తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

యేసయ్యా నా దొరా|Yesayyaa naa doraa

యేసయ్యా నా దొరా / నీ సాటి ఎవరయ్యా ఈ ధర / నా కోసమే వచ్చిన సర్వేశ్వరా / నను విడిపించిన కరుణాకరా / మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా / వేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా|| / మండే నా బ్రతుకే పాటగా / నిండైన నీ బ్రతుకే బాటగా (2) / పండంటి నీ ప్రేమ తోటలో / మెండైన నీ వాక్యపు ఊటలో / దొరికింది నా వరాల మూట / సప్త స్వరాలే చాలవింక నా నోట (2) ||యేసయ్యా|| / నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా / వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2) / మిగిలిన శ్రమలను సంతర్పణలో / కదిలే కన్నీటి అర్చనలో / పండింది నా నోముల పంట / ఎంత పంచినా తరగదు ఈ దేటంట (2) ||యేసయ్యా|| / నా దాగు చోటు నీవేనయ్యా / చికాకు పడక నన్ను కాచేవయ్యా (2) / ఏకాకి నేనింక కాబోనయ్యా / నీ రాక కోసమే ఉన్నానయ్యా / శ్రీమంతుడా సాత్వికుడా / పరిపూర్ణుడా కడు దీనుడా (2) ||యేసయ్యా||

అన్ని కాలంబుల|Anni Kaalambula

అన్ని కాలంబుల – నున్న యెహోవా ని / నెన్నదరంబయో – కన్న తండ్రి / వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు / లున్నతమై యుండ – మున్నె నీకు ||అన్ని|| / నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను / బన్నుగ జేసిన – బలుడ వీవె / ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం / పన్నతతో నేలు – ప్రభుడ వీవె / అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు / నున్న సర్వజ్ఞుoడవు నీవే / ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల / సన్నుతించుటకు నే – జాలుదునా ||అన్ని|| / పుట్టింప నీవంచు – బోషింప నీవంచు / గిట్టింప నీవంచు – గీర్తింతును / నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే / పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు / దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి / పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు / గట్టడచే గడ – ముట్టుదనుక నా / పట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు ||అన్ని|| / కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను / భూరి శుద్ధుడ వీవు – పాపి నేను / సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న / దారిద్రుడే లేడు – తరచి చూడ / సార సద్గుణముల – సంపన్నుడవు నీవు / ఘోర దుర్గుణ సం – చారి, నేను / ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు / నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి ||అన్ని||

విజయ గీతముల్ పాడరే|Vijaya Geethamul Paadare

విజయ గీతముల్ పాడరే / క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) / వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ / నిజ కుమారుని నామమున్ / హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| / మంగళముగ యేసుడే / మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను / నింగిన్ విడిచి వచ్చెను / శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను / రంగు మీరగదన – రక్త బలము వలన / పొంగు నణగ జేసెను / సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ|| / పాపముల్ దొలగింపను / మనలను దన స్వ – రూపంబునకు మార్పను / శాపం బంతయు నోర్చెను / దేవుని న్యాయ – కోపమున్ భరియించెను / పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు / పాప యాగము దీర్చెను / దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ|| / సిలువ మరణము నొందియు / మనలను దనకై – గెలువన్ లేచిన వానికి / చెలువుగన్ విమలాత్ముని / ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి / కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని / సిలువ మోయుచు నీ కృపా / రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||

చూచుచున్నాము నీ వైపు|Choochuchunnaamu Nee Vaipu

చూచుచున్నాము నీ వైపు / మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు / చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను / జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు|| / మేమరులమై యుంటిమి / మార్గము వీడి – మేమందరము పోతిమి / ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి / క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు|| / నిను నమ్ము పాపులకు / వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు / ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు / గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు|| / నీ భయము మాయెదలను / నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను / నీ భయముచే మేము – వైభవ మొందుచు / నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు ||చూచు|| / దయ జూచి మము నెప్పుడు / మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు / దయచేయరానివి – దయచేయుమని కోర / దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు||

రాకడ సమయంలో|Raakada samayamlo

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో / యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) / రావయ్య యేసయ్య – వేగరావయ్యా / రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| / యేసయ్య రాకడ సమయంలో / ఎదురేగె రక్షణ నీకుందా? (2) / లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| / ఇంపైన ధూపవేదికగా / ఏకాంత ప్రార్థన నీకుందా? (2) / యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| / దినమంతా దేవుని సన్నధిలో / వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) / యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| / శ్రమలోన సహనం నీకుందా? / స్తుతియించే నాలుక నీకుందా? (2) / ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రావయ్య|| / నీ పాత రోత జీవితము / నీ పాప హృదయం మారిందా? (2) / నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ||రావయ్య|| / అన్నీటికన్నా మిన్నగను / కన్నీటి ప్రార్థన నీకుందా? (2) / ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ||రావయ్య||