తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

ఏ పాపమెరుగని|Ae Paapamerugani

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా / నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా / ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా / ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప|| / కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా / సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| / చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా / కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప|| / ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా / నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప|| / పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా / సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప|| / బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా / ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప|| / కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా / ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||

ఎంతో వింత యెంతో చింత|Entho vintha yentho chintha

ఎంతో వింత యెంతో చింత / యేసునాధు మరణ మంత (2) / పంతము తో జేసి రంత / సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| / పట్టి కట్టి నెట్టి కొట్టి / తిట్టి రేసు నాధు నకటా (2) / అట్టి శ్రమల నొంది పలుక / డాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| / మొయ్యలేని మ్రాను నొకటి / మోపి రేసు వీపు పైని (2) / మొయ్యలేక మ్రాని తోడ / మూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో|| / కొయ్యపై నేసయ్యన్ బెట్టి / కాలు సేతులలో జీలల్ (2) / కఠిను లంత గూడి కొట్టిరి / ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2) ||ఎంతో|| / దాహము గొన చేదు చిరక / ద్రావ నిడిరి ద్రోహు లకటా (2) / ధాత్రి ప్రజల బాధ కోర్చి / ధన్యుడా దివి కేగె నహహా (2) ||ఎంతో|| / బల్లెముతో బ్రక్కన్ బొడవన్ / పారే నీరు రక్త మహహా (2) / ఏరై పారే యేసు రక్త / మెల్ల ప్రజల కెలమి నొసగు (2) ||ఎంతో||

మీరు బహుగా ఫలించినచో|Meeru Bahugaa Phalinchinacho

మీరు బహుగా ఫలించినచో / మహిమ కలుగును తండ్రికి / ఈ రీతిగా ఫలించినచో / శిష్యులై యుండెదరు (2) / నీరు కట్టిన తోటవలె / నీటి వూటవలె నుండెదరు (2) / క్షామములో తృప్తి నిచ్చి / క్షేమముగా మిమ్ము నడిపించును (2) / బలపరచును మీ యెముకలను (2) / అధికముగా ఫలించుడి (2) ||మీరు|| / చెట్లులేని మెట్టలలో / నదుల ప్రవహింపజేయు ప్రభువు (2) / ఎండియున్న నేలనెల్ల / నీటిబుగ్గలుగా జేయువాడు (2) / మన ప్రభువైన యేసునందు (2) / అధికముగా ఫలించుడి (2) ||మీరు|| / వడిగా ప్రవహించు నదిని బోలి / విస్తరింపజేయు తన శాంతిని (2) / ఐశ్వర్యముతో నింపు మిమ్ము / ముదిమివరకు మిమ్ము మోయువాడు (2) / మన ప్రభువైన యేసునందు (2) / అధికముగా ఫలించుడి (2) ||మీరు|| / పాడెదరు మూగవారు / గంతులు వేసేదరు కుంటివారు (2) / పొగడెదరు ప్రజలెల్లరు / ప్రభుని ఆశ్చర్య కార్యములను (2) / మహిమ ఘనత చెల్లించుచు (2) / హల్లెలూయ పాడెదరు (2) ||మీరు||

ఆశ్చర్యకరుడు|Aascharyakarudu

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / నిత్యుడగు తండ్రి బలవంతుడు / లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి / తిరిగి లేచిన పునరుద్ధానుడు / రండి మన హృదయాలను ఆయనకు అర్పించి / ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము / ఆరాధించెదము / ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన / పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు / రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / సత్య స్వరూపి సర్వాంతర్యామి / సర్వాధికారి మంచి కాపరి / వేలాది సూర్యుల కాంతిని మించిన / మహిమా గలవాడు మహా దేవుడు / రండి మనమందరము – ఉత్సాహగానములతో / ఆ దేవ దేవుని – ఆరాధించెదము / ఆరాధించెదము / ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన / పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు / రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

ఎవరున్నారు నాకిలలో|Evarunnaaru Naakilalo

నీవున్నావని ఒకే ఆశ / నడిపిస్తావని ఒకే ఆశ / ఎవరున్నారు నాకిలలో (2) / నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో / ఎవరున్నారు నాకు యేసయ్యా / ఎవరున్నారయ్యా / నీవున్నావని ఒకే ఆశతో / నడిపిస్తావని ఒకే ఆశలో (2) / ఆదరిస్తావని ఆదుకుంటావని (2) / అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా / ఆశలే అడి ఆశలై / బ్రతుకెంతో భారమై (2) / కలలన్ని కన్నీటి వ్యధలై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / ఆప్తులే దూరమై / బంధు మిత్రులకు భారమై (2) / నా అన్న వారే నాకు కరువై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / యాత్రలో తుఫానులే / నా నావనే ముంచేసినా (2) / అద్దరి చేరే ఆశలే అనగారినా / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||

ఇదియే సమయంబు రండి|Idiye Samayambu Randi

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి / ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి / పాపులనందరిని – తన దాపున చేర్చుటకై / ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా / మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక|| / రాజుల రాజైన యేసు రానై యుండెనుగా / గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి / తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక|| / బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే / సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే / తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక|| / వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు / తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ / మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును ||ఇక|| / సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను / గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి / మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ ||ఇక|| / జాలము చేయకను – మీరు హేళన చేయకను / కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ / తరుణముండగానే – మీరు త్వరపడి రారండి ||ఇక||

ప్రీతిగల మన యేసు|Preethigala Mana Yesu

ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు / మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును / క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్ / శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును / నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు / మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను / భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను / క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు / దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు / మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును / భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్ / జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును / ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా? / పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు / నారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెను / కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును

ప్రార్థన శక్తి నాకు|Praarthana shakthi naaku

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా / నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) / యేసయ్యా కావాలయ్యా / నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || / ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి / నేను ప్రార్థింపగ దయచేయుమా (2) / ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) / నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || / సింహాల గుహలోని దానియేలు శక్తి / ఈ లోకంలో నాకు కావలయ్యా (2) / నీతో నడిచే వరమీయుమా (2) / నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || / పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి / నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) / చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) / ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||