ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు / నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ|| / పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ / నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| / కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు / యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ|| / ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని / నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ|| / అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు / మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ|| / జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు / మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ|| / సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు / తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ|| / చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు / నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ|| / అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు / మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ|| / బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు / గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||
నీ వాక్యమే నన్ను బ్రతికించెను / బాధలలో నెమ్మదినిచ్చెను (2) / కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా / వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| / జిగటగల ఊభినుండి లేవనెత్తెను / సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) / నా పాదములకు దీపమాయెను (2) / సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| / శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై / యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) / అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) / ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే|| / పాలవంటిది జుంటి తేనె వంటిది / నా జిహ్వకు మహా మధురమైనది (2) / మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2) / రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా / నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా / యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును / నా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| / నా బాల్యమంతా నా తోడుగ నిలిచి / ప్రతి కీడు నుండి తప్పించినావు / యవ్వనకాలమున నే త్రోవ తొలగిన / మన్నించి నాతోనే కొనసాగినావు / ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో / నను దైర్యపరిచి నను ఆదుకున్నావు / యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ ||నా జీవిత|| / కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే / సంతోష ఉదయాలు నాకిచ్చినావు / హృదయాశలన్ని నెరవేర్చినావు / యోగ్యుడను కాకున్న హెచ్చించినావు / ఎంతో ప్రేమ మితిలేని కృపను / నాపై చూపించి నను హత్తుకున్నావు / యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ ||నా జీవిత||
శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం / జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం / సాటిలేని నామం – స్వస్థపరచే నామం / అన్ని నామముల కన్నా నిత్యమైన నామం / యేసు నామం మధుర నామం / యేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన|| / త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం / దుష్ట శక్తులు బంధకములు తొలగించే / తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2) / మారని నామం మహిమ నామం / మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన|| / జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం / కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం / భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2) / మారని నామం మహిమ నామం / మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన||
నాలో ఉన్న ఆశలన్నియు / నాలో ఉన్న ఊహలన్నియు / నాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా (2) / యేసయ్యా నీవే నా మార్గం / యేసయ్యా నీవే నా సత్యం / యేసయ్యా నీవే నా జీవం / నీవే నా ప్రాణం / నాకున్నవన్ని నీకే యేసయ్యా / నాలోన నిన్ను దాచానేసయ్యా (2) / నీ చేతులలో నా రూపమునే ముద్రించితివి / నా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి (2) / పరిశుద్ధమైన రక్తము ద్వారా / పాపాలన్ని కడిగివేసితివి ||యేసయ్యా|| / నా కోసమే ఈ భువికి వచ్చితివి / నా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి (2) / నా హృదయములో నీ వాక్యమునే నే ఉంచితిని / నీ రాకకై నేను వేచి ఉంటిని (2) / పరిశుద్ధమైన నీ చేతులలో / నీ రూపములో నన్ను చేసితివి ||యేసయ్యా||
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా / చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన / నీ నేత్రాలంకృతము (2) / పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో / క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) / ఆప్యాయతకు నోచుకొనని / నను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న|| / అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు / తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) / అగ్ని వంటి శోధనలను / తప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న||
యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం / యేసయ్యా నీ మాట – నా దీపం / పసి ప్రాయముల నీదు ఒడిలో / నివసించెదను చిరకాలములు ||యేసయ్యా|| / గాలి వానలో వెలిగే దీపం ఆరదా? / ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు / నీ మాటలే నా జీవం / నీ వెలుగే నా ప్రాణం / నీ గానమే నా పాణం / నీ రూపమే నా దీపం ||యేసయ్యా|| / విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు / అపురూప భావాలతో రాగం నీకే అంకితం / నీ పరలోకం చూడాలని / నీ దర్శనం నే పొందాలని / నీ స్వరమే నే వినాలని / ఆశించెద ప్రతి క్షణము ||యేసయ్యా||
చింతెందుకు మీకు దిగులెందుకు / మన ప్రియులు లేరని బాధెందుకు (2) / కష్టాలు లేని కన్నీళ్లు లేని / పరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు|| / శాశ్వతము కాదు ఈ లోకము / మన గమ్యస్థానము పరలోకము (2) / ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు / తప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు|| / ఒకరోజు మన ప్రియుని చూస్తామనే / నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2) / ఆ రోజు వరకు పరదైసులోన / అబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు||
సమీపించరాని తేజస్సులో నీవు / వసియించు వాడవైనా / మా సమీపమునకు దిగి వచ్చినావు / నీ ప్రేమ వర్ణింప తరమా (2) / యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది / యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| / ధరయందు నేనుండ చెరయందు పడియుండ / కరమందు దాచితివే / నన్నే పరమున చేర్చితివే (2) / ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| / మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి / నా స్థితి మార్చినది / నన్నే శ్రుతిగా చేసినది (2) / తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||
నువ్వు లేని నన్ను ఊహించలేను / నీ ఉన్నత ప్రేమను వివరించలేను (2) / అడగాలని నేను అనుకోకముందే / నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు (2) / నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు / యేసయ్యా… నీవే నా ఆరాధ్య దైవమా / యేసయ్యా… నీవే నా ఆధార దీపమా (2) ||నువ్వు లేని|| / పదివేలలో అతి సుందరుడా / కురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావు / ఎందుకు పనికిరాని వాడనై యుండగా / నీ కుమారునిగా నను స్వీకరించావు (2) ||అడగాలని|| / ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడా / ఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావు / ఈ లోకము వీడి నిన్ను చేరేంత వరకు / పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచావు (2) ||అడగాలని||
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని / గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ / రాజుల రాజువని రక్షణ దుర్గమని / నీ కీర్తిని నేను కొనియాడెదన్ / హల్లెలూయా నా యేసునాథా / హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప|| / అద్భుత క్రియలు చేయువాడని / ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2) / అద్వితీయుడవని ఆదిసంభూతుడని / ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా|| / సాగరాన్ని రెండుగా చేసినాడని / సాతాను శక్తులను ముంచినాడని (2) / సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని / సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||
సంతోషమే సమాధానమే (3) / చెప్ప నశక్యమైన సంతోషం (2) / నా హృదయము వింతగ మారెను (3) / నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే|| / తెరువబడెను నా మనోనేత్రము (3) / క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| / ఈ సంతోషము నీకు కావలెనా (3) / నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| / సత్య సమాధానం నీకు కావలెనా (3) / సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| / నిత్యజీవము నీకు కావలెనా (3) / నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| / మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3) / మోక్ష రాజునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| / యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) / ప్రవేశించు నీ హృదయమందు (2) ||సంతోషమే||