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద|| / నీ నామమునే స్తుతియింపగను / నీ వాక్యమునే ధ్యానింపగను (2) / నీ రాజ్యమునే ప్రకటింపగను (2) / దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| / నీ దరినే నివసింపగను / జీవమునే సాధింపగను (2) / సాతానును నే నెదిరింపగాను (2) / దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| / నీ ప్రేమను నే చూపింపగను / నీ త్యాగమునే నొనరింపగను (2) / నీ సహనమునే ధరియింపగను (2) / దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా / పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ / పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. / నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా / నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా / అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) / లోకాన చాటగా (4) ||నశియించు|| / ఈ లోక భోగము – నీకేల సోదరా / నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా / ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) / ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||
నాదు జీవితము మారిపొయినది / నిన్నాశ్రయించిన వేళ / నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| / చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) / పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) / నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) / ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) / చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా / నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు|| / ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) / ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి / నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||
నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను / నా యేసుడు నా పాపము – నా శాపము / తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| / సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) / పడనీయక దరి చేరనీయక (2) / తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| / సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2) / నేర్పించెను నాకు చూపించెను (2) / వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| / కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2) / నా కోసమే యేసు శ్రమ పొందెను (2) / నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత|| / ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2) / ఏమిత్తును నేనేమిత్తును (2) / నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి / నిన్ను పాడి కీర్తించెదను / యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2) / పరిశుద్ధమైన పరవశమే / పరమ యేసుని కృపా వరమే (2) / వెదకి నన్ను కనుగొంటివి (2) / పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం|| / నూతన నూనె ప్రభావముతో / నూతన కవిత్వపు కృపతోను (2) / నింపి నిత్యము నడిపితివి (2) / నూతన షాలేము చేర్చేడవు (2) ||నీ పాదం|| / ఇరుకు నందు పిలచితివి / నాకు సహాయము చేసితివి (2) / చెడి ఎక్కడ తిరుగకుండా (2) / చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం|| / నిత్యముగ నీ సన్నిధి / నాకు ఇచ్చును విశ్రాంతిని (2) / దుడ్డు కర్ర నీ దండమును (2) / నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం|| / ఫలించు చెట్టు నీవు నిలచు / తీగగా నేను వ్యాపించుటకై (2) / కొమ్మ నరికి కలుపు తీసి (2) / కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం|| / పరిశుద్ధమైన కీర్తితోను / ప్రకాశమైన శిఖరముపై (2) / శీఘ్రముగ చేర్చెదవు (2) / సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||
పరవాసిని నే జగమున ప్రభువా (2) / నడచుచున్నాను నీ దారిన్ / నా గురి నీవే నా ప్రభువా (2) / నీ దరినే జేరెదను / నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| / లోకమంతా నాదని యెంచి / బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) / అంతయు మోసమేగా (2) / వ్యర్ధము సర్వమును / ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| / ధన సంపదలు గౌరవములు / దహించిపోవు నీలోకమున (2) / పాపము నిండె జగములో (2) / శాపము చేకూర్చుకొనే / లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| / తెలుపుము నా అంతము నాకు / తెలుపుము నా ఆయువు యెంతో (2) / తెలుపుము ఎంత అల్పుడనో (2) / విరిగి నలిగియున్నాను / నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని|| / ఆ దినము ప్రభు గుర్తెరిగితిని / నీ రక్తముచే మార్చబడితిని (2) / క్షమాపణ పొందితివనగా (2) / మహానందము కలిగే / నాలో.. మహానందము కలిగే ||పరవాసిని|| / యాత్రికుడనై ఈ లోకములో / సిలువ మోయుచు సాగెదనిలలో (2) / అమూల్యమైన ధనముగా (2) / పొందితిని నేను / యేసునే.. పొందితిని నేను ||పరవాసిని|| / నా నేత్రములు మూయబడగా / నాదు యాత్ర ముగియునిలలో (2) / చేరుదున్ పరలోక దేశము (2) / నాదు గానము ఇదియే / నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||
చీకటి లోయలో నేను పడియుండగా / నీవే దిగి వచ్చి నను కనుగొంటివి / మరణపు గడియలో నేను చేరియుండగా / నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి / నీవే.. దేవా నేవే.. నీవే నీవే / నా ప్రాణ దాతవు నీవే ప్రభు / చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు / ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు / అరణ్యములలో నేను పయనించినను / ఏ అపాయమునకిక భయపడను / నీవే నా మార్గమని నిను వెంబడించెదను / నా చేయి పట్టి నను నడిపించుము / నీకే.. దేవా నీకే.. నీకే నీకే / నా సమస్తము నీకే అర్పింతును / చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు / ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని / శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని / మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు / సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు / భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు / నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
దేవా నీ నామం… పావన ధామం… / బ్రోవుమయ్యా ప్రేమ రూప / నీదు జనులం (2) / నీదు సన్నిధిలో / నిన్ను వేడుకొందుము… వేచియుందుము (2) / నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం / జయించెదము.. స్తుతించెదము (2) ||దేవా|| / శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి / శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2) / బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం / తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2) ||దేవా|| / విన్నపములన్ని విని క్షమియించుము / సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2) / నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం / గెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2) ||దేవా||